Live Updates: ఈరోజు (సెప్టెంబర్-15) ఆంధ్రప్రదేశ్ బ్రేకింగ్ న్యూస్!

ఈరోజు పంచాంగం

ఈరోజు మంగళవారం | 15 సెప్టెంబర్, 2020 |శ్రీ శార్వరి నామ సంవత్సరం.. దక్షిణాయనం | భాద్రపద మాసం | కృష్ణపక్షం | త్రయోదశి-రా.8-44 వరకు తదుపరి చతుర్దశి | ఆశ్లేష నక్షత్రం - మ.12-56 తదుపరి మఘ | అమృత ఘడియలు ఉ.11-21 నుంచి 12-56 వరకు | వర్జ్యం రా.12-31 నుంచి 2-04 వరకు | దుర్ముహూర్తం ఉ..8-17 నుంచి 9-05 వరకు తిరిగి రా.10-45 నుంచి 11-32 వరకు | రాహుకాలం మ.3-00 నుంచి 4-30 వరకు | సూర్యోదయం ఉ.5-51 | సూర్యాస్తమయం సా.6-02

ఈరోజు తాజా వార్తలు

Show Full Article

Live Updates

  • Guntur updates: జిజిహెచ్ లో వైసిపి ఎమ్మెల్యే ముస్తఫా ఆకస్మిక తనిఖీ..
    15 Sep 2020 9:54 AM GMT

    Guntur updates: జిజిహెచ్ లో వైసిపి ఎమ్మెల్యే ముస్తఫా ఆకస్మిక తనిఖీ..

    గుంటూరు ః....

    -ఆసుపత్రిలో వైద్య సేవలపై ఆరా...

    -డాక్టర్ ల పనితీరు ను రోగులను అడిగి తెలుసుకున్న ముస్తఫా.

    -సూపరింటెండెంట్ సుధాకర్ పై ఎమ్మెల్యే ఆగ్రహం.

    -సాధారణ రోగులను అసలు పట్టించుకోవడం లేదు.

    -సామాన్య రోగుల పరిస్థితి వర్ణీతీతంగా ఉంది.

    -జిజిహెచ్ లంచాల మయంగా మారిందని మండిపాటు.

    -సీట్లు కూర్చోని కబుర్లు చెబితే కుదరదని సూపరిటెండెంట్ కు హెచ్చరిక

    -ఎమ్మెల్యే తీరు తో బెంబేలెత్తిపోయిన జిజిహెచ్ వైద్య సిబ్బంది.

  • Prakasam Barrage updates: కృష్ణానదికి పెరుగుతున్న వరద ఉధృతి..కె. కన్నబాబు..
    15 Sep 2020 9:52 AM GMT

    Prakasam Barrage updates: కృష్ణానదికి పెరుగుతున్న వరద ఉధృతి..కె. కన్నబాబు..

    అమరావతి..

    కె. కన్నబాబు విపత్తుల శాఖ కమిషనర్..

    -ప్రకాశం బ్యారేజ్ వద్ద మొదటి ప్రమాద హెచ్చరిక జారీ

    -ప్రస్తుత ఇన్ ఫ్లో 3,95,669, , అవుట్ ఫ్లో 3,90,669 క్యూసెక్కులు

    -వరద ముంపు ప్రభావిత మండలాల అధికారులను అప్రమత్తం చేసిన విపత్తుల నిర్వహణ శాఖ

    -కృష్ణానది పరీవాహక ప్రాంత ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి

    -బోట్లు,మోటర్ బోట్లు, స్టీమర్లలతో నదిలో ప్రయాణించవద్ద

    -వరద నీటిలో ఈతకు వెళ్ళడం, స్నానాలకు వెళ్ళడం లాంటివి చేయరాదు

  • Amaravati updates: మన దేశ ప్రగతి ప్రస్థానంలో ఇంజనీరింగ్ రంగ నిపుణుల పాత్రను ఎవరూ విస్మరించలేరు..పవన్ కళ్యాణ్..
    15 Sep 2020 9:46 AM GMT

    Amaravati updates: మన దేశ ప్రగతి ప్రస్థానంలో ఇంజనీరింగ్ రంగ నిపుణుల పాత్రను ఎవరూ విస్మరించలేరు..పవన్ కళ్యాణ్..

    అమరావతి..

    పవన్ కళ్యాణ్..

    -మన ఇంజనీరింగ్ నిపుణులకు మార్గదర్శకులు ‘భారతరత్న’ మోక్షగుండం విశ్వేశ్వరయ్య గారు.

    -ఈ రోజు ఆ మహనీయుని జయంతి.. సందర్భంగా మోక్షగుండం విశ్వేశ్వరయ్య గారికి నా తరఫున, జనసేన పక్షాన హృదయపూర్వక అంజలి ఘటిస్తున్నాను.

    -హైదరాబాద్ నగరాన్ని మూసీ వరదల నుంచి గట్టెక్కించేలా నీటిపారుదల వ్యవస్థను రూపొందించారు.

    -విశాఖపట్నం ఓడరేవును సముద్రపు కోత నుంచి కాపాడే విధానాన్ని అందించారు.

    -దేశంలో పలు ఇరిగేషన్ ప్రాజెక్టుల రూపకల్పనలో విశ్వేశ్వరయ్య గారి భాగస్వామ్యం మరువలేనిది.

    -మోక్షగుండం విశ్వేశ్వరయ్య గారి గౌరవార్థం వారి జయంతిని జాతీయ ఇంజనీర్ల దినోత్సవాన్ని నిర్వహించుకొంటూ ఉంటాం.

    -విశ్వేశ్వరయ్య గారిలోని తపన, దృఢ సంకల్పం... ఆయన జీవితం యువ ఇంజనీర్లకు ఆదర్శంగా నిలుస్తాయి.

    -మన దేశ ఇంజనీర్లు అత్యుత్తమ నైపుణ్యాలతో పరిశోధనల్లో, నూతన ఆవిష్కరణల్లో ముందుకువెళ్లాలని ఆకాంక్షిస్తున్నాను.

  • Kurnool-Srisailam updates: శ్రీశైలంలో గంటా మఠం జీర్ణోద్ధరణ పనుల్లో రాగి రేకులపై కన్నడ ఒరియా దేవా నాగరిక లిపిలో శాసనాలు..
    15 Sep 2020 9:40 AM GMT

    Kurnool-Srisailam updates: శ్రీశైలంలో గంటా మఠం జీర్ణోద్ధరణ పనుల్లో రాగి రేకులపై కన్నడ ఒరియా దేవా నాగరిక లిపిలో శాసనాలు..

    కర్నూలు జిల్లా..

    -శ్రీశైలంలో గంటా మఠం జీర్ణోద్ధరణ పనుల్లో భాగంగా పునర్ నిర్మాణ పనులలో మరోసారి బయటపడ్డాయి రాగి రేకులు, పురాతనం నాటి నానాలు

    -ఇప్పటికే 29 రాగిరేకులు బయటపడ్డ వైనం

    -రాగి రేకుల శాసనాలలో శ్రీశైలం పోషణ కు సంబంధించి మల్లన్న మాన్యంగా భూములు ఉన్నట్లు తెలిపిన పురావస్తు శాఖ అధికారులు

    -ప్రస్తుతం బయటపడ్డ రాగిరేకులు నాణేలపై పంచనామా చేస్తున్న రెవెన్యూ పోలీసు దేవాదాయ శాఖ అధికారులు

  • National updates: సవాలు విసురుతున్నా కావాలంటే బహిష్కరించి చూడండి....రఘురామ కృష్ణంరాజు..
    15 Sep 2020 9:31 AM GMT

    National updates: సవాలు విసురుతున్నా కావాలంటే బహిష్కరించి చూడండి....రఘురామ కృష్ణంరాజు..

    జాతీయం..

    ఎంపీ రఘురామ కృష్ణంరాజు ప్రెస్ మీట్

    -మనం ప్రజాస్వామ్యంలో ఉన్నామా అనే అనుమానం రాష్ట్ర ప్రజలకు కలుగుతోంది..

    -ప్రజాప్రతినిధులు కూడా రాచరికం పోయింది ప్రజలు ఓటేస్తేనే గెలిచామని గుర్తుంచుకొని ఆత్మపరిశీలన చేసుకోవాలి.

    -వైకాపా లోక్ సభపక్ష నేత మిథున్ రెడ్డి నిన్న మాట్లాడుతూ.. నాపై అనర్హత వేటు వేయాలని మళ్లీ కోరుతామన్నారు

    -రాష్ట్ర ప్రభుత్వ పనుల గురించి ఏనాడైనా మిథున్ రెడ్డి మాట్లాడారా?

    -రైల్వే జోన్ కు రాష్ట్ర ప్రభుత్వం ఏం చేసింది.? ఏం సాధించింది?

    -నీటి పారుదల శాఖ, రోడ్ల నిర్మాణంలో బీభత్సమైన అవినీతి జరుగుతుంది

    -లోక్ సభపక్షనేతకు ఎన్నిక పెడితే మిథున్ రెడ్డికి మూడు ఓట్లకు మించి రావు.

    -మిథున్ రెడ్డి పై చాలా మంది ఎంపీలకు అసంతృప్తి ఉంది.

    -నాలాగే చాలా మంది ఎంపీలపై వివక్ష ఉంది. కాకపోతే వారు బయటపడటం లేదు

    -నన్ను పార్టీ నుంచి బహిష్కరించినా.. నేను పార్లమెంట్ లో కమిటీ చైర్మన్ గా కొనసాగుతాను.

    -సవాలు విసురుతున్నా కావాలంటే బహిష్కరించి చూడండి. కమిటీ చైర్మన్ గా కొనసాగుతా.

    -వారికి కావలసిన వారు లోక్సభలో కూర్చునేలా ప్రజా సమస్యలపై మాట్లాడే నాలాంటి వారిని మాత్రం దూరంగా రాజ్యసభ గ్యాలరీ లో కూర్చునేలా ఏర్పాట్లు      చేయడం తగదు.

    --రఘురామకృష్ణంరాజు, వైకాపా ఎంపీ

  • Kadapa updates: హైకోర్టు వ్యాఖ్యలతో ముఖ్యమంత్రి తక్షణం రాజీనామా చెయ్యాలి...తులసిరెడ్డి..
    15 Sep 2020 9:05 AM GMT

    Kadapa updates: హైకోర్టు వ్యాఖ్యలతో ముఖ్యమంత్రి తక్షణం రాజీనామా చెయ్యాలి...తులసిరెడ్డి..

    కడప :

    పిసిసి వర్కింగ్ ప్రెసిడెంట్ తులసిరెడ్డి కామెంట్స్..

    -హైకోర్టు ధర్మాసనం పోలీసు వ్యవస్థపై, డిజిపి పై, రాష్ట్ర ప్రభుత్వంపై తీవ్ర వ్యాఖ్యలు చేసింది.

    -పోలీసుల్లో పరివర్తన రావాలి...వై పీఎస్ కావద్దు ఐపీఎస్ లుగా నిరూపించుకోండి...

    -రాష్ట్రంలో ఐ పి సి ని అమలుపరచండి , వై పిసి ని కాదు...

    -రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ గా బిజెపి బలపరిచిన అభ్యర్థి కి నేనంటే నేనని వైకాపా, టి డి పీ లు మద్దతిచ్చాయి...

    -టిడిపి ,వైసీపీలు తమ స్వార్థం కోసం రాష్ట్ర ప్రయోజనాలను పణంగా పెట్టి ఎన్డీయే బలపరిచిన అభ్యర్థిని సపోర్ట్ చేశాయి...

    -బిజెపికి రాష్ట్ర ప్రయోజనాలను టిడిపి వైసిపిలు తాకట్టు పెట్టాయి...

    -టిడిపి ,వైసిపిలను నమ్ముకుంటే కుక్క తోకను పట్టుకొని గోదావరి ఈదడమే...

  • East Godavari updates: గొల్లప్రోలు, పిఠాపురం మండలాల్లో ఏలేరు వరద ప్రభావిత ప్రాంతాలను పరిశీలించిన వ్యవసాయశాఖ మంత్రి కురసాల కన్నబాబు..
    15 Sep 2020 8:51 AM GMT

    East Godavari updates: గొల్లప్రోలు, పిఠాపురం మండలాల్లో ఏలేరు వరద ప్రభావిత ప్రాంతాలను పరిశీలించిన వ్యవసాయశాఖ మంత్రి కురసాల కన్నబాబు..

    తూర్పుగోదావరి :

    మంత్రి కన్నబాబు కామెంట్స్..

    -ఏలేరు కాలువల ఆధునీకరణను త్వరలోనే పూర్తి చేస్తాం ఏలేరు ముంపు సమస్యను సీఎం, ఇరిగేషన్ మంత్రుల దృష్టికి తీసుకు వెళ్లాము..

    -ఉన్నత స్థాయిలో దీనిపై చర్చిస్తున్నాం ఏలేరు, సుద్దగడ్డ, నక్కలకండి కాలువల ముంపు వల్ల గొల్లప్రోలు, పిఠాపురం ప్రాంతాల్లో భారీగా పంట నష్టం జరిగింది..

    -చాలా చోట్ల కాలువలకు గండ్లు పడ్డాయి. పంట నష్టాల అంచనాకు బృందాలను ఏర్పాటు చేశాము..

    -గొల్లప్రోలు పట్టణంలో ఎస్సీ, ఈ బీసీ కాలనీ తదితర లోతట్టు ప్రాంతాలు నీట మునిగాయి..

    -కాలనీ వాసులను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని అధికారులను ఆదేశించాం..

  • Amaravati updates: రాజధానిలో ఇన్ సైడర్ ట్రేడింగ్ జరిగింది..సోము వీర్రాజు..
    15 Sep 2020 8:45 AM GMT

    Amaravati updates: రాజధానిలో ఇన్ సైడర్ ట్రేడింగ్ జరిగింది..సోము వీర్రాజు..

    అమరావతి...

    -hmtv తో ఏపీ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు

    -టీడీపీ నేతలు పెద్ద ఎత్తున భూములు కొనుగోలు చేశారు..

    -రాజధాని నిర్మాణం 7200 కోట్ల పనుల్లో పెద్ద ఎత్తున అవినీతికి పాల్పడ్డారు..

    -ప్రపంచంలో ఎక్కడ లేని విధంగా చదరపు అడుగుకు 8 వేల నుంచి 12 వేల వరకు ఖర్చు చేశారు..

    -నీరు చెట్టు, పోలవరం, ఉపాధి హామీ, స్వచ్ఛ భారత్ పనుల్లో టీడీపీ ప్రభుత్వం అవినీతికి పాల్పడింది..

    -టీడీపీ నేతలు బాత్ రూమ్ లను కూడా వదలకుండా అవినీతికి పాల్పడ్డారు

    -టీడీపీ హయాంలో జరిగిన అవినీతి మొత్తంపై విచారణ జరపాలి..

    -టీడీపీ హయాంలో జరిగిన అవినీతి ని ప్రధాన మంత్రి మోడీ కూడా ప్రశ్ననించారు..

    -చంద్రబాబు అవినీతిని ఎటిఎంతో ప్రధాని నరేంద్ర మోడీ పోల్చారు.

    -టీడీపీపై చేసిన అవినీతి ఆరోపణలకు మేము ఇప్పటికి కట్టుబడి ఉన్నాము..

  • Kadapa updates: వైఎస్ వివేకానంద రెడ్డి హత్యకేసులో విచారణ చేపట్టిన సిబిఐ బృందం ....
    15 Sep 2020 8:39 AM GMT

    Kadapa updates: వైఎస్ వివేకానంద రెడ్డి హత్యకేసులో విచారణ చేపట్టిన సిబిఐ బృందం ....

    కడప :

    -మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్యకేసులో పులివెందులలో విచారణ చేపట్టిన సిబిఐ బృందం .....

    -పులివెందుల కోర్టులో పబ్లిక్ ప్రాసిక్యూటర్ శ్రీకాంత్ ను మరోసారి విచారిస్తున్న సిబిఐ అధికారులు ....

    -ఈ హత్యకు సంబంధించిన పూర్తి వివరాలను అడిగి తెలుసుకున్నట్టు సమాచారం .....

  • Kakinada rain updates: భారీ వర్షాలకు జలమయమైన కాకినాడ నగరం..
    15 Sep 2020 8:36 AM GMT

    Kakinada rain updates: భారీ వర్షాలకు జలమయమైన కాకినాడ నగరం..

    తూర్పుగోదావరి:

    కాకినాడ.. 

    -చెరువులను తలపిస్తున్న నగరంలోని ప్రధాన రహదారులు..

    -మెయిన్ రోడ్, సినిమా రోడ్, సాంబమూర్తినగర్, రామారావు పేట, గాంధీనగర్ లో నడుం లోతు నీళ్ళల్లో ప్రయాణిస్తున్న వాహనాలు..

    -కాకినాడ జీజీహెచ్ లోకి చేరిన వర్షం నీరు. తల్లి పిల్లల వార్డు, ఓపి, రేడియాలజీ, బ్లడ్ బ్యాంకు విభాగాల్లో చేరిన వర్షం నీరు..

    -తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న రోగులు, వారి బంధువులు..

    -చెరువును తలపిస్తున్న మున్సిపల్ కార్పొరేషన్ ఆఫీసు, ఆర్టీసీ బస్టాండ్..

    -ఉదయం 6 గంటల నుంచి 1 గంట వరకు ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షం..

    -నిమిషాల వ్యవధిలో భగభగ మంటున్న భానుడు..

    -మధ్యాహ్నం 1 గంట నుంచి కాస్తున్న ఎండ..

Print Article
Next Story
More Stories