Live Updates:ఈరోజు (ఆగస్ట్-16) తెలంగాణా బ్రేకింగ్ న్యూస్!

ఈరోజు పంచాంగం

ఈరోజు ఆదివారం, 16 ఆగస్ట్, 2020 : శ్రీ శార్వరి నామ సంవత్సరం.. దక్షిణాయనం.. శ్రావణ మాసం, కృష్ణపక్షం ద్వాదశి(ఉ. 11-03 వరకు) తదుపరి త్రయోదశి ; పునర్వసు నక్షత్రం (తె. 05-41 వరకు) తదుపరి పుష్యమి నక్షత్రం, అమృత ఘడియలు (లేవు), వర్జ్యం (సా.05-29 నుంచి 07-06 వరకు) దుర్ముహూర్తం (సా. 04-42 నుంచి 05-32 వరకు) రాహుకాలం (సా.04-30 నుంచి 06-00 వరకు) సూర్యోదయం ఉ.05-46 సూర్యాస్తమయం సా.06-23

ఈరోజు తాజా వార్తలు

Show Full Article

Live Updates

  • 16 Aug 2020 3:19 AM GMT

    జిల్లా వ్యాప్తంగా గత 5 రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షం..

    వరంగల్ అర్బన్:

    - జిల్లా వ్యాప్తంగా గత 5 రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షం.

    - నిటమునిగిన హన్మకొండ నగరం.

    - 30 కాలనీలు జలదిగ్బంధంలో ...

    - పలు కాలనీల్లో వరద ఉదృతిలో కొట్టుకుపోయిన వాహనాలు.

    - గోపాలపురం, వడ్డేపల్లి, నాయిమ్ నగర్, రాం నగర్, వికాస్ నగర్, అమరావతి నగర్, ప్రకాష్ రెడ్డి పేట, బస్టాండ్ ప్రాంతాల్లో భారీగా ప్రవహిస్తున్న వరద నీరు.

  • 16 Aug 2020 3:18 AM GMT

    ములుగు జిల్లా.

    - ఉగ్రరూపంలో ప్రవహిస్తున్న గోదావరి.

    - గత 35 ఏళ్ల తరువాత మళ్ళీ బారి స్థాయిలో ప్రవాహం

    - 1986 ని తలిపిస్తున్న గోదవరి

  • 16 Aug 2020 3:18 AM GMT

    కామారెడ్డి:

    - జిల్లాలో కురుస్తున్న వర్షాల నేపథ్యంలో అధికారులనుఅప్రమత్తం చేసిన జిల్లా కలెక్టర్ శరత్,

    - జిల్లా స్ధాయి అధికారులు, సిబ్బందికి సెలవులు రద్దు చేసిన కలెక్టర్. హెడ్ క్వార్టర్లలో ఉండాలని ఆదేశాలు.

    - కలెక్టరేట్ లో హెల్ప్ లైన్ నెంబర్ ఏర్పాటు, ఎలాంటి అత్యవసరం ఉన్నా.. 7382928649, 7382929350 ఫోన్ నెంబర్ల ఏర్పాటు.

  • 16 Aug 2020 3:17 AM GMT

    నిజామాబాద్:

    - మూడు రోజుల పాటు భారీ వర్షసూచన ఉండటంతో.. జిల్లా అధికారులను అప్రమత్తం చేసిన కలెక్టర్ నారాయణ రెడ్డి.

    - వర్షాలతో అసౌకర్యం కలిగితే ఆదుకునేందుకు కలెక్టరేట్ లో 24 గంటలు పనిచేసే కంట్రోల్ రూం ఏర్పాటు, 08462 220183 నెంబర్ పై ఫోను తెలపాలని కోరిన కలెక్టర్.

    - శిథిల దశకు చేరుకున్న ఇళ్లలో ఉన్న వారిని దగ్గరలోని సర్కారు స్కూళ్లకు లేదా బంధువు ఇళ్లకు పంపేలా ఏర్పాట్లు చేయాలని ఆదేశాలు.

  • 16 Aug 2020 3:17 AM GMT

    నిజామాబాద్ :

    - జిల్లా వ్యాప్తంగా కురుస్తున్న వర్షం.

    - సగటున 2 5 సెంటిమీటర్ల వర్ష పాతం నమోదు.

    - మోపాల్ లో అత్యధికంగా 7 సెంటి మీటర్లు, చందూర్, ఇందల్వాయి , నిజామాబాద్ రూరల్ లో 4 సెంటి మీటర్ల వర్ష పాతం నమోదు.

  • 16 Aug 2020 3:16 AM GMT

    ములుగు జిల్లా:

    - వెంకటాపురం మండలం కుక్క తోగు వాగు, పాత్రాపురం గ్రామ సమీపంలో ని బ్రిడ్జ్ లు గోదావరి నీట మునగటంతో భద్రాచలం వెంకటాపురం కి రాకపోకలు పూర్తిగా నిలిచిపోవడంతో పాటు పలు గ్రామాల్లో ని వరి పంట లు గోదావరి నీట మునిగాయి.

  • 16 Aug 2020 3:16 AM GMT

    2వ ప్రమాద హెచ్చరికకు చేరువలో గోదావరి..

    ములుగు జిల్లా:

    - ఏటూరునాగారం మండలంలో రామన్నగూడెం పుష్కర ఘాట్ వద్ద అంతకంతకూ పెరుగుతున్న గోదావరి వరద ఉధృతి.

    - మొదటి ప్రమాద హెచ్చరిక ను దాటి రెండో ప్రమాద హెచ్చరిక కు చేరువలో ఉన్న ప్రవాహం.

    - ఈ రోజు ఉదయం 7 గంటలకు రామన్నగూడెం పుష్కర ఘాట్ వద్ద 9.770 మీటర్ల కు చేరుకుంది.

    - 9.990 మీటర్ల కు చేరుకుంటే రెండవ ప్రమాద హెచ్చరిక, 11 మీటర్లకు చేరుకుంటే మూడవ ప్రమాద హెచ్చరిక జారీ చేస్తారు.

    - లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్న అధికారులు...

  • 16 Aug 2020 3:16 AM GMT

    ములుగు జిల్లా:

    - భారీ వర్షాలతో ఇబ్బందులు పడుతున్న ప్రజల సహాయార్థం ఐటీడీఏ ఏటూరునాగారం కార్యాలయంలో టోల్ ఫ్రీ నెం. 9493750071 తో

    - కంట్రోల్ రూం ఏర్పాటు చేసిన జిల్లా కలెక్టర్ ఎస్. క్రిష్ణ ఆదిత్య.

  • 16 Aug 2020 3:15 AM GMT

    నాగార్జునసాగర్ ప్రాజెక్టుకు కొనసాగుతున్న వరద..

    నల్గొండ :

    - పూర్తిస్థాయి నీటిమట్టం : 590.00 అడుగులు.

    - ప్రస్తుత నీటిమట్టం : 566.70 అడుగులు.

    - ఇన్ ఫ్లో :42,378 క్యూసెక్కులు.

    - అవుట్ ఫ్లో : 4107 క్యూసెక్కులు.

    - పూర్తిస్థాయి నీటి నిల్వ : 312.0405 టీఎంసీలు.

    - ప్రస్తుత నీటి నిల్వ : 248.2946 టీఎంసీలు.

  • 16 Aug 2020 3:15 AM GMT

    జయశంకర్ భూపాలపల్లి జిల్లా

    - లక్ష్మీ బ్యారేజ్

    - 65 గేట్లు ఎత్తిన అధికారులు

    - పూర్తి సామర్థ్యం 100 మీటర్లు

    - ప్రస్తుత సామర్థ్యం 97.80 మీటర్లు

    - పూర్తి సామర్థ్యం 16.17 టీఎంసీ

    - ప్రస్తుత సామర్థ్యం 9.876 టీఎంసీ

    - ఇన్ ఫ్లో 8,50,300 క్యూసెక్కులు

    - ఓట్ ఫ్లో 9,87,900 క్యూసెక్కులు

Print Article
Next Story
More Stories