Top
logo

Live Updates: ఈరోజు (సెప్టెంబర్-19) ఆంధ్రప్రదేశ్ బ్రేకింగ్ న్యూస్!

Live Updates: ఈరోజు (సెప్టెంబర్-19) ఆంధ్రప్రదేశ్ బ్రేకింగ్ న్యూస్!
X
Highlights

ఈరోజు బ్రేకింగ్ న్యూస్, 19 సెప్టెంబర్, 2020: హెచ్ఎంటీవీ లైవ్ బ్లాగ్ ద్వారా తాజా వార్తలు ఎప్పటికప్పుడు మీకోసం అందిస్తుంది. ఇక్కడ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన వార్తా విశేషాలను, తాజా సమాచారాన్నిఎప్పటికప్పుడు మీకోసం బ్రేకింగ్ గా ఇస్తున్నాం.

ఈరోజు పంచాంగం

ఈరోజు శనివారం | 19 సెప్టెంబర్, 2020 |శ్రీ శార్వరి నామ సంవత్సరం.. దక్షిణాయనం | అధిక ఆశ్వయుజ మాసం | శుక్లపక్షం | విదియ: మ.12-34వరకు తదుపరి తదియ | హస్తనక్షత్రం ఉ.8-00 వరకు తదుపరి చిత్త | వర్జ్యం: మ.3-26 నుంచి 4-55 వరకు | అమృత ఘడియలు: రా.12-22 నుంచి 1-51 వరకు | దుర్ముహూర్తం: ఉ.5-52 నుంచి 7-28 వరకు | రాహుకాలం: ఉ.9-00 నుంచి 10-30 వరకు | సూర్యోదయం: ఉ.5-52 | సూర్యాస్తమయం: సా.5-58

తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలు నిన్న అంకురార్పణతోహనం లాంచనంగా ప్రారంభం అయ్యాయి.

ఈరోజు ధ్వజారోహణ కార్యక్రమంతో బ్రహ్మోత్సవ వైభవం ప్రారంభం కానుంది.

ఈరోజు తాజా వార్తలు

Web Titlebreaking-news-19th-September-live-updates-latest-andhra-pradesh-news-latest-telugu-news

Live Updates

 • 19 Sep 2020 12:32 PM GMT

  Vijaaywada Updates: ప్రపంచ బ్యాంక్ నిబంధనల ఆధారిత ప్రాజెక్టులు ఉంటాయి: ఆర్ అండ్ బీ, ప్రిన్సిపల్ సెక్రెటరీ కృష్ణబాబు

  విజయవాడ

  - ప్రాజెక్టు టెండర్ల విషయంలో ఎవరైనా భౌతికంగా అడ్డుకుంటే చర్యలుంటాయి

  - 25 టెండర్ బిడ్లు మాత్రమే వచ్చాయి

  - పారదర్శకంగా, నిష్పక్షపాతంగా టెండర్లు చేసిన విషయం బహిర్గతం కావాలి

  - ప్రస్తుత‌ టెండర్లను రద్దు చేసి మరల టెండరుకు వెళ్ళాలని సీఎం ఆదేశించారు

  - అర్హత విషయంలో చాలా కంపెనీలు ఉన్నా, పద్నాలుగు కంపెనీలే టెండరు వేయడానికి కారణం తెలుసుకుంటాం

  - ఉన్న టెండర్లకు చాలా తక్కువ స్పందన వచ్చినందున రీటెండరింగ్ కు వెళుతున్నాం

  - ప్రపంచ బ్యాంకు నియమాల ప్రకారం గత రెండు సంవత్సరాలలో ఒక కంపెనీ వంద కోట్ల టర్నోవర్ కలిగి ఉండాలి

  - కాంట్రాక్టరు త్వరితగతిన కాంట్రాక్టు పూర్తిచేసే సామర్ధ్యం కలిగి ఉండాలి

  - ఎక్కువమంది టెండరులో పాల్గొనేలా చేస్తే, రాష్ట్రంలో మరింత ఎక్కువ కిలోమీటర్లు అభివృద్ధి చేసే అవకాశం ఉంది

  - జ్యుడీషియల్ ప్రివ్యూ కమీషన్, రివర్స్ బిడ్డింగ్ కూడా పారదర్శకత కోసమే

  - కాంట్రాక్టర్లకు బ్యాంకులలో లిక్విడిటీ, కోవిడ్ కారణంగా లేబర్ అందుబాటు ఇబ్బదులు ఉండచ్చు

  - నిధుల లభ్యత లేదు అనే ప్రశ్నలేని ప్రాజెక్టు ఇది

  - అర్హత కలిగిన కాంట్రాక్టర్లతో సంప్రదించమని ఇంజనీర్లకు ఆదేశాలు జారీ చేసాం

  - బ్యాంక్ గ్యారంటీ, జీపీఏ మాత్రమే హార్డ్ కాపీలు ఇవ్వాల్సి ఉంటుంది

  - ఏ రకమైన సమస్య ఉన్నా కాంట్రాక్టింగ్ ఏజెన్సీలు సరాసరి ఛీఫ్ ఇంజనీర్ కు సంప్రదించవచ్చు

  - టెండరు విషయంలో ఎలాంటి ఇబ్బంది ఉన్నా ప్రభుత్వం నుంచీ పూర్తి జాగ్రత్తలు తీసుకుంటుంది

 • 19 Sep 2020 11:54 AM GMT

  Loksabha Updates: అమరావతి భూములలో ఇన్సైడర్ ట్రేడింగ్ పై నిష్పాక్షిక దర్యాప్తు జరగాలి

  జాతీయం

  - మీడియా పై నిషేధం విధించి ఏపీ హైకోర్టు దర్యాప్తును ఆపేసింది

  - రైతుల ప్రయోజనాలను కాపాడే బదులు హైకోర్టు ఉత్తర్వులు బలమైన వారిని కాపాడే విధంగా ఉన్నాయి

  - అవినీతి కేసులలో దర్యాప్తు లను ఆపివేయడం ఒక ప్రమాదకర ధోరణి గా స్థిరపడుతుంది

  - రాజ్యాంగం ప్రకారం చట్టం ముందు అందరూ సమానులే

  - కేసు తీవ్రతను గుర్తించి కేంద్ర ప్రభుత్వం దీనిపై వెంటనే సిబిఐ దర్యాప్తు ప్రారంభించాలి

  -  లోక్సభ జీరో అవర్లో లావు శ్రీకృష్ణదేవరాయలు, వైఎస్ఆర్సీపీ ఎంపీ

 • Amaravati Updates: విలేజ్ హార్టికల్చర్ అసిస్టెంట్ పోస్టుల నియామకం కొరకు నోటిఫికేషన్ జారీ...
  19 Sep 2020 11:51 AM GMT

  Amaravati Updates: విలేజ్ హార్టికల్చర్ అసిస్టెంట్ పోస్టుల నియామకం కొరకు నోటిఫికేషన్ జారీ...

  అమరావతి

  - గ్రామ సచివాలయాల్లో ఖాళీగా ఉన్న 1783 విలేజ్ హార్టికల్చర్ అసిస్టెంట్ పోస్టుల నియామకం కొరకు నోటిఫికేషన్ జారీ...

  - గతంలో ఇచ్చిన నోటిఫికేషన్ లో పేర్కొన్న విద్యార్హతల నుండి కొన్నింటిని తొలగించినట్లు ప్రకటనలో తెలిపిన ఉద్యానవన శాఖ కమిషనర్ చిరంజీవి చౌదరీ

  - ప్రస్తుతం నిబంధనల ప్రకారం ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుండి ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చర్ రీసెర్చ్ గుర్తించిన 4 సంవత్సరాల బిఎస్సి (హార్టికల్చర్) లేదా వైఎస్సార్ ఉద్యాన యూనివర్సిటీ నుండి 2 సంవత్సరాల డిప్లొమో (హార్టికల్చర్) పూర్తిచేసినవారు అర్హులు

  - ఈ నెల 25 న నిర్వహించనున్న పరీక్షలకు అర్హతలు ఉన్నవారికే హాల్ టికెట్లు పంపించడం జరుగుతుంది- చిరంజీవి చౌదరి

 • Nara Lokesh: జ‌గ‌న్ కుడి చేతికి రూపాయిచ్చి.. ఎడమ చేతితో ప‌ది రూపాయిలు కొట్టేస్తున్నారు: నారా లోకేష్
  19 Sep 2020 8:27 AM GMT

  Nara Lokesh: జ‌గ‌న్ కుడి చేతికి రూపాయిచ్చి.. ఎడమ చేతితో ప‌ది రూపాయిలు కొట్టేస్తున్నారు: నారా లోకేష్

  అమరావతి:   నారా లోకేష్...

  అధికారంలోకి వచ్చిన తరువాత కొత్తగా ఒక్క రోడ్డు వేసింది లేదు

  కనీసం గుంతలు కూడా పూడ్చని వైకాపా ప్రభుత్వం రోడ్డు అభివృద్ధి పన్ను విధించడం ఘోరం.

  పీల్చే గాలిపై కూడా జగన్ రెడ్డి గారు శిస్తు వసూలు చెయ్యడం ఖాయం.

  పొరుగు రాష్ట్రాల కంటే అధికంగా పెట్రోల్, డీజిల్ ధరలు పెంచి ప్రజల్ని దోచుకుంటున్నారు.

  పెట్రోల్, డీజిల్ పై అదనంగా రూ.5 వసూలు చేస్తూ ప్రజలపై వేసిన భారం ఏడాదికి రూ.2500 కోట్లు.

  కుడి చేత్తో రూపాయి ఇచ్చి ఎడమ చేత్తో 10 రూపాయిలు కొట్టేయడమే జగన్ గారి రివర్స్ టెండరింగ్ ప్రక్రియ మహత్యం.

 • 19 Sep 2020 8:23 AM GMT

  వారికి ఇండ్ల స్థలాలు ఎక్క‌డ ఇచ్చారు

  మా ఎంపీలు జీఎస్టీ గురించి , ఇతర హామీల గురించి కేంద్రాన్ని నిరంతరం పోరాటం చేస్తూనే ఉన్నారు.

  చంద్రబాబు హయాంలో జరిగిన ఫైబర్ గ్రిడ్ అవినీతిపై సీబీఐ విచారణ గురించే మేము కోరాం.

  వైసీపీ కానీ, ప్రభుత్వం కానీ ఐఏఎస్ లకు జడ్జీలకు, జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు ఇచ్చినట్టు ఎక్కడ చెప్పలేదు.

  చంద్రబాబే ఇవన్నీ బయటపెట్టారు.

 • 19 Sep 2020 8:19 AM GMT

  ఏ వ్యవస్థ అయినా రాజ్యాంగానికి లోబడే: పేర్నీ నాని

  అమరావతి: రాజ్యాంగ పరంగా ఏర్పాటు చేసుకున్న ఏ వ్యవస్థ అయినా దానికి లోబడే వ్యవహరించాల్సి ఉంటుంది. 

  ఏపీ లో మాత్రం అందుకు భిన్నంగా పరిస్థితులు ఉన్నాయి. 

  రాష్ట్రంలో న్యాయ వ్యవస్థ ఎలా వ్యవరిస్తోందో పార్లమెంటులో వైసీపీ వివరించే ప్రయత్నం చేస్తుంటే టీడీపీ ఎంపీలు సయిందవుల్లా వ్యవహరించారు.

  చంద్రబాబుకు అన్ని వ్యవస్థలను రాష్ట్రంలో దుర్వినియోగం చేశారు.

  రాజ్యాంగానికి లోబడి ఉంటే ఏ వ్యవస్ధ కూడా ఏ అంశాన్ని అడ్డుకోకూడదు. కానీ దానికి విరుద్ధంగా ఉన్నాయి.

  ఈ విషయాన్ని సుప్రీంకోర్టు పరిగణనలోకి తీసుకోవాలి.

  భ్రష్టు పట్టిన వ్యవస్థల్లో నాలుగో స్థంభం కూడా చేరింది.

  పెట్రోలు, డిజిల్ పై రూపాయి పెంచితే కొందరు గుండెలు బాదుకుంటున్నారు.

  గతంలో అమరావతి నిర్మాణం కోసం చంద్రబాబు 2 రూపాయలు వడ్డిస్తే ఎవరికి కనిపించలేదు. 

  అలాగే మోడీ ఇప్పటి వరకు డిసెంబర్ నుంచి 10 రూపాయలు పెంచితే ఎవరికి కనపడలేదు.

  రోడ్ల మరమ్మతులు నిర్మాణం కోసం అని జీవో లో కూడా ప్రస్తావించారు.

  ఆర్డినెన్స్ లో స్పష్టంగా ఉంది.

  రోడ్లు నిర్మాణం కోసం మాత్రమే ఈ పన్ను వసూలు చేశాం. 

 • 19 Sep 2020 8:10 AM GMT

  Vijayawada: 17అక్టోబరు నుంచి దుర్గమ్మ ఉత్స‌వాలు

  విజయవాడ:  దసరా మహోత్సవాలు 17అక్టోబరు నుంచీ జరుగుతాయని దేవాదాయ శాఖామంత్రి, వెలంపల్లి శ్రీనివాస్ తెలిపారు. 

  - అన్ని డిపార్ట్మెంట్ల అధికారులతో ఏర్పాట్లుపై చర్చించాం. 

  - ప్రతీరోజూ పదివేల మంది దర్శనం చేసుకునేలా ఆన్ లైన్ టికెట్లు

  - కోవిడ్ నిబంధనలు అనుసరించి దర్శనం చేసుకోవాలి. 

  - ఆన్ లైన్ టికెట్లు ఉన్న వారికే దర్శనం. 

  - నిర్దేశించిన టైం స్లాట్ ప్రకారం దర్శనం చేసుకోవాలి. 

  - ఆయా డిపార్ట్మెంట్ల బాధ్యతల ప్రకారం పనిచేస్తాయి. 

  - భక్తులందరూ కరోనా నేపథ్యంలో సహకరించాలి. 

  - చాలా సేవాకార్యక్రమాలు పరోక్షంగా జరిపించేలా ఏర్పాటు. 

 • Antharvedi: అంతర్వేది ఆల‌య ర‌థ నిర్మాణానికి అంకురార్ఫ‌ణ‌
  19 Sep 2020 8:05 AM GMT

  Antharvedi: అంతర్వేది ఆల‌య ర‌థ నిర్మాణానికి అంకురార్ఫ‌ణ‌

  తూర్పుగోదావరి -రాజమండ్రి:  సఖినేటిపల్లి మండలం అంతర్వేది శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి వారి నూతన రథం నిర్మాణానికి అంకురార్పణ

  రావులపాలెంలోని వానపల్లి కలప డిపోలో బస్తరు టేకు కలపను సైజులు కోతకు శ్రీకారం చుట్టిన దేవదాయ శాఖ అధికారులు

  అంతర్వేది ఆలయ ప్రత్యేక అధికారి రామచంద్రమోహన్, రథం తయారు చేసే గణపతి ఆచార్యుల పర్యవేక్షణలో రథం కలప కోత పనులు

  ఐదురోజుల పాటు కలపను తగిన సైజులలో సిద్ధం చేయడానికి సమయం

  ముందుగా వేదపండితులతో పూజాధికాలు నిర్వహించిన దేవదాయశాఖ అధికారులు

  అంతర్వేదికి కలప తరలించి 15రోజులలో రథం తయారీ పనులు మొదలు పెట్టనున్న గణపతి ఆచార్యులు

 • Ananthapuram: చాగల్లు రిజర్వాయర్ కు భారీగా వరద నీరు
  19 Sep 2020 6:59 AM GMT

  Ananthapuram: చాగల్లు రిజర్వాయర్ కు భారీగా వరద నీరు

  అనంతపురం: పెద్దపప్పూరు మండలం చాగల్లు రిజర్వాయర్ కు భారీగా వరద నీరు.

  పెన్నా నదికి 1200 క్యూసెక్కుల నీరు విడుదల చేసిన అధికారులు.

  తాడిపత్రి వద్ద ఉదృతంగా ప్రవహిస్తున్న పెన్నానది ,లోతట్టు ప్రాంతాలను అప్రమత్తం చేసిన అధికారులు...

 • IPL: బెట్టింగ్ లకు పాల్పడితే కఠిన చర్యలు
  19 Sep 2020 6:55 AM GMT

  IPL: బెట్టింగ్ లకు పాల్పడితే కఠిన చర్యలు

  పశ్చిమ గోదావరి జిల్లా:

  పాలకొల్లు ఐ. పి.ల్ క్రికెట్ మ్యాచ్ లుకు ఎవరైనా బెట్టింగ్ లకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటాం పట్టణ సి.ఐ ఆంజనేయులు

  గతంలో క్రికెట్ బుకీలగా దొరికిన వారిపై బ్యాండోవర్ కేసులు నమోదు చేస్తున్నాం.

Next Story