Live Updates: ఈరోజు (సెప్టెంబర్-14) ఆంధ్రప్రదేశ్ బ్రేకింగ్ న్యూస్!

ఈరోజు పంచాంగం

ఈరోజు సోమవారం | 14 సెప్టెంబర్, 2020 |శ్రీ శార్వరి నామ సంవత్సరం.. దక్షిణాయనం | భాద్రపద మాసం | కృష్ణపక్షం | ద్వాదశి (రా. 10-01వరకు) తదుపరి త్రయోదశి | పుష్యమి నక్షత్రం (మ. 1-22 వరకు) తదుపరి ఆశ్లేష | అమృత ఘడియలు: ఉ.6-57 నుంచి 8-33 వరకు | వర్జ్యం: రా.1-55 నుంచి 3-30 వరకు | దుర్ముహూర్తం: మ.12-20 నుంచి 1-09 వరకు తిరిగి మ. 2-47 నుంచి 3-36 వరకు | రాహుకాలం: ఉ. 7-30 నుంచి 9-00 వరకు | సూర్యోదయం: ఉ.5-50 | సూర్యాస్తమయం: సా.6-03

ఈరోజు తాజావార్తలు

Show Full Article

Live Updates

  • 14 Sep 2020 12:13 PM GMT

    West Godavari Updates: ద్వారకాతిరుమల చిన్న వెంకన్న ఆలయాన్ని సందర్శించిన జిల్లా ఎస్పీ నారాయణ నాయక్..

    పశ్చిమగోదావరి జిల్లా..

    -ఆలయ ప్రాంగణాన్ని, ఆలయ పరిసరాలను పర్యవేక్షించిన ఎస్పీ..

    -ఆలయ సెక్యూరిటీ, భద్రత, సీసీ కెమెరాల పనితీరును పరిశీలించిన ఎస్పీ..

    -ఆలయానికి పటిష్ట భద్రతా కల్పించాలని అధికారులకు సూచించిన ఎస్పీ...

  • Kadapa updates: వైఎస్ వివేకానంద రెడ్డి హత్యకేసులో విచారణ చేపట్టిన సిబిఐ బృందం .....
    14 Sep 2020 12:10 PM GMT

    Kadapa updates: వైఎస్ వివేకానంద రెడ్డి హత్యకేసులో విచారణ చేపట్టిన సిబిఐ బృందం .....

    కడప :

    -మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్యకేసులో రెండవ విడత విచారణ చేపట్టిన సిబిఐ బృందం .....

    -పులివెందుల పబ్లిక్ ప్రాసిక్యూటర్ శ్రీకాంత్ ను సిబిఐ అధికారులు డీఎస్పీ ఆఫీసులో విచారణ.....

    -ఈ హత్యకు సంబంధించిన పూర్తి వివరాలను అడిగి తెలుసుకున్నట్టు సమాచారం .....

  • Amaravati updates: రాష్ట్రంలో చేనేత రంగాన్ని కాపాడేందుకు కేంద్రం పై ఒత్తిడి తేవాలని మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డికి నారా లోకేష్ లేఖ..
    14 Sep 2020 11:29 AM GMT

    Amaravati updates: రాష్ట్రంలో చేనేత రంగాన్ని కాపాడేందుకు కేంద్రం పై ఒత్తిడి తేవాలని మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డికి నారా లోకేష్ లేఖ..

    అమరావతి..

    -ఏపీ లోని పొందూరు, ధర్మవరం, ఉప్పాడ, మంగళగిరి ప్రాంతాల్లో చేనేత గొప్ప వారసత్వ సంపదగా లక్షలాది మందికి ఉపాధి కల్పిస్తోంది.

    -ఆగస్టు లో కేంద్ర ప్రభుత్వం అఖిల భారత చేనేత బోర్డు, అఖిల భారత హస్తకళల బోర్డు, అఖిల భారత పవర్‌లూమ్ బోర్డును రద్దు చేసింది.

    -ఈ బోర్డుల్లో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ అధికారులు, చేనేత నిపుణులు, ప్రతినిధులు సభ్యులుగా ఉండేవారు.

    -ఈ బోర్డులు తరచూ సమావేశమై చేనేత అభివృద్ధి,సంక్షేమంపై కేంద్రానికి సిఫార్సులు చేసేది.

    -చేనేత రంగంలో సంపూర్ణ అభివృద్ధి కార్యక్రమాల రూపకల్పన, చేనేత రంగం ఎదుర్కొనే సమస్యలు పరిష్కరించడం ఈ బోర్డుల ప్రధాన లక్ష్యం.

    -నిరుద్యోగాన్ని తగ్గించి చేనేతను ఒక సమర్థవంతమైన వృత్తిగా మార్చడంలో ఈ బోర్డులు ఎంతగానో కృషి చేసాయి.

    -దేశ, విదేశాల్లో చేనేత ల మార్కెట్లను విస్తరించడానికి ప్రణాళికలు రచించడం ఈ బోర్డుల ఉద్దేశ్యం.

    -ప్రభుత్వానికి-చేనేతల మధ్య ఉన్న ఏకైక వారధి అఖిల భారత చేనేత బోర్డు.

    -కేంద్రం 3బోర్డులను రద్దు చేయటం చేనేత, హస్తకళాకారుల పరిస్థితి దయనీయంగా మారింది.

    -గ్రామీణ ప్రాంతాల్లో ఆర్థిక భద్రత కల్పించేందుకు వీటి పునరుద్ధరణ ఎంతో అవసరం


  • Amaravati updates: దేవ‌దాయ శాఖ మంత్రి వెల్లంపల్లి తో భేటీ అయిన ఆ శాఖ క‌మిష‌న‌ర్ పి.అర్జున‌రావు‌..
    14 Sep 2020 11:24 AM GMT

    Amaravati updates: దేవ‌దాయ శాఖ మంత్రి వెల్లంపల్లి తో భేటీ అయిన ఆ శాఖ క‌మిష‌న‌ర్ పి.అర్జున‌రావు‌..

    అమరావతి..

    -ఫిబ్రవరిలోపు అంతర్వేదిలో రథం నిర్మాణం పూర్తి చెయ్యాలన్న మంత్రి వెల్లంపల్లి

    -అంతర్వేది స్వామి వారి కల్యాణోత్సవాల లోపు అందరి అభిప్రాయం పరిగణలోకి తీసుకొని రధం సిద్ధం చెయ్యాలన్న మంత్రి.

    -రధం సిద్ధం చేసే క్రమంలో అన్ని అకృతులను పరిశీలించాలని అధికారుల‌ను అదేశించిన మంత్రి

    -రథం నిర్మాణంపై చర్చించి ఆకృతిని తయారు చేయించారన్న దేవాదాయ శాఖ కమిషనర్

    -కొత్త రథాన్ని శిఖరంతో కలిపి 41 అడుగుల ఎత్తు వచ్చేలా ఆకృతిని సిద్ధం చేశామని మంత్రి దృష్టికి తీసుకొచ్చిన కమిషనర్.

    -ఆరు చక్రాలతో కూడిన రథం మొత్తాన్ని ఏడు అంతస్తుల్లా రూపొందిస్తున్న కమిషనర్.

    -కొత్త రథం నిర్మాణంతో పాటు ర‌థ‌శాల మరమ్మతులు నిమిత్తం రూ.95 లక్షలు ఖర్చవుతుందని తెలిపిన కమిషనర్.

  • Amaravati updates: ఏపీ డీజీపీపై హైకోర్టు ఆగ్రహం....
    14 Sep 2020 11:06 AM GMT

    Amaravati updates: ఏపీ డీజీపీపై హైకోర్టు ఆగ్రహం....

    అమరావతి..

    -అమలాపురం మండలం ఇందుపల్లిలో వెంకటరాజు అనే వ్యక్తి అదృశ్యం

    -హైకోర్టులో హెబియస్ కార్పస్ పిటిషన్ వేసిన బాధితుడి మేనమామ

    -వెంకటరాజు విషయంలో పోలీసుల తీరుపై హైకోర్టు ఆగ్రహం

    -గతంలో మూడు సార్లు జుడిషియల్ విచారణ చేస్తే పోలీసులదే తప్పని తేలిందంటూ హైకోర్టు కీలక వ్యాఖ్యలు

    -ఏపీలో పోలీస్ వ్యవస్థ గాడితప్పుతోందన్న హైకోర్టు

    -ఏపీలో రూల్ ఆఫ్ లా అమలు కావడం లేదని మండిపాటు

    -పోలీస్ వ్యవస్థను కంట్రోల్ చేయలేకపోతే డీజీపీ రాజీనామా చేయాలన్న హైకోర్టు

    -గతంలో డీజీపీని పలు సార్లు కోర్టుకు పిలిపించినా మార్పు రాలేదన్న హైకోర్టు

    -ప్రతిసారి ఇలాంటి పరిస్థితే వస్తే ప్రభుత్వానికి ఇబ్బంది వస్తుందని హైకోర్టు వ్యాఖ్య

    -ప్రతి కేసులో సీబీఐ విచారణ సాధ్యం కాదన్న హైకోర్టు

  • Srikakulam updates: జగన్ విద్యుత్ సంస్కరణలు ఎలా అమలు చేస్తాడో చూస్తాం..శైలజానాథ్..
    14 Sep 2020 10:51 AM GMT

    Srikakulam updates: జగన్ విద్యుత్ సంస్కరణలు ఎలా అమలు చేస్తాడో చూస్తాం..శైలజానాథ్..

    శ్రీకాకుళం జిల్లా..

    ఏపీసీసీ అధ్యక్షుడు శైలజానాథ్ కామెంట్స్..

    -బిజెపి ప్రభుత్వానికి జగన్ అనుంగ మిత్రుడు..

    -విద్యుత్ సంస్కరణలు ఏడాది అమలు చేయమని కేంద్ర పెద్దలు చెప్పగానే, ఇక్కడ సిద్ధం అయిపోయారు..

    -చంద్రబాబు ఉచిత విద్యుత్ వ్యతిరేకి..

    -రైతులకు అన్యాయం చేస్తే ఆ పాపం మిమ్మల్ని వదలదు..

    -కరోనా కారణంగా ఉపాధి కోల్పోయి ఇబ్బందులు పడుతున్నా వారిని ఆదుకునే ఆలోచన జగన్ కి కానీ, బిజెపి కానీ ఉందా అని ప్రశ్నిస్తున్నా..

    -వైసిపి, బీజేపీ లకు ప్రజలను మభ్యపెట్టే ఆలోచన తప్ప మరోటి ఉందా ?

    -అమరావతి పై బిజెపి ద్వంద్వ వైఖరిని అవలంభిస్తోంది..

    -బీజేపీ రాష్ట్ర నాయకులు అమరావతికి కట్టుబడి ఉన్నామని చెప్తారు..

    -కేంద్రం మొహం మీద కొట్టినట్లు కోర్టులో అఫిడవిట్ దాఖలు చేస్తుంది..

    -మోడీ, అమిత్ షా లకు తెలియకుండా ఇవన్నీ జరుగుతున్నాయా ?

  • Amaravati updates: ఏపీలో ఇళ్ల పట్టాల పంపిణీపై ప్రభుత్వం కసరత్తు..
    14 Sep 2020 10:41 AM GMT

    Amaravati updates: ఏపీలో ఇళ్ల పట్టాల పంపిణీపై ప్రభుత్వం కసరత్తు..

    అమరావతి:

    -వచ్చేనెల 2వతేదీన ఇళ్ల పట్టాలు పంపిణీ చేపట్టాలని భావించిన ప్రభుత్వం

    -కోర్టు కేసులున్నందున ఇళ్ల పట్టాల పంపిణీపై సాధ్యాసాధ్యాలు పరిశీలన.

    -భూముల విషయంలో కేసులు ఎక్కదున్నాయనే వివరాలు సేకరిస్తోన్న అధికారులు.

    -ఇప్పటికే రాజధానిలో ఇళ్ల స్థలాల పంపిణీ పై కోర్టు స్టే.

    -ఆవ భూముల్లో ఇళ్ల పట్టాల పంపిణీ రద్దు చేసిన కోర్టు.

    -ఏపీ వ్యాప్తంగా ఒకేసారి ఇళ్ల పట్టాలు పంపిణీ చేయాలని భావిస్తున్న ప్రభుత్వం.

    -కొన్ని ప్రాంతాల్లో ఇచ్చి, మరికొన్ని ప్రాంతాల్లో నిలుపుదల చేయటం సరికాదని భావన..

    -ఇళ్ల పట్టాల విషయంలో కొన్నిరోజుల ఆగుదామని ఏపీ ప్రభుత్వానికి అధికారుల ప్రతిపాదనలు.

    -ఇళ్ల పట్టాల పంపిణీ పై ఆదేశాల కోసం ఎదురుచూస్తోన్న అధికారులు

  • 14 Sep 2020 10:37 AM GMT

    Srikakulam updates: ప్రజలు కరోనాతో బాధలు అనుభవిస్తుంటే కేంద్ర , రాష్ట్ర ప్రభుత్వాలు చేతులెత్తేశాయి..శైలజానాథ్..

    శ్రీకాకుళం జిల్లా..

    ఏపీసీసీ అధ్యక్షుడు శైలజానాథ్ కామెంట్స్..

    -ఆరు నెలలు గడిచాయి.. ఈ విపత్కర పరిస్థితుల నుంచి ఎలా బయటపడాలి అని ప్రజలు ఆలోచిస్తుంటే..

    -తమ రహస్య అజెండాలను ఎలా అమలు చేయాలని మోడీ, ఆయన అనుంగ మిత్రుడు జగన్ ఆలోచన చేస్తున్నారు..

    -జగన్ ప్రభుత్వం ప్రవేశ పెట్టిన విద్యుత్ సంస్కరణలు కాంగ్రెస్ పార్టీగా వ్యతిరేకిస్తున్నాం..

    -ప్రభుత్వం విద్యుత్ సంస్కరణలు శ్రీకాకుళం నుంచి ప్రారంభిస్తే..

    -మేము ప్రతిఘటన - పోరాటం ఇక్కడి నుంచే ప్రారంభిస్తున్నాం..

    -కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు మీటర్ల ప్రతిపాదన వచ్చింది..

    -60 ఏళ్ళు పాలించిన కాంగ్రెస్ లక్ష కోట్లు అప్పుచేసింది..

    -ఏడాది పాలనలో లక్ష కోట్లకు పైగా అప్పులు చేసిన ఘనత జగన్ కే దక్కుతుంది..

    -రాష్ట్రంలో కార్పొరేషన్ బాండ్లు అమ్మేశారు, ఆస్తులు అమ్ముతామంటున్నారు, ఉద్యోగులకు జీతాలు ఇవ్వలేని పరిస్థితి..

    -కేవలం అప్పుకోసం మోడీ దగ్గర జగన్ మోకాళ్ళమీద నిలబడ్డాడు..

  • 14 Sep 2020 10:34 AM GMT

    West Godavari-Jaggampeta updates: ఏలేరు ముంపుపై జిల్లా కలెక్టర్ కు లేఖరాసిన మాజీ ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రు..

    తూర్పుగోదావరిజిల్లా..జగ్గంపేట..

    -కిర్లంపూడి మండలం రాజుపాలెంలో కాలనీ ఏలేరు ముంపుపై జిల్లా కలెక్టర్ కు లేఖరాసిన మాజీ ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రు

    -వాలు కాలువ గండికి శాశ్వత పరిష్కారం కోసం ఇరువైపులా 300 మీటర్ల సేఫ్టీ సిసి వాల్స్ నిర్మించాలి

    -రెండు రోజులుగా ముంపునకు గురైన బాధితులకు పునరావాసం ఏర్పాటు చేయాలి.

    -ఏలేరు వరద ముంపు బాధితులను, రైతులను ఆదుకోవాలి

    -తెలుగుదేశం నేత, మాజీ ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ

  • పల్నాడు లో అధికార పార్టీ హత్య రాజకీయలకు పాల్పడుతుంది...యరపతినేని శ్రీనివాస్..
    14 Sep 2020 9:45 AM GMT

    పల్నాడు లో అధికార పార్టీ హత్య రాజకీయలకు పాల్పడుతుంది...యరపతినేని శ్రీనివాస్..

    గుంటూరు....

    -టిడిపి సీనియర్ నేత మాజీఎమ్మెల్యె యరపతినేని శ్రీనివాస్..

    -కాసు మహేశ్వరెడ్డి అండదండలతో హత్యలు జరుగుతున్నాయి...

    -గాలి,నీరు,మట్టిని కూడా కాసు దోచుకుంటున్నారు....

    -మైనింగ్ పై ప్రశ్నించినందుకు నాలుగురి పై దాడి చేశారు...ఒక్కరు మృతి చెందారు..

    -పోలీసులు ఫ్యాక్షన్ రాజకీయ లను ప్రోత్సహిస్తున్నారు...

    -దాచేపల్లి దాడి ఘటనలో 14మందిపై కేసు పెడితే 5గురిని అదుపులోకి తీసుకున్నారు....

    -పల్నాడు లో ఫ్యాక్షన్ ను పోలీసులు అదుపు చేయకపోతే తీవ్ర పరిణామాలు ఉంటాయి.....

Print Article
Next Story
More Stories