Live Updates:ఈరోజు (ఆగస్ట్-17) తెలంగాణా బ్రేకింగ్ న్యూస్!

ఈరోజు పంచాంగం

ఈరోజు సోమవారం, 17 ఆగస్ట్, 2020 : శ్రీ శార్వరి నామ సంవత్సరం.. దక్షిణాయనం.. శ్రావణ మాసం, కృష్ణపక్షం త్రయోదశి(ఉ. 10-37 వరకు) తదుపరి చతుర్దశి; పుష్యమి నక్షత్రం (తె. 05-34 వరకు) తదుపరి ఆశ్లేష నక్షత్రం, అమృత ఘడియలు ( రా. 11-12 నుంచి 12-47 వరకు), వర్జ్యం (మ.01-38 నుంచి 03-14 వరకు) దుర్ముహూర్తం (మ.12-29 నుంచి 01-19 వరకు తిరిగి మ.03-00 నుంచి 3-50 వరకు) రాహుకాలం (ఉ. 07-30 నుంచి 09-00 వరకు) సూర్యోదయం ఉ.05-46 సూర్యాస్తమయం సా.06-22

ఈరోజు తాజా వార్తలు

Show Full Article

Live Updates

  • కామారెడ్డి  జిల్లా వ్యాప్తంగా 25.7 మి.మి.వర్షపాతం
    17 Aug 2020 4:04 AM GMT

    కామారెడ్డి జిల్లా వ్యాప్తంగా 25.7 మి.మి.వర్షపాతం

    కామారెడ్డి : జిల్లా వ్యాప్తంగా విస్తారంగా కురుస్తున్న వర్షలు వాగులు వంకలు పొంగిపొర్లుతున్నాయి

    పూర్తి గా నిండిన కామారెడ్డి పెద్ద చెరువు.

    గడిచిన 24 గంటల్లో జిల్లా వ్యాప్తంగా 25.7 మి.మి.వర్షపాతం నమోదు

    అత్యధికంగా ఎల్లారెడ్డి లో 35.3 మి.మి.వర్షపాతం నమోదు

    నాలుగు రోజులుగా కురుస్తున్న వర్షాలకు జిల్లా వ్యాప్తంగా కులిన చాలా ఇల్లు.

  • కీసర ఎమ్మార్వో కేసులో ఏసీబీ దర్యాప్తు ముమ్మరం
    17 Aug 2020 3:31 AM GMT

    కీసర ఎమ్మార్వో కేసులో ఏసీబీ దర్యాప్తు ముమ్మరం

    ఏసీబీ అప్ డేట్స్: విలువైన ప్రభుత్వ, అసైన్డ్, వివాదస్పద భూములు కాజేసేందుకు కుట్ర జరిగినట్టుగా ఏసీబీ అనుమానం

    కోటి 10 లక్షలు తీసుకుంటూ దొరికిన కీసర తహశీల్దార్ నాగరాజు...

    కోటి 10 లక్షల రూపాయలు ఎక్కడిక నుండి వచ్చాయి డబ్బు ఎవరిది అనే అంశం పై ఆరా తీస్తున్న ఏసీబీ

    నలుగురు నిందితుల కస్టడీ కోరుతూ పిటీషన్ దాఖలు చేయనున్న ఏసీబీ

    నిందితులను కస్టడీలోకి తీసుకొని విచారిస్తే మరిని విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశం

    కోటి 10 లక్షల ఎక్కడి నుండి తెచ్చారు దీని వెనుక ఎవ్వరు ఉన్నారనే కోణం లో విచారిస్తున్న ఏసీబీ

    నాగరాజు కార్ లో దొరికిన 8 లక్షల రూపాయలు, ఇంట్లో దొరికి విలువైన ఆస్తులు, భూమి పత్రాల పై ఏసీబీ ఆరా

    అంజిరెడ్డి ఇంట్లో దొరికిన రాజకీయ నేతలకు సంబంధించిన డాక్యుమెంట్ల ను పరీశీలిస్తున్న ఏసీబీ

    కీసరా,మేడ్చల్ , అల్వాల్, కుషాయిగూడ కు చెందిన వివాదస్పద భూములు, ప్రభుత్వ భూముల డాక్యుమెంట్లు పెద్ద ఎత్తున స్వాధీనం

    ఏసీబీ స్వాధీనం చేసుకున్న లెటర్స్, డాక్యుమెంట్స్ చాల కీలక విలువైన సమాచారం

    కోటి 10 లక్షల పై ఐటీ శాఖ లేఖ రాయనున్న ఏసీబీ

    ఎవరికి అనుమానం రాకుండా

    విదేశాల్లో ఉన్న బందువులపై భినామీలుగా భారీ ఆస్తులు కూడపెట్టిన ఎమ్మార్వో నాగరాజు

    ఏసీబీ కి పెరుగుతున్న ఎమ్మార్వో నాగరాజు బాధితుల పిర్యాదులు

    గతంలో నాగరాజు అవినీతి అక్రమాలపై ఏసీబీ దర్యాప్తు...

  • ఫీల్డ్ అసిస్టెంట్ పిటిషన్  నేడు హైకోర్టు విచారణ..
    17 Aug 2020 3:29 AM GMT

    ఫీల్డ్ అసిస్టెంట్ పిటిషన్ నేడు హైకోర్టు విచారణ..

    టీఎస్ హైకోర్టు: తెలంగాణ రాష్ట్రం లో 8 వేల మంది ఫీల్డ్ అసిస్టెంట్ల ను తొలగించడాన్ని సవాలు చేస్తూ హైకోర్టు పిటిషన్ దాఖలు...

    - పిటిషన్ దాఖలు చేసిన తెలంగాణ రాష్ట్ర intuc ఫీల్డ్ అసిస్టెంట్ యూనియన్

    - పిటిషనర్ తరపు వాదనలు వినిపించనున్న సీనియర్ కౌన్సిల్ మాచర్ల రంగయ్య...

    - నేషనల్ రూరల్ ఎంప్లాయిమెంట్ గ్యారెంటీ స్కీమ్ 2005 యాక్ట్ ప్రకారం ఫీల్డ్ అసిస్టెంట్లు పనిచేస్తున్నారని పిటిషన్

    - గత నాలుగు నెలలుగా జీతాలు ఇవ్వకుండా ఉద్యోగులను తొలగించారని పిటిషన్..

    -తొలగించిన 8 వేల మంది ఫీల్డ్ అసిస్టెంట్ల ను తిరిగి విధుల్లోకి తీసుకోవాలని కోర్టును కోరుతు పిటిషన్

    పెండింగులో ఉన్న నాలుగు నెలల జీతం చెల్లించే విధంగా ఆదేశాలు ఇవ్వాలని పిటిషన్..

    పిటిషన్ పై నేడు విచారించనున్న హైకోర్టు.

  • 17 Aug 2020 3:26 AM GMT

    జయశంకర్ భూపాలపల్లి జిల్లా: కాళేశ్వరం వద్ద ఉధృతంగా ప్రవహిస్తున్న గోదావరి...

    10.14 మీటర్ల ఎత్తులో ప్రవహిస్తున్న ఉభయ నదులు

  • లక్ష్మీ బ్యారేజ్ 65 గేట్లు ఎత్తివేత
    17 Aug 2020 3:24 AM GMT

    లక్ష్మీ బ్యారేజ్ 65 గేట్లు ఎత్తివేత

    జయశంకర్ భూపాలపల్లి జిల్లా: లక్ష్మీ బ్యారేజ్ 65 గేట్లు ఎత్తిన అధికారులు

    పూర్తి సామర్థ్యం 100 మీటర్లు

    ప్రస్తుత సామర్థ్యం 96.50 మీటర్లు

    పూర్తి సామర్థ్యం 16.17 టీఎంసీ

    ప్రస్తుత సామర్థ్యం 7.066 టీఎంసీ  

    ఇన్ ఫ్లో 7,41,800 క్యూసెక్కులు

    ఓట్ ఫ్లో 7,59,900 క్యూసెక్కులు

  • జిల్లా వ్యాప్తంగా ఎడతెరిపి లేకుండా వర్షాలు.. బొగ్గు ఉత్పత్తి కి అంతరాయం
    17 Aug 2020 3:20 AM GMT

    జిల్లా వ్యాప్తంగా ఎడతెరిపి లేకుండా వర్షాలు.. బొగ్గు ఉత్పత్తి కి అంతరాయం

    జయశంకర్ భూపాలపల్లి జిల్లా: జిల్లా వ్యాప్తంగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలు.

    - తేగిపోతున్న చెరువులు, కుంటలు పొంగిపోర్లుతున్న మొరంచ వాగు ఉద్ధృతంగా ప్రవహిస్తుండడంతో నీట మునిగిన వరి,పత్తి పంట.

    - 4పీట్ల ఎత్తుతో మత్తడి పోస్తున్న గణపసముద్రం, చిట్యాల మండలం బావుసింగ్ పల్లి గ్రామంలో బోరు బావి లోంచి బయటకు వస్తున్న నీరు.

    - సింగరేణి ఓపెన్ కాస్ట్ గానీ లో నిలిచిపోయిన 43వేల టన్నుల బొగ్గు ఉత్పత్తి కి అంతరాయం,సుమారుగా 6కోట్ల 45లక్షల నష్టం వాటిల్లిందని అధికారులు తెలిపారు.

Print Article
Next Story
More Stories