Live Updates:ఈరోజు (ఆగస్ట్-17) ఆంధ్రప్రదేశ్ బ్రేకింగ్ న్యూస్!

ఈరోజు పంచాంగం

ఈరోజు సోమవారం, 17 ఆగస్ట్, 2020 : శ్రీ శార్వరి నామ సంవత్సరం.. దక్షిణాయనం.. శ్రావణ మాసం, కృష్ణపక్షం త్రయోదశి(ఉ. 10-37 వరకు) తదుపరి చతుర్దశి; పుష్యమి నక్షత్రం (తె. 05-34 వరకు) తదుపరి ఆశ్లేష నక్షత్రం, అమృత ఘడియలు ( రా. 11-12 నుంచి 12-47 వరకు), వర్జ్యం (మ.01-38 నుంచి 03-14 వరకు) దుర్ముహూర్తం (మ.12-29 నుంచి 01-19 వరకు తిరిగి మ.03-00 నుంచి 3-50 వరకు) రాహుకాలం (ఉ. 07-30 నుంచి 09-00 వరకు) సూర్యోదయం ఉ.05-46 సూర్యాస్తమయం సా.06-22

ఈరోజు తాజా వార్తలు

Show Full Article

Live Updates

  • వైనతేయ నది  కుడివైపు కరకట్ట లీకేజీ....
    17 Aug 2020 2:31 PM GMT

    వైనతేయ నది కుడివైపు కరకట్ట లీకేజీ....

    తూర్పుగోదావరి: మానేపల్లి -పెదపట్నం వంతెన వద్ద వైనతేయ గోదావరి పాయ నుండి ఏట్టు గట్టు క్రింద నుండి కాల్వలోకి లీకవుతున్న వరద నీరు,

    ఆపడానికి ప్రయత్నిస్తున్న మానేపల్లి పంచాయతీ సిబ్బంది

    .పెదపట్నం బాబానగర్ ఎటిగట్టు వద్ద ఘటన.. నది 

    గ్రామంలో మూడు చోట్ల లీకేజీలు. ఏట్టు గట్టు కి మూడు చోట్ల గండి పడే అవకాశం .

    ఎట్టు గట్టు క్రింద నుండి కాల్వలోకి వస్తున్న వరద నీరు రావడంతో భయభ్రాంతులకు గురవుతున్న ప్రజలు

    ఇరిగేషన్ ఈఈ రవిబాబు సంఘటనా ప్రాంతానికి చేరుకుని పరిశీలిస్తున్నారు...

    ఇరిగేషన్ అధికారులు, స్దానికులు సాయంతో ఇసుక బస్తాలు ఏర్పాటు చేసి లీకేజీ అదుపుకి కృషి చేస్తున్నారు.

  • చంద్ర‌బాబుది సీఎం జ‌గ‌న్‌పై బుర‌ద జ‌ల్లే ప్ర‌య‌త్నం: హోంమంత్రి సుచరిత
    17 Aug 2020 2:02 PM GMT

    చంద్ర‌బాబుది సీఎం జ‌గ‌న్‌పై బుర‌ద జ‌ల్లే ప్ర‌య‌త్నం: హోంమంత్రి సుచరిత

    గుంటూరు: హోంమంత్రి సుచరిత : ఫోన్ ట్యాపింగ్ చేస్తున్నారని చంద్రబాబు లేఖ రాశారు.

    ఆధారాలు లేకుండా ఆరోపణలు చేస్తున్నారు.

    సుదీర్ఘ అనుభవం ఉన్న వ్యక్తి నిరాధార ఆరోపణలు చేయటం సిగ్గుచేటు.

    చంద్రబాబు పది మర్డర్ లు చేశారని , లోకేష్ మానభంగాలు చేశారని ఆరోపణ చేస్తే నమ్ముతారా..

    పెద్ద ఎత్తున సంక్షేమ కార్యక్రమాలు చేస్తున్నాం.

    ముఖ్యమంత్రి మీద బురద జల్లే కార్యక్రమం చేస్తున్నారు.

    టెర్రరిస్టులు, పెద్ద నేరస్థుల ఫోన్లు మాత్రమే ట్యాపింగ్ చేస్తారు.

    భార్యను ఏల లేని వాడు దేశాన్ని ఏమి ఏలతాడని ప్రధానిని విమర్శించారు.

    నాకంటే జూనియర్ దేశాన్ని భ్రష్టు పట్టిస్తున్నాడన్నారు.

    ఆధారాలు లేని ఆరోపణలకు కఠిన చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది.

    ఫోన్ ట్యాపింగ్ చేయాల్సిన అవసరం ప్రభుత్వానికి లేదు.

    దేశంలోనే మా ముఖ్యమంత్రి మూడో స్థానంలో ఉన్నారు...

    ప్రజల్లో మీ ప్రతిష్ట తగ్గిపోతుంది. భవిష్యత్తు కూడా లేదు.

    వెన్నుపోటు పొడిచి పదవిలోకి వచ్చారు...

    ప్రభుత్వ ప్రతిష్ట దిగజార్చేందుకే ఆరోపణలు.....

  • సీఎం జగన్ కు చంద్రబాబు లేఖ
    17 Aug 2020 1:08 PM GMT

    సీఎం జగన్ కు చంద్రబాబు లేఖ

    అమరావతి: సీఎం జగన్మోహన్ రెడ్డి కి లేఖ రాసిన చంద్రబాబు నాయుడు

    గోదావరి వరదలు-జల దిగ్బంధంలో వందలాది గ్రామాలు, ముంపు ప్రాంత ప్రజల ఇక్కట్లు

    నీట మునిగిన వరి, పత్తి ఉద్యాన పంటలు-కరెంటులేక అగచాట్లు

    రాకపోకలకు ఇబ్బందులు, పునరావాస శిబిరాల్లో వసతుల లేమి   

    తక్షణ సహాయ పునరావాస చర్యల గురించి లేఖలో వివరించిన చంద్రబాబు నాయుడు

  • నోవాటెల్ హోటల్ వద్ద దారుణం
    17 Aug 2020 1:04 PM GMT

    నోవాటెల్ హోటల్ వద్ద దారుణం

    విజయవాడ: నోవాటెల్ హోటల్ వద్ద దారుణం

    కారులో ఉన్న నలుగురు వ్యక్తులపై పెట్రోలు పోసి నిప్పంటించి న యువకుడు

    ముగ్గురికి గాయాలు, ఒకరి పరిస్తితి విషమం

    రియల్ ఎస్టేట్ వివాదం నేపథ్యంలో ఘటన జరిగినట్టు భావిస్తున్న పోలీసులు

    కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పోలీసులు

    కారు నంబర్ AP 16 4534

  • సెబ్ ఆధ్వర్యంలో కొనసాగిన దాడులు,
    17 Aug 2020 1:02 PM GMT

    సెబ్ ఆధ్వర్యంలో కొనసాగిన దాడులు,

    అనంతపురం: జిల్లాలో సెబ్ ఆధ్వర్యంలో ఈరోజు కొనసాగిన దాడులు, స్వాధీనం వివరాలు

    * 2,643 టెట్రా పాకెట్లు, 193 మద్యం సీసాలు, 65 లీటర్ల నాటు సారా స్వాధీనం.

    * 24 కేసులు నమోదు... 33 మంది అరెస్టు...11 వాహనాలు సీజ్

    ఇసుక అక్రమాలపై .. ఓ కేసు నమోదు... ఒకరు అరెస్టు

    ఓ ట్రాక్టర్ స్వాధీనం... 4.5 టన్నుల ఇసుక స్వాధీనం

  • ప్రకాశం బ్యారేజిలో జ‌ల‌క‌ళ‌
    17 Aug 2020 12:58 PM GMT

    ప్రకాశం బ్యారేజిలో జ‌ల‌క‌ళ‌

    విజయవాడ: ప్రకాశం బ్యారేజి వద్ద ఇన్ ఫ్లో 1.35 లక్షల క్యూసెక్కులు

    1.25 లక్షల క్యూసెక్కుల నీటిని సరాసరి దిగువకు, 7 వేల క్యూసెక్కుల నీటిని కాలువలకు విడుదల

    70గేట్లను రెండడుగుల మేర ఎత్తిన అధికారులు

  • ప్రీ స్కూల్‌ ఎడ్యుకేషన్‌ పై సీఎం జగన్‌ సమీక్ష.
    17 Aug 2020 12:56 PM GMT

    ప్రీ స్కూల్‌ ఎడ్యుకేషన్‌ పై సీఎం జగన్‌ సమీక్ష.

    అమరావతి: ప్రీ స్కూల్‌ ఎడ్యుకేషన్‌ పై క్యాంపు కార్యాలయంలో సీఎం వైయస్‌.జగన్‌ సమీక్ష.

    పాల్గొన్న మంత్రులు ఆదిమూలపు సురేష్, తానేటి వనిత, సీఎస్‌ నీలం సాహ్ని, విద్య, స్త్రీ శిశు సంక్షేమ శాఖ ఉన్నతాధికారులు.

  • కొల్లు రవీంద్ర బెయిల్ పిటిషన్ వాయిదా
    17 Aug 2020 12:54 PM GMT

    కొల్లు రవీంద్ర బెయిల్ పిటిషన్ వాయిదా

     కృష్ణా జిల్లా: మోకా మర్డర్ కేసు రాజమండ్రి సెంట్రల్ జైల్ ఉన్న మాజీ మంత్రి కొల్లు రవీంద్ర

    ఈ రోజు మచిలీపట్నం జిల్లా కోర్టు లో బెయిల్ పిటిషన్ పై విచారణ.

    కొల్లు రవీంద్ర బెయిల్ పిటిషన్ ఈ నెల 19కి వాయిదా వేసిన జిల్లా కోర్టు

  • 13 వ అంతస్తుపై నుండి దూకి ఆత్మ హత్య..
    17 Aug 2020 12:51 PM GMT

    13 వ అంతస్తుపై నుండి దూకి ఆత్మ హత్య..

    రాయదుర్గం పోలీస్ స్టేషన్ పరిధిలో జైన్ అపార్ట్మెంట్ 13 వ అంతస్తు పై నుండి దూకి మహిళా నివేధిత నాయక్(62) ఆత్మ హత్య.....

    గత 4 సంవత్సరాలనుండి హెల్త్ పరంగా సైకలాజికల్ గా డిప్రెస్సింగ్ కి లోనై ఆత్మహత్య కు కారణంగా సూసైడ్ నోట్ లభ్యం...

    ఘటన స్థలానికి చేరుకొని దర్యాప్తు చేస్తున్న రాయదుర్గం పోలీసులు....

  • ప్రీ ప్రైమరీపైనా ఏపీ సర్కార్‌ ప్రత్యేక దృష్టి
    17 Aug 2020 12:48 PM GMT

    ప్రీ ప్రైమరీపైనా ఏపీ సర్కార్‌ ప్రత్యేక దృష్టి

    రూ.4 వేల కోట్లు ఖర్చు చేస్తున్నామన్న సీఎం జగన్‌

    రూ.4 వేల కోట్లతో అంగన్‌వాడీల్లో నాడు–నేడు కింద అభివృద్ధి పనులు

    ఇకపై వైయస్సార్‌ ప్రీప్రైమరీ పాఠశాలలుగా అంగన్‌ వాడీ కేంద్రాలు

    పీపీ–1, పీపీ–2 విద్యపై దృష్టి

    అంగన్‌వాడీల్లో పాఠ్య ప్రణాళిక

    ఒకటోతరగతి పాఠ్యప్రణాళికతో ట్రాన్సిషన్‌ ఉండాలి

    ప్రీప్రైమరీకి ప్రత్యేక పాఠ్య ప్రణాళిక, విద్యాశాఖకు తయారీ బాధ్యత

    కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం అంగన్‌వాడీ టీచర్లకు డిప్లమో కోర్సు

    బోధనా పద్దతులు, పాఠ్య ప్రణాళికపై వారికి శిక్షణ

    సులభమైన మార్గాల్లో పిల్లలకు విద్యాబోధనపై వారికి ట్రైనింగ్‌

    నాడు– నేడు కింద అంగన్‌వాడీల అభివృద్ధి, కొత్త వాటి నిర్మాణం

    అంగన్‌వాడీ కేంద్రాలలో పరిశుభ్రమైన తాగునీరు, బాత్‌రూమ్స్‌

    నాడు నేడు కింద స్కూళ్లకు ఇప్పుడు ఇస్తున్న సదుపాయాలన్నీ ఇవ్వాలి

    అమ్మ ఒడి ద్వారా విద్యా వ్యవస్థలో సంస్కరణలు తీసుకు వచ్చాం

    ప్రీప్రైమరీ విద్యలో మనం సంస్కరణలు తీసుకు వస్తున్నాం

    ప్రాథమిక దశ నుంచే మనం సంపూర్ణ మార్పులకు శ్రీకారం చుడుతున్నాం

    కార్యాచరణ తయారు చేసి నిర్ణీత సమయంలోగా వాటిని పూర్తి చేయాలి

Print Article
Next Story
More Stories