Live Updates: ఈరోజు (19 అక్టోబర్, 2020 ) ఆంధ్రప్రదేశ్ బ్రేకింగ్ న్యూస్!

ఈరోజు పంచాంగం

ఈరోజు సోమవారం | 19 అక్టోబర్, 2020 | శ్రీ శార్వరి నామ సంవత్సరం.. దక్షిణాయనం | నిజ ఆశ్వయుజ మాసం | శుక్లపక్షం | తదియ సా.06-47 వరకు తదుపరి చవితి | విశాఖ నక్షత్రం రా.11-04 వరకు తదుపరి అనురాధ | వర్జ్యం: మ.02-49 నుంచి 04-19 వరకు | అమృత ఘడియలు రా.11-50 నుంచి 12-47 వరకు | దుర్ముహూర్తం: మ.12-10 నుంచి 12-57 వరకు తిరిగి మ. 02-30 నుంచి 03-17 వరకు | రాహుకాలం: ఉ.07-30 నుంచి 09-00 వరకు | సూర్యోదయం: ఉ.05-57 | సూర్యాస్తమయం: సా.05-35

ఈరోజు తాజా వార్తలు

Show Full Article

Live Updates

  • 19 Oct 2020 5:54 AM GMT

    అమరావతి....

    hmtv తో డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాస్...

    ఇటీవల నా వ్యాఖ్యలు వక్రీకరించి రాద్ధాంతం చేస్తున్నారు..

    నా రాజకీయ జీవితంలో ఎప్పుడూ ఎవరినీ కించపరిచే వ్యాఖ్యలు చెయ్యలేదు..

    నాపై ఇప్పటివరకూ ఎలాంటి ఆరోపణలు లేవు.. ఇటీవల కావాలని సృష్టిస్తున్నారు..

    వ్యవసాయ పనులు ఎక్కువగా ఉన్నప్పుడు ఉపాధి హామీ పనులు కాస్త మార్చాలని అధికారులకు సూచన చేశా..

    ఉపాధి హామీ పనుల వల్ల వ్యవసాయ పనులకు ఎవరూ రావడం లేదు.. దీంతో రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు..

    దాన్ని వక్రీకరించి తప్పుడు ప్రచారం చేస్తున్నారు..

    ఉపాధి హామీ పథకం చాలా గొప్పది.. లక్షలాది మందికి ఉపాధి వచ్చింది..

    రైతులు స్వార్ధ రాజకీయ నాయకుల వలలోకి పడకూడదు అనేది నా విన్నపం..

    రైతులు ఎప్పుడూ ఆనందంగా ఉండాలని కోరుకునే వ్యక్తిని నేను..

    ప్రతిపక్షం అనేది ప్రభుత్వం తప్పు చేస్తే విమర్శించాలేగాని.. చేసిందల్లా తప్పు అనేలా ఉండకూడదు..

    సరైన విమర్శలు చేస్తేనే ప్రతిపక్షం అనిపించుకుంటుంది..

    బీసీలకు చంద్రబాబు ఎప్పుడూ గౌరవం ఇవ్వలేదు.. న్యాయం చెయ్యలేదు..

    టీడీపీ బీసీలను కేవలం ఓట్ బ్యాంక్ గా మాత్రమే వాడుకుంది..

    సీఎం జగన్ బీసీలు గర్వపడేలా అవకాశాలు ఇస్తున్నారు..

  • 19 Oct 2020 5:53 AM GMT

    విజయవాడ

    దివ్య తేజస్విని కేసులో కొత్త కోణం

    నాగేంద్ర మాస్టర్ ప్లాన్ కు బలైన దివ్య తేజస్విని

    దివ్య తేజస్విని కేసును పోలీసులు లోతుగా విచారించే కొద్ది అశ్చర్యపరుస్తున్న నమ్మలేని నిజాలు

    నాగేంద్ర ను దివ్య తేజస్విని దూరం పెట్టడంతో కోపం పెంచుకున్న నాగేంద్ర

    దివ్య తేజస్విని వివాహం చేసుకున్నట్లు ఫోటో మార్ఫింగ్ చేసినట్లు గుర్తించిన పోలీసులు

    దివ్య స్నేహితుల సహాయంతో ఫేస్ బుక్, ఇన్ స్టాగ్రామ్ నకిలీ అకౌంట్ సృష్టించి వేధింపులు చేస్తున్నట్లు ప్రాధమిక అంచనాకు వచ్చిన పోలీసులు

    స్నేహితులు కొద్ది మందికి మాత్రమే అమె ఫేస్ బుక్, ఇన్ స్టా గ్రామ్ అకౌంట్ యాక్సిస్ ఇచ్చిన దివ్య తేజస్విని

    దివ్య తేజస్విని ఫేస్ బుక్, ఇన్ స్టా గ్రామ్ అకౌంట్ లో యాక్సిస్ ఉన్న స్నేహితులను విచారించేందుకు రంగం సిద్దం చేస్తున్న పోలీసులు

  • 19 Oct 2020 1:55 AM GMT

    తిరుమల సమాచారం

    నిన్న శ్రీవారిని దర్శించుకున్న 17,915 మంది భక్తులు

    తలనీలాలు సమర్పించిన 5,720 మంది భక్తులు

    నిన్న శ్రీవారి హుండీ ఆదాయం రూ.1.22 కోట్లు

  • 19 Oct 2020 1:55 AM GMT

    అనంతపురం: టిఎన్ఎస్ఎఫ్ జిల్లా ఉపాధ్యక్షుడు ధనుంజయ నాయుడు ను అరెస్టు చేసిన పోలీసులు.

    వైఎస్ఆర్సీపీ ఎంపీ విజయసాయి రెడ్డి పై అభ్యంతరకర పోస్టింగ్ లు సామాజిక మాధ్యమాల్లో పెట్టారని నాలుగో పట్టణ పోలీసు స్టేషన్ లో ఫిర్యాదు.

  • 19 Oct 2020 1:54 AM GMT

    విజయవాడ

    దివ్య తేజస్వి హత్య కేసులో కొనసాగుతున్న విచారణ

    దివ్య తలిదండ్రుల కంప్లైంట్ ఆధారంగా జరుగుతున్న విచారణ

    నాగేంద్ర వాంగ్మూలం విషయంలో నిజా నిజాలు నిగ్గు తేల్చే పనిలో పోలీసులు

    దిశ కేసుగా విచారణ ముమ్మరం

    ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు, ఐపీసీ 302, 304 క్రింద కేసు నమోదు

  • 19 Oct 2020 1:54 AM GMT

    కర్నూలు జిల్లా....

    శ్రీశైలం జలాశయానికి కొనసాగుతున్న వరద

    10 గేట్లు 20 అడుగుల మేర ఎత్తి దిగువకు నీటి విడుదల

    ఇన్ ఫ్లో : 4,31,115 క్యూసెక్కులు

    ఔట్ ఫ్లో : 5,08,989 క్యూసెక్కులు

    పూర్తి స్థాయి నీటి మట్టం: 885.00 అడుగులు

    ప్రస్తుతం : 884.40 అడుగులు

    పూర్తిస్దాయి నీటి నిల్వ : 215.8070 టిఎంసీలు

    ప్రస్తుతం: 212.4385 టీఎంసీలు

    కుడిగట్టు జలవిద్యుత్ కేంద్రంలో కొనసాగుతున్న విద్యుత్ ఉత్పత్తి

  • 19 Oct 2020 1:53 AM GMT

    గుంటూరు...

    అమరావతి రాజధాని కోనసాగించాలంటు రైతులు ఆందోళనలు....

    307వరోజుకు చేరుకున్న రైతులు ధీక్షలు, ధర్నాలు...

  • 19 Oct 2020 1:53 AM GMT

    తూర్పుగోదావరి :

    వరద ప్రభావిత ప్రాంతాల్లో నేడు టిడిసి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పర్యటన..

    జగ్గంపేట, ప్రత్తిపాడు, పిఠాపురం, ఉప్పాడ కొత్తపల్లి, అనపర్తి నియోజకవర్గాల్లో పర్యటించనున్న నారా లోకేష్..

    పంట నష్టపోయిన రైతులు, వరద బాధితులతో మాట్లాడనున్న లోకేష్..

  • 19 Oct 2020 1:53 AM GMT

    విజయవాడ

    ఇంద్రకీలాద్రిపై కొనసాగుతున్న శరన్నవరాత్రి వేడుకలు

    మూడో రోజున అమ్మవారు గాయత్రీదేవిగా భక్తులకు దర్శనమిస్తున్నారు.

    తెల్లవారుజామున 5 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు అమ్మవారి దర్శనం

    కోవిడ్ నిబంధనలు పాటిస్తూ... కొనసాగుతున్న ఉత్సవాలు

Print Article
Next Story
More Stories