Live Updates:ఈరోజు (ఆగస్ట్-15) తెలంగాణా బ్రేకింగ్ న్యూస్!

ఈరోజు పంచాంగం

ఈరోజు శనివారం, 15 ఆగస్ట్, 2020 : శ్రీ శార్వరి నామ సంవత్సరం.. దక్షిణాయనం.. శ్రావణ మాసం, కృష్ణపక్షం ఏకాదశి(ఉ. 11-01వరకు) తదుపరి ద్వాదశి ; ఆర్ద్ర నక్షత్రం (తె. 5-18 వరకు) తదుపరి పునర్వసు నక్షత్రం, అమృత ఘడియలు (సా0.6-56 నుంచి 08-36 వరకు), వర్జ్యం (మ.01-08 నుంచి 02-48 వరకు) దుర్ముహూర్తం (ఉ. 05-46 నుంచి 07-26 వరకు) రాహుకాలం (ఉ.09-00 నుంచి 10-30 వరకు) సూర్యోదయం ఉ.05-46 సూర్యాస్తమయం సా.06-23

స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు

రాష్ట్రపతి రామ్ నాధ్ కోవింద్ స్వతంత్ర దినోత్సవ సందేశం

ఈరోజు తాజా వార్తలు

Show Full Article

Live Updates

  • మోడీ ప్రజాస్వామ్య విలువలను పాతరేస్తున్నారు: చాడా  వెంకట్ రెడ్డి
    15 Aug 2020 8:17 AM GMT

    మోడీ ప్రజాస్వామ్య విలువలను పాతరేస్తున్నారు: చాడా వెంకట్ రెడ్డి

    ప్రజాస్వామ్య విలువలను మోడీ పాతరేస్తున్నారని చాడా. వెంకట్ రెడ్డి సీపీఐ రాష్ట్ర కార్యదర్శి విమర్శించారు 

    ఆత్మ నిర్భర్ భారత్ పేరిట కార్పొరేట్ శక్తులకు దోచి పెడుతున్నారు.

    అయోధ్య లో మోహన్ భగవత్ కు ఎం పని మోడీ చెప్పాలి.

    దేశంలో లౌకిక వ్యవస్థ ప్రమాదంలో పడింది.

  • రాజ్యాంగాన్ని రక్షించుకుందాం , ప్రజాస్వామ్యన్నీ కాపాడుకుందాం: ఏఐటీయూసీ నేతలు
    15 Aug 2020 8:13 AM GMT

    రాజ్యాంగాన్ని రక్షించుకుందాం , ప్రజాస్వామ్యన్నీ కాపాడుకుందాం: ఏఐటీయూసీ నేతలు

    ఏఐటీయూసీ రాష్ట్ర కార్యాలయం వద్ద రాజ్యాంగాన్ని రక్షించుకుందాం , ప్రజాస్వామ్యన్నీ కాపాడుకుందాం నినాదంతో వామపక్ష పార్టీల ఆధ్వర్యంలో ప్రతిజ్ఞ , నిరసన కార్యక్రమం.

    పాల్గొన్న సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ , సీపీఎం పొలిట్ బ్యూరో సభ్యులు రాఘవులు , సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడా వెంకట్ రెడ్డి , సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం 

  • శంషాబాద్ విమానాశ్రయం లో బంగారం పట్టివేత
    15 Aug 2020 8:08 AM GMT

    శంషాబాద్ విమానాశ్రయం లో బంగారం పట్టివేత

    శంషాబాద్ విమానాశ్రయం లో బంగారం పట్టివేత

    837 గ్రాముల బంగారాన్ని లో దుస్తుల్లో, బ్యాగుల్లో ధరించిన నలుగురు యువకులు

    రియాద్ నుండి వచ్చిన నలుగురు యువకులను తనిఖీ చేసిన కస్టమ్స్ అధికారులు.

    45 లక్షలు విలువ చేసే బంగారం స్వాధీనం...

  • న‌ల్లొండ క‌‌లెక్ట‌రేట్‌లో స్వాతంత్య్ర దినోత్స‌వ వేడుకలు.
    15 Aug 2020 8:07 AM GMT

    న‌ల్లొండ క‌‌లెక్ట‌రేట్‌లో స్వాతంత్య్ర దినోత్స‌వ వేడుకలు.

    నల్గొండ జిల్లా..74 వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా నల్గొండ జిల్లా కలెక్టర్ కార్యాలయం లో గౌరవ వందనం స్వీకరించి, జాతీయ జెండా ను ఆవిష్కరించిన శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి..

    పాల్గొన్న కలెక్టర్ ప్రశాంత్ పాటిల్,ఎస్పీ రంగనాథ్,

    ఎమ్మెల్యే లు, కంచర్ల భూపాల్ రెడ్డి, చిరుమర్తి లింగయ్య, ,భాస్కర్ రావు, నరసింహయ్య , రవీంద్ర కుమార్..

  • కామారెడ్డి క‌లెక్ట‌రేట్‌లో స్వాతంత్య్ర దినోత్స‌వ వేడుకలు
    15 Aug 2020 8:04 AM GMT

    కామారెడ్డి క‌లెక్ట‌రేట్‌లో స్వాతంత్య్ర దినోత్స‌వ వేడుకలు

    కామారెడ్డి : జిల్లా కలెక్టర్ కార్యాలయంలో 74 వ స్వాతంత్ర దినోత్సవం సందర్బంగా జాతీయ జెండా ఆవిష్కరించిన శాసన సభాపతి పోచారం శ్రీనివాస్ రెడ్డి.. పాల్గొన్న ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్, ఎంపీ బిబిపాటిల్, జుక్కల్ ఎమ్మెల్యే హన్మంత్ షిండే, కలెక్టర్ శరత్ కుమార్, జడ్పీ చైర్మన్ దఫెదర్ శోభ.

  • కామారెడ్డి క‌లెక్ట‌రేట్‌లో స్వాతంత్య్ర దినోత్స‌వ వేడుకలు
    15 Aug 2020 8:04 AM GMT

    కామారెడ్డి క‌లెక్ట‌రేట్‌లో స్వాతంత్య్ర దినోత్స‌వ వేడుకలు

    కామారెడ్డి : జిల్లా కలెక్టర్ కార్యాలయంలో 74 వ స్వాతంత్ర దినోత్సవం సందర్బంగా జాతీయ జెండా ఆవిష్కరించిన శాసన సభాపతి పోచారం శ్రీనివాస్ రెడ్డి.. పాల్గొన్న ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్, ఎంపీ బిబిపాటిల్, జుక్కల్ ఎమ్మెల్యే హన్మంత్ షిండే, కలెక్టర్ శరత్ కుమార్, జడ్పీ చైర్మన్ దఫెదర్ శోభ.

  • సూర్య‌పేట క‌లెక్ట‌రేట్‌లో స్వాతంత్య్ర దినోత్స‌వ వేడుకలు
    15 Aug 2020 8:03 AM GMT

    సూర్య‌పేట క‌లెక్ట‌రేట్‌లో స్వాతంత్య్ర దినోత్స‌వ వేడుకలు

    సూర్యపేట జిల్లా: 74 వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా సూర్యపేట జిల్లా కలెక్టర్ కార్యాలయం లో గౌరవ వందనం స్వీకరించి,జాతీయ జెండా ను ఆవిష్కరించిన మంత్రి జగదీష్ రెడ్డి..పాల్గొన్న ఎంపీ లింగయ్య యాదవ్,ఎమ్మెల్యే గాదరి కిషోర్ కుమార్..

    కలెక్టర్ వినయ్ కృష్ణా రెడ్డి ,ఎస్పీ భాస్కరన్... లు 

  • కరీంనగర్ జిల్లా వీణవంక మండలంలో విషాదం ...
    15 Aug 2020 7:59 AM GMT

    కరీంనగర్ జిల్లా వీణవంక మండలంలో విషాదం ...

    కరీంనగర్ జిల్లా వీణవంక మండలం కనపర్తి గ్రామంలో విషాదం ...

    జమ్మికుంట మండలం ఇందిరా నగర్ వద్ద ప్రమాదవశాత్తు కల్వర్టును ఢీకొని సివిల్ కానిస్టేబుల్ తిరుపతి మృతి

  • అనేక రంగాల్లో తెలంగాణ దేశానికే  ఆద‌ర్శం: మ‌ంత్రి ఈటెల‌
    15 Aug 2020 7:57 AM GMT

    అనేక రంగాల్లో తెలంగాణ దేశానికే ఆద‌ర్శం: మ‌ంత్రి ఈటెల‌

    పెద్దపల్లి జిల్లా : జిల్లా కలెక్టర్ కార్యాలయంలో జాతీయ జెండా ఆవిష్కరణ చేసి స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో పాల్గొన్న వైద్య ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్ ...

    మినిస్టర్ కామెంట్స్ :  యావత్ ప్రజానీకానికి స్వాతంత్ర్యదినోత్సవ శుభాకాంక్షలు.

    ఎంతోమంది మహనీయుల త్యాగఫలం మన స్వాతంత్య్రం.

    భారతావని విముక్తికోసం అమరులైన వారందరికీ నివాళులు అర్పిస్తున్నాము.

    రాష్ట్రంగా అవతరించిన తెలంగాణ అతి తక్కువ కాలంలో దేశంలో ఒక రోల్ మోడల్ గా నిలిచింది.

    అనేక రంగాల్లో దేశానికే ఆదర్శప్రాయంగా నిలిచింది.

    ఆనాడు ఏ నీళ్ళ కోసం కొట్లాడినమో, ఏ కరెంటు లేక అత్మహత్యలు చేసుకున్నమో, పేదరికంతో పల్లెలు పట్టణాలు తల్లడిల్లామో వాటికి చరమగీతం పాడాం ..

    ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో అతి సంపన్నమైన ప్రాంతం పెద్దపల్లి.

    గొప్పగా విలసిల్లుతున్న జిల్లా పెద్దపల్లి ...

    మేడిగడ్డ , సుందిల్ల, అన్నారం లాంటి ప్రాజెక్టులన్నీ ఈ జిల్లాలోనే ఉన్నాయి. అన్ని రంగాల్లో పెద్దపల్లి జిల్లా ను ముందుకు తీసుకువెళ్ళడానికి కృషి చేస్తాం.

  • 15 Aug 2020 7:54 AM GMT

    హైదరాబాద్ లోని ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ లో జాతీయ జెండా ఎగురవేసిన టీటీడీపీ అధ్యక్షుడు యల్ రమణ

Print Article
Next Story
More Stories