Live Updates:ఈరోజు (ఆగస్ట్-13) తెలంగాణా బ్రేకింగ్ న్యూస్!

ఈరోజు పంచాంగం

ఈరోజు గురువారం, 13ఆగస్ట్, 2020 : శ్రీ శార్వరి నామ సంవత్సరం.. దక్షిణాయనం.. శ్రావణ మాసం, కృష్ణపక్షం నవమి(ఉ. 09-25 వరకు) తదుపరి దశమి; రోహిణి నక్షత్రం (రా. 03-05 వరకు) తదుపరి మృగశిర నక్షత్రం, అమృత ఘడియలు (రా.11-38 నుంచి 01-21 వరకు), వర్జ్యం (సా.0 6-28 నుంచి 08-11 వరకు) దుర్ముహూర్తం (ఉ. 09-58 నుంచి 10-48 వరకు) రాహుకాలం (మ.01-30 నుంచి 3-00 వరకు) సూర్యోదయం ఉ.05-45 సూర్యాస్తమయం సా.06-25

ఈరోజు తాజా వార్తలు

Show Full Article

Live Updates

  • 13 Aug 2020 10:29 AM GMT

    బీజేపీ మీడియా స్టేట్మెంట్.


    కె కృష్ణసాగర రావు


    బీజేపీ ముఖ్య అధికార ప్రతినిధి,


    ప్రధాన మంత్రి ప్రారంభించిన కొత్త పన్ను సంస్కరణలను బీజేపీ హృదయ పూర్వకంగా స్వాగతిస్తోంది. ఇంత కష్ఠకాలంలో కూడా భారీ సంస్కరణలు చేపట్టడం ద్వారా, రిఫామ్, పెర్ఫామ్, ట్రాన్స్ఫామ్ (సంస్కరణ, సమర్థ పనితీరు, మార్పు) అనే తన అజెండాను అమలు చేసింది మా జాతీయ ప్రభుత్వం.


    'నిజాయితీగా ఉన్న వారిని గౌరవించడం' అనేది ఈ కొత్త పన్ను విధానం. పన్నులు నిజాయితీగా చెల్లించే వారికి ఏ సంస్థల నుంచీ వేధింపుల భయం ఉండదు ఈ కొత్త విధానం వల్ల. నిజాయితీగా పన్ను చెల్లించేవారికి మరింత సౌకర్యం, లాభాలు అందిస్తోంది కొత్త విధానం. వివాదాల్లో మానవ జోక్యం లేకుండా, విచారణ, అప్పీలుకు అవకాశం కల్పించారు.


    ఈ కొత్త సంస్కరణలు తక్షణం అమల్లోకి వస్తాయి. ఇప్పటికే కార్పొరేట్ పన్ను తగ్గించి, డివిడెండ్ పంపిణీ పన్ను రద్దు చేయగా, ఇది వాటికి కొనసాగింపు.


    ప్రధాని మోదీ నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వం ప్రత్యక్ష, పరోక్ష పన్నుల్లో వేగంగా సంస్కరణలు చేయడాన్ని బీజేపీ అభినందిస్తోంది.


  • 13 Aug 2020 10:28 AM GMT

    మంచిర్యాల జిల్లా కేంద్రంలో కోవిడ్ నిబంధనలను అతిక్రమించి తల్వార్ తో జన్మదిన వేడుకలు జరుపుకోన్న టీఆరెస్ యూత్ పట్టణ అధ్యక్షుడు గడప రాకేష్,


    ఆ వీడియో సోషల్ మీడియాలో చక్కర్ కొట్టడంతో గడప రాకేష్ తో పాటు మరో 8 మంది పై కేసు నమోదు చేసిన పోలీసులు,


    ఈ ఘటన సీరియస్ గా తీసుకొని 9 మందిని పిలిచి హెచ్చరించిన రామగుండం పోలీస్ కమిషనర్ సత్యనారాయణ


  • 13 Aug 2020 10:28 AM GMT

    కామారెడ్డి :


    జిల్లాలోని సదాశివనగర్, గాంధారి మండలాల్లో పర్యటించిన జిల్లా కలెక్టర్ శరత్ కుమార్


    సదాశివనగర్ మండలం పద్మాజీవాడి గ్రామ శివారులో అవెన్యూ ప్లాంటేషన్ నిర్లక్ష్యంపై గ్రామ సర్పంచ్, పంచాయతీ కార్యదర్శిలకు షోకాజ్ నోటీసు జారీ చేయాలని డిపిఓకు ఆదేశం


    భూంపల్లి అవెన్యూ ప్లాంటేషన్ మొక్కలు ఎండిపోయినందుకు పంచాయతీ కార్యదర్శిపై చర్యలు తీసుకోవాలని సూచన


    ప్లాంటేషన్ మొక్కల పర్యవేక్షణ చేయనందుకు ఎంపీడీఓ, ఎంపిఓలకు చార్జీ మెమో జారీ


    పనుల పట్ల నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవని హెచ్చరించిన కలెక్టర్


  • 13 Aug 2020 7:38 AM GMT

    జోగులాంబ గద్వాల జిల్లా:

    - గద్వాల పట్టణంలోని సంగాల చెరువులో వదిలేందుకు మత్స్య కారులకు ఉచితంగా చేపలు‌ పంపిణీ చేసిన ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి.

  • 13 Aug 2020 7:37 AM GMT

    హన్మకొండలో మంద కృష్ణమాదిగ ప్రెస్ మీట్

    వరంగల్ అర్బన్:

    - హన్మకొండలో మంద కృష్ణమాదిగ ప్రెస్ మీట్

    - 2023 నాటికి కేసీఆర్ రూపంలో నడుస్తున్న దొరల పాలన అంతం కాబోతోంది.

    - 2003 లొనే తల్లి తెలంగాణా పుస్తకంలో దళితులను మోసం చేసి ముఖ్యమంత్రి అవుతాడని వ్రాసాను.

    - నిండు అసెంబ్లీ లో నేను దొరనే అని బాహాటంగా ప్రకటించిన కేసీఆర్.

    - అన్ని రాజకీయ పార్టీలు కరోనా ను ఆరోగ్యశ్రీ లో చేర్చాలని డిమాండ్ చేస్తున్న ప్రభుత్వం ఇంతవరకు స్పందించడం. లేదు.

    - లోటు బడ్జెట్ లో ఉన్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కరోనాను ఆరోగ్య శ్రీ లో చేర్చారు.మిగులు బడ్జెట్ తెలంగాణలో ఎందుకు అమలు చేయడంలేదు.

    - కేసీఆర్ మాటను ధిక్కరించి కరోనా సోకిన ఎమ్మెల్యేలు ప్రవేటు ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు.

    - రాజకీయంగా కేసీఆర్ భారీ మూల్యం చెల్లించే రోజు దగ్గర్లోనే ఉంది.

    - ఆరు సంవత్సరాల కేసీఆర్ పాలనలో దళిత గిరిజన వర్గాలకు భూ పంపిణీ ఎందుకు జరగడంలేదు.

    - దళితులను వంచిస్తున్న కేసీఆర్. కడియం శ్రీహరి ని మంత్రి మండలి నుండి తొలగించారు.

    - రైతు వేదికల పేరుతో దళితుల భూములు లాక్కుంటున్నారు.

  • 13 Aug 2020 7:36 AM GMT

    టీఎస్ హైకోర్టు:

    - తెలంగాణ రాష్ట్రం లో 8 వేల మంది ఫీల్డ్ అసిస్టెంట్ల ను తొలగించడాన్ని సవాలు చేస్తూ హైకోర్టు పిటీషన్ దాఖలు...

    - నేషనల్ రూరల్ ఎంప్లాయిమెంట్ గ్యారెంటీ స్కీమ్ 2005 యాక్ట్ ప్రకారం పనిచేస్తున్న ఫీల్డ్ అసిస్టెంట్లు...

    - గత నాలుగు నెలలుగా జీతాలు ఇవ్వకుండా ఉద్యోగులను తొలగించడాన్ని సవాలు చేసిన ఉద్యోగులు..

    - తొలగించిన 8 వేల మంది ఫీల్డ్ అసిస్టెంట్ల ను తిరిగి విధుల్లోకి తీసుకోవాలని పిటీషన్..

    - పెండింగులో ఉన్న నాలుగు నెలల జీతం చెల్లించే విధంగా ఆదేశాలు ఇవ్వాలని కోరిన పిటీషన్..

    - నేడు పిటీషన్ పై విచారించనున్న హైకోర్టు.

  • 13 Aug 2020 7:35 AM GMT

    వరంగల్ అర్బన్ :

    - కాకతీయ యూనివర్సిటీ మొదటి గేట్ వద్ద యువజన కాంగ్రెస్ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం బొమ్మ దహనం .

    - ప్రగతి భవన్ ముట్టడికి వెళ్లిన నాయకులను అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించిన వారిని విడుదల చేయాలని డిమాండ్.

  • 13 Aug 2020 7:08 AM GMT

    టీఎస్ హైకోర్టు:

    - రాపిడ్ యాంటీజన్ టెస్ట్ లు ఎంత వరకు సక్సెస్ అయ్యేయి ఇప్పటి వరకు ప్రభుత్వం చెప్పలేదన్న హైకోర్టు...

    - రాపిడ్ యాంటీజన్ టెస్టులు రీపోర్ట్ కేవలం 40 శాతం మాత్రమే వస్తుందన్న హైకోర్టు..

    - కరోనా పాజిటివ్ ఉన్న వ్యక్తి రాపిడ్ టెస్ట్ వలన నెగిటివ్ వస్తే ఆ వ్యక్తి సమాజం లో తిరిగి అనేక మందికి కరోనా వ్యాపిస్తాడన్న హైకోర్టు..

    - రాపిడ్ యాంటీజన్ టెస్ట్ లపైన ప్రభుత్వం ఏలాంటి నిర్ణయం తీసుకుందో తెలపాలన్న హైకోర్టు...

    - రాష్ట్రంలో చాలా చోట్ల ఆక్సిజన్ బెడ్స్ లేక ఇబ్బందులు పడుతున్నారన్న హైకోర్టు...

    - అసిఫాబాద్, కొత్తగూడెం, మహబూబాబాద్, కామారెడ్డి, నర్సంపేట, వరంగల్, సెంటర్లలో ఆక్సిజన్ బెడ్స్ లేక చాలామంది చనిపోతున్నారన్న హైకోర్టు...

    - మీడియా బులిటెన్ లను ప్రసారం చేయాలని చెప్పినప్పటికీ ఎందుకు ప్రభుత్వం పాటయించుకోలేదో తెలపాలన్న హైకోర్టు..

    - హితం యాప్ పై ప్రజలకు ఎలాంటి అవగాహన కల్పించారని సీఎస్ ను ప్రశ్నిచిన హైకోర్టు...

    - మారుమూల గ్రామాల్లో ఉన్న ప్రజలకు అసలు హితం యాప్ అంటే ఏంటో తెలియదన్న హైకోర్టు..

    - ఇంకా కొనసాగుతూనే ఉన్న వాదనలు....

  • 13 Aug 2020 7:07 AM GMT

    తెలంగాణలో కరోనా పరిస్థితులపై హైకోర్టులో విచారణ...

    టిఎస్ హైకోర్టు:

    తెలంగాణలో కరోనా పరిస్థితులపై హైకోర్టులో విచారణ...

    వీడియోకాన్ఫరెన్స్ ద్వారా విచారణకు హాజరైన సీఎస్‌

    కరోనాకు సంబంధించిన అఫిడవిట్‌ను కోర్టుకు సమర్పించిన సీఎస్...

    మా ఆదేశాలు అమలు చేశారా..లేదా అని సీఎస్‌ను ప్రశ్నించిన హైకోర్టు...

    కరోనా పరీక్షలు ఎక్కువగా చేస్తున్నామని కోర్టుకు తెలిపిన సీఎస్...

    హైకోర్టు ఆదేశాలకు అనుగుణంగా పూర్తి వివరాలతో బులిటెన్‌ విడుదల చేస్తున్నామన్న సీఎస్ సోమేష్‌కుమార్...

  • 13 Aug 2020 7:06 AM GMT

    నారాయణపేట జిల్లా:

    - నారాయణపేట జిల్లా కోస్గి మున్సిపాలిటీ పరిధిలోని సంపల్లి 4వ వర్డ్ స్వతంత్య అభ్యర్థి జనార్దన్ రెడ్డి 30మందితో ఎమ్మెల్యే నరేందర్ రెడ్డి సమక్షంలో టిఆర్ఎస్ లో చేరిక.

Print Article
Next Story
More Stories