Top
logo

Live Updates: ఈరోజు (16 అక్టోబర్, 2020 ) ఆంధ్రప్రదేశ్ బ్రేకింగ్ న్యూస్!

Live Updates: ఈరోజు (16 అక్టోబర్, 2020 ) ఆంధ్రప్రదేశ్ బ్రేకింగ్ న్యూస్!
X
Highlights

ఈరోజు బ్రేకింగ్ న్యూస్, 16 అక్టోబర్, 2020 : హెచ్ఎంటీవీ లైవ్ బ్లాగ్ ద్వారా తాజా వార్తలు ఎప్పటికప్పుడు మీకోసం అందిస్తుంది. ఇక్కడ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన వార్తా విశేషాలను, తాజా సమాచారాన్నిఎప్పటికప్పుడు మీకోసం బ్రేకింగ్ గా ఇస్తున్నాం.

ఈరోజు పంచాంగం

ఈరోజు శుక్రవారం | 16 అక్టోబర్, 2020 | శ్రీ శార్వరి నామ సంవత్సరం.. దక్షిణాయనం | అధిక ఆశ్వయుజ మాసం | కృష్ణపక్షం | అమావాస్య రా.01-56 వరకు తదుపరి పాడ్యమి | హస్త నక్షత్రం సా.04-01 వరకు తదుపరి చిత్త | వర్జ్యం: రా.11-28 నుంచి 12-57 వరకు | అమృత ఘడియలు ఉ.10-24 నుంచి 11-35 వరకు | దుర్ముహూర్తం: ఉ.08-15 నుంచి 09-02 వరకు తిరిగి మ.12-09 నుంచి 12-56 వరకు | రాహుకాలం: మ.10-30 నుంచి 12-00 వరకు | సూర్యోదయం: ఉ.5-54 | సూర్యాస్తమయం: సా.5-40

ఈరోజు తాజా వార్తలు

Web Titlebreaking-news-16th-October-live-updates-latest-andhra-pradesh-news-latest-telugu-news

Live Updates

 • రెడ్ క్రాస్ సంస్థకు అత్యున్నత పురస్కారం
  16 Oct 2020 6:52 AM GMT

  రెడ్ క్రాస్ సంస్థకు అత్యున్నత పురస్కారం

  తూర్పుగోదావరి.. కాకినాడ: జిల్లా రెడ్ క్రాస్ చైర్మన్ వై డి రామారావు కి రాష్ట్రపతి బంగారు పతకం వరించింది

  - ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ దేశంలో అత్యుత్తమ సేవలు అందించిన రెడ్ క్రాస్ సంస్థకు ఈ అత్యున్నత పురస్కారం అందజేస్తుంది..

  - 2018..19 సంవత్సరానికి తూర్పుగోదావరి జిల్లా లో విస్తృత సేవలు అందించిన రామారావుకి ఈ అవార్డు లభించడం పట్ల జిల్లా కలెక్టర్ మురళీధర్ రెడ్డి అభినందనలు తెలిపారు

 • VIJAYAWADA: ఇంద్రకీలాద్రి ఘాట్ రోడ్డుపై భక్తుల రాకపోకలకు క్లియరెన్స్
  16 Oct 2020 6:49 AM GMT

  VIJAYAWADA: ఇంద్రకీలాద్రి ఘాట్ రోడ్డుపై భక్తుల రాకపోకలకు క్లియరెన్స్

  విజయవాడ: రేపటి నుంచి ప్రారంభమయ్యే దసరా ఉత్సవాలకు ఘాట్ రోడ్డులోని క్యూలైన్ల మార్గం ద్వారానే భక్తులను అనుమతించాలని నిర్ణయం

  - కొండ చరియలు పడే చోట ప్రత్యేక రక్షణ ఏర్పాట్లు చేసిన దుర్గగుడి అధికారులు

 • RAO RAMESH: శ్రీవారిని దర్శించుకున్న సినీనటుడు రావురమేష్.
  16 Oct 2020 6:46 AM GMT

  RAO RAMESH: శ్రీవారిని దర్శించుకున్న సినీనటుడు రావురమేష్.

  తిరుమల: శ్రీవారిని దర్శించుకున్న సినీనటుడు రావురమేష్.

  - బ్రహ్మోత్సవాల సమయంలో స్వామి వారి ఆశీస్సులు పోందడం అదృష్టంగా భావిస్తున్నాను.

  - శ్రీకారం సినిమా షూటింగ్ కోసం వచ్చి చాలా రోజుల తరువాత స్వామి వారిని దర్శించుకున్నాను.

  - స్వామి వారి దయతో సినిమా అవకాశాలు మెండుగా వస్తున్నాయి.

   

 • Antharvedi: అంతర్వేదిలో నూతన రధం నిర్మాణ పనులు ప్రారంభం
  16 Oct 2020 6:41 AM GMT

  Antharvedi: అంతర్వేదిలో నూతన రధం నిర్మాణ పనులు ప్రారంభం

  తూర్పు గోదావరి జిల్లా: అంతర్వేది లో చురుగ్గా కొనసాగుతున్న అంతర్వేది లక్ష్మీనరసింహాస్వామి నూతన రధం నిర్మాణ పనులు

  - వచ్చే ఫిబ్రవరి నెలలో స్వామి వారి కళ్యాణం నాటికి ఈ రధాన్ని పూర్తిచేసేలా రధం నిర్మాణం   

  - నిర్మాణ పనులను పర్యవేక్షణ అంతర్వేది లక్ష్మీనరసింహాస్వామి నూతన రధం నిర్మాణ పనులు - ఆలయ ఇవో యర్రంశెట్టి భద్రాజీ

 • అభివృద్ధి చూసి ఓర్వలేకే మా పార్టీలపై విమర్శలు: ఏపి కార్మిక శాఖ మంత్రి జయరాం
  16 Oct 2020 6:36 AM GMT

  అభివృద్ధి చూసి ఓర్వలేకే మా పార్టీలపై విమర్శలు: ఏపి కార్మిక శాఖ మంత్రి జయరాం

   తిరుమల: శ్రీవారిని దర్శించుకున్న ఏపీ కార్మిక శాఖ మంత్రి జయరాం.

  - జయరాం,ఏపి కార్మిక శాఖ మంత్రి వ్యాఖ్యలు 

  - రాష్ట్రంలో అభివృద్ధి చూసి ఓర్వలేకే మా పార్టీ నేతలపై విమర్శలు చేస్తున్నారు.

  - రుజువు లేకుండా ప్రతిపక్షాలు నా పై అభియోగాలు వేయడం సరికాదు.

  - మీడియాలో వారు కనపడక పోతే వారిని ప్రజలు పట్టించుకోరని వార్తలో నిలిచేందుకు నిరాదరణ ఆరోపణలు చేస్తున్నారు.

  - నా పుట్టిన రోజు సందర్బంగా కుటుంబ సమేతంగా స్వామిని దర్శించుకున్నాను.

  - ఏపీలో వర్షాలు విస్తారంగా కురిసి, రైతన్నలు చాలా సంతోషంగా ఉన్నారు.

  - రాష్ట్ర ప్రజలు సుభీక్షంగా ఉండాలని శ్రీవారిని ప్రార్ధించాను.

  - ఈ సంవత్సరం డిసెంబర్ నాటికి కరోనా మహమ్మరి రాష్ట్రంలో తగ్గుముఖం పడుతుంది.


 • VIJAYAWADA : విజయవాడ దుర్గగుడి ఫ్లైఓవర్ ప్రారంభం
  16 Oct 2020 6:28 AM GMT

  VIJAYAWADA : విజయవాడ దుర్గగుడి ఫ్లైఓవర్ ప్రారంభం

   అమరావతి: ట్విట్టర్ లో వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి

  - విజయవాడ దుర్గగుడి ఫ్లైఓవర్ ఈరోజు ప్రారంభం కావడం సంతోషించదగ్గ విషయం.

  - ఫ్లైఓవర్ నిర్మాణానికి కృషి చేసిన ముఖ్యమంత్రి గారికి, కేంద్ర పెద్దలకు, అధికారులకు ధన్యవాదాలు.

  - 2016 కృష్ణా పుష్కరాలకి ముందే దుర్గగుడి ఫ్లైఓవర్ కట్టేస్తా అని ప్రగల్భాలు పలికి, చేతకాక వదిలేసిన వారు కూడా ఆనందపడవచ్చు. 

 • ఐ.డి పోలీసులపై మద్యం మాఫియా దాడి.
  16 Oct 2020 6:25 AM GMT

  ఐ.డి పోలీసులపై మద్యం మాఫియా దాడి.

  తూర్పుగోదావరి: కాట్రేనీకోన మండలం పల్లం గ్రామంలో ఐ.డి పోలీసులు లపై మద్యం మాఫియా దాడి...

  - ఐ.డి పోలీసులకు శుక్రవారం తెల్లవారు జామున నీళ్ళరేవు వంతెన సమీపంలో యానాం మద్యాన్ని దిగుమతి చేస్తారన్న సమాచారంతో పహారా కాసిన ఐడీ పోలీసులు.

  - అక్రమ మద్యం దిగుమతి చేస్తున్న సమయంలో ఐడీ పోలీసులు దాడి .

  - దీంతో మద్యం మాఫియా పోలీసులపై ఎదురు దాడి

  - పలువురు పోలీసులకు గాయాలు

  - పోలీసులకు దొరికిన మద్యాన్ని తిరిగి లాక్కుని నది పాయ నుండి పడవలో మళ్లించిన మద్యం మాఫియా.

  - సంఘటన స్థలానికి చేరుకొని దర్యాప్తు చేస్తున్న ముమ్మిడివరం సి.ఐ జానకీరామ్ ,కాట్రేనికోన, ముమ్మిడివరం ,ఐ.పోలవరం ఎస్సైలు పోలీస్ సిబ్బంది .

  - మద్యం మాఫియా కోసం జల్లెడపడుతున్న పోలీసులు..

  - ప్రత్యేక పోలీసు బృందాలను రంగంలోకి దించిన జిల్లా పోలీసు అధికారులు

 • NARA LOKESH : వరద ప్రభావిత ప్రాంతాలలో నారా లోకేష్ పర్యటన .
  16 Oct 2020 6:19 AM GMT

  NARA LOKESH : వరద ప్రభావిత ప్రాంతాలలో నారా లోకేష్ పర్యటన .

  గుంటూరు: జిల్లాలోని వరద ప్రభావిత ప్రాంతాలలో నారా లోకేష్ పర్యటన .

  - తాడేపల్లి మండలం గుండెమెడ లో నీట మునిగిన పంట పోలాలు పరిశీలిన..

  - పంటల పరిస్థితి పై రైతులను అడిగి తెలుసుకున్న లోకేష్...

  - పాల్గొన్న మాజీ మంత్రులు ఆలపాటి రాజా, నక్కా ఆనంద బాబు, ఎమ్మెల్యే అనగాని సత్యప్రసాద్ , పార్లమెంట్ అధ్యక్షుడు శ్రావణ కుమార్ , టిడిపి నేతలు కోవెలమూడి రవీంద్ర , పోతినేని శ్రీనివాస్,....టిడిపి నేతలు

 • AMARAVATHI NEWS: స్కూల్ అటెండెన్స్ రిజిస్టర్ పై కీలక సర్కులర్ జారీ
  16 Oct 2020 6:15 AM GMT

  AMARAVATHI NEWS: స్కూల్ అటెండెన్స్ రిజిస్టర్ పై కీలక సర్కులర్ జారీ

  అమరావతి: స్కూల్ అటెండెన్స్ రిజిస్టర్ పై కీలక సర్కులర్ జారీ

  - విద్యార్థుల అటెండెన్స్ రిజిస్టర్ లో కుల, మత వివరాలు నమోదు చేయకూడదు అని ఆదేశం

  - కొన్ని స్కూల్స్ లో విద్యార్థుల కుల, మత వివరాలు హాజరు లో నమోదు చేస్తున్నట్టు సమాచారం

  - సమాచారం అందుకున్న వెంటనే వాటిని తొలగించాలని సర్కులర్ జారీ చేసిన స్కూల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్

 • 16 Oct 2020 3:18 AM GMT

  తిరుమలలో నేటి నుండి శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాలు

  తిరుమల: కోవిడ్- 19 కారణంగా ఏకాంతంగా శ్రీవారి ఆలయంలో నవరాత్రి బ్రహ్మోత్సవాలు

  - ఉదయం బంగారు ఉత్సవం

  - తొలి వాహనంగా పెద్దశేష వాహనంపై ఉభయదేవేరులతో కలిసి దర్శనం ఇవ్వనున్న మలయప్ప

  రాత్రి 7 నుండి 8 గంటలకు జరగనున్న వాహనసేవ

Next Story