Top
logo

Live Updates: ఈరోజు (సెప్టెంబర్-12) తెలంగాణా బ్రేకింగ్ న్యూస్!

Live Updates: ఈరోజు (సెప్టెంబర్-12) తెలంగాణా బ్రేకింగ్ న్యూస్!
X
Highlights

ఈరోజు బ్రేకింగ్ న్యూస్, 12 సెప్టెంబర్, 2020: హెచ్ఎంటీవీ లైవ్ బ్లాగ్ ద్వారా తాజా వార్తలు ఎప్పటికప్పుడు మీకోసం అందిస్తుంది. ఇక్కడ తెలంగాణా రాష్ట్రానికి సంబంధించిన వార్తా విశేషాలను, తాజా సమాచారాన్నిఎప్పటికప్పుడు మీకోసం బ్రేకింగ్ గా ఇస్తున్నాం.

ఈరోజు పంచాంగం

ఈరోజు శనివారం | 12 సెప్టెంబర్, 2020 |శ్రీ శార్వరి నామ సంవత్సరం.. దక్షిణాయనం | భాద్రపద మాసం | కృష్ణపక్షం | దశమి (రా.11-18 వరకు) తదుపరి ఏకాదశి | ఆర్ద్ర నక్షత్రం (మ.12-53 వరకు) తదుపరి పునర్వసు | అమృత ఘడియలు: లేవు | వర్జ్యం: రా.1-07 నుంచి 2-45 వరకు | దుర్ముహూర్తం: ఉ.5-50 నుంచి 7-27 వరకు | రాహుకాలం: ఉ.9-00 నుంచి 10-30 వరకు | సూర్యోదయం: ఉ.5-50 | సూర్యాస్తమయం: సా.6-04

ఈరోజు తాజా వార్తలు

Live Updates

 • LPG Gas Price in AP: గృహావసరాలకు వాడే గ్యాస్ ధర పెంచలేదు!
  12 Sep 2020 2:50 PM GMT

  LPG Gas Price in AP: గృహావసరాలకు వాడే గ్యాస్ ధర పెంచలేదు!

  - ఏపీ ప్రభుత్వం ఎల్ పీజీ గ్యాస్ ధర పెంచిందంటూ వస్తోన్న వార్తలపై స్పెషల్ సీఎస్, కమర్షియల్ ట్యా క్స్ రజత్ భార్గవ్ వివరణ ఇచ్చారు.

  - గృహావసరాలకు వాడే గ్యాస్ ధర పెంచలేదని ప్రభుత్వం స్పష్టీకరణ

  - ఎల్ పీజీ గ్యాస్ పై వ్యాట్ పెంచామన్నది అబద్ధం

  - అసలు ఎల్ పీజీ గ్యాస్ పై ట్యాక్స్ జీఎస్టీ పరిధిలోనిది

  - ఎల్ పీజీ పై రాష్ట్ర ప్రభుత్వం ట్యాక్స్ పెంచే అవకాశమే లేదు-

  - ఏపీ ప్రభుత్వం నేచురల్ గ్యాస్ పై ట్యాక్స్ ను స్వల్పంగా పెంచింది

  -అది పరిశ్రమలకు, విద్యుత్ ఉత్పత్తికి వినియోగించే గ్యాస్ మాత్రమే*

  - వంట గ్యాస్ పై ట్యాక్స్ ఎక్కడా పెంచలేదు

 • 12 Sep 2020 1:45 PM GMT

  KTR Review Meeting: Ghmc కార్యాలయంలో హెచ్ఎండిఎ పై మంత్రి కేటీఆర్ సమీక్ష

  - టిఎస్ బి పాస్ చట్టం వచ్చిన తర్వాత హెచ్ఎండిఎ లో జరగబోయే మార్పులకు సంబంధించి ఇప్పటి నుంచి సంసిద్ధంగా ఉండాలని మంత్రి కేటిఆర్ సూచన

  - హెచ్ఎండిఏ రానున్న కాలంలో ప్లానింగ్, విజనింగ్, డిజైనింగ్ వంటి అంశాలపై మరింత దృష్టి సారించి చర్యలుతీసుకోవాలని, అందుకు ఇప్పటినుంచే ఒక ప్రణాళికను రూపొందించుకోవాలని సూచన

  - ఔటర్ రింగ్ రోడ్ కి సంబంధించిన చర్చ సందర్భంగా ఔటర్ రింగ్ రోడ్డు పైన చేపడుతున్న మౌలిక వసతుల కార్యక్రమాలకు సంబంధించి వివరాలను  అధికారుల నుంచి  అడిగి తెలుసుకున్న మంత్రి కేటీఆర్

  - హైదరాబాద్ గ్రోత్ కారిడార్ పరిధిలో ఉన్న బఫర్ జోన్ లో వచ్చిన నిర్మాణాల పట్ల కఠినంగా వ్యవహరించాలని అధికారులకు స్పష్టమైన ఆదేశాలు

  - పెట్రోల్ బంకులు, ఫుడ్ కోర్టులు, రెస్ట్ ఏరియాలు, గేట్ వే నిర్మాణాలు పి.పి.పి మోడల్ లో ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని అధికారులను నిర్దేశించిన మంత్రి

  - జిహెచ్ఎంసి తరహాలో అసెట్ ప్రొటెక్షన్ సెల్ ఏర్పాటు చేసి దాని ద్వారా ఈ విషయంలో ప్రత్యేక కార్యాచరణ ప్రణాళిక రూపొందించుకోవాలని సూచన

 • 12 Sep 2020 1:42 PM GMT

  Rakul Preet Singh Neighbour: hmtv టీవీ తో రకూల్ ప్రీత్ సింగ్ నేబర్ నళిని కపూర్ పేస్ టు పేస్

  - రకుల్ ప్రీత్ సింగ్ మా అపార్ట్మెంట్ లోనే ఉంటుంది..

  - అందరితో చాలా సరదాగా ఉంటుంది...

  - ఎప్పుడు కనిపించినా చాలా ఆప్యాయంగా పలకరించేది హగ్ కూడా ఇచ్చేది...

  - డ్రగ్స్ కేసులో తన పాత్ర పై మాకు ఎలాంటి సమాచారం లేదు...

  - ఆమె ఇంటికి చాలా మంది వచ్చే వారు...

  - కొన్ని సార్లు అల్లు అర్జున్ ,లక్ష్మి మంచు ,వెంకటేష్ దగ్గుబాటి ని చూశాను...

  - తన తమ్ముడు తో రకుల్ ఇక్కడ ఉంటుంది..

  -  నేను ఫస్ట్ ఫ్లోర్ లోనే ఉంటాను...

  - పావని పలాజో అపార్ట్ మెంట్ లో 301 లో ఉంటుంది.

 • MLA Jagagreddy: L R S పై అసెంబ్లీ లో ప్రస్తావిస్తా: ఎమ్మెల్యే జగ్గారెడ్డి
  12 Sep 2020 12:35 PM GMT

  MLA Jagagreddy: L R S పై అసెంబ్లీ లో ప్రస్తావిస్తా: ఎమ్మెల్యే జగ్గారెడ్డి

   సంగారెడ్డి .

  - L R S కట్టి రెగ్యులరైజ్ చేసుకోండి అని ప్రభుత్వం చెప్తుంది

  - 200 గజాల ప్లాట్ కి 40 వేల ఖర్చు అవుతుంది

  - లే అవుట్ చేసిన వాళ్ళు LRS కట్టకపోవడం తో ఇప్పుడు భారం అంతా కొన్నవాళ్లదే అవుతుంది

  - లే అవుట్ల కు ప్రభుత్వం తొందరగా అనుమతులు ఇవ్వడం లేదు

  - తక్కువ ధరకు వస్తుంది అని ప్లాట్ కొంటున్నారు

  - నగదు రద్దు.. gst.. ఇప్పుడు కరోనా తో జనం ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నారు

  - ప్రభుత్వం కి డబ్బులు కావాలంటే... పేదలపై భారం మోపాలా..?

  - ప్రజలు కరువులో ఉన్నారు

  - LRS కడితేనే రిజిస్ట్రేషన్ చేస్తామని చెప్పడం సరికాదు

 • Ramagundam Updates: రామగుండము ఘటన పై కేంద్ర హోమ్ శాఖ సహాయ మంత్రి సీరియస్
  12 Sep 2020 12:30 PM GMT

  Ramagundam Updates: రామగుండము ఘటన పై కేంద్ర హోమ్ శాఖ సహాయ మంత్రి సీరియస్

  పెద్దపల్లి : 

  - పోలీస్ వ్యవహారం పై మండిపడ్డ కేంద్ర హోమ్ శాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి

  - ఇద్దరు కేంద్ర మంత్రులు వస్తున్న సమయం లో ధర్నా చేస్తుంటే పోలీస్ లు తమాషా చేశారు

  - కాన్వాయ్ ని అంతసేపు గెట్ ముందు ఆపిన పోలీస్ లు ఏమి చేయలేకపోయారు

  - కోవిడ్ నిబంధనలు ఉన్న కూడా కారు మేము నడుచుకుంటూ వెళ్లాల్సి వచ్చింది

  - ఇది ముఖ్యమంత్రి కేసీయార్ విచక్షణకే వదిలేస్తున్న ...

 • 12 Sep 2020 12:23 PM GMT

  Telangana Education Department: కరోనా విజృంభణ ను అరికట్టేందుకు తెలంగాణ విద్యాశాఖ కీలక నిర్ణయం

  - యూ జీ,పీ జీ తరగతులకు చెందిన చివరి సంవత్సరం విద్యార్థులు వారు చదివే కాలేజ్ లోనే పరీక్ష రాసే వెసులుబాటు కల్పించిన విద్యా శాఖ...

  - ఈ వెసులు బాటు ఈ ఒక్క సంవత్సరం మాత్రమే అమలులో ఉంటుంది

  - ఈ నెల 15 నుంచి అన్ని యూనివర్సిటీ లలో చివరి సంవత్సరం పరీక్షలు

 • Black Magic: రాజన్న సిరిసిల్ల జిల్లాలో క్షుద్ర పూజలు కలకలం
  12 Sep 2020 9:03 AM GMT

  Black Magic: రాజన్న సిరిసిల్ల జిల్లాలో క్షుద్ర పూజలు కలకలం

  రాజన్న సిరిసిల్ల జిల్లా : భయాందళనలో హరిత హారం మొక్కల సంరక్షణ చూసే వాచ్ అండ్ వార్డ్స్ ఉపాధి మహిళా కార్మికులు.

  తంగళ్లపల్లి మండలం దేశాయిపల్లె గ్రామంలో క్షుద్ర పూజలు ఆనవాళ్ళు.

  గ్రామంలో హరితహారంలో నాటిన మొక్కల మొదళ్ళలో గడ్డిని కలుపు తీస్తుండగా ఒక చెట్టు మొదట్లో నిమ్మకాయలు, పసుపు, కుంకుమ, అగర్బత్తీలు కొబ్బరికాయలు లభ్యం.

 • PV Narsimha rao: పీవీ పుట్టిన గ్రామాన్ని అభివృద్ధి చేయాలి
  12 Sep 2020 8:58 AM GMT

  PV Narsimha rao: పీవీ పుట్టిన గ్రామాన్ని అభివృద్ధి చేయాలి

  వరంగల్ రూరల్ జిల్లా: నర్సంపేట మండలం లక్నేపల్లి లో పీవీ నర్సింహారావు పుట్టిన ప్రదేశాన్ని పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేయడానికి సందర్శించి పివి విగ్రహనికి పూలమాలలు వేసి నివాళులు అర్పించిన మంత్రులు శ్రీనివాస్ గౌడ్, ఎర్రబెల్లి దయాకర్ రావు, సత్యవతి రాథోడ్, మహబూబాబాద్ యంపి కవిత, ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి, జిల్లా కలెక్టర్ హరిత, పివి కూతురు వాణి దేవి

 • IIIT Basara Admissions: బాసర ట్రిపుల్‌ ఐటిలో ప్రవేశాలకు నోటిఫికేషన్
  12 Sep 2020 8:11 AM GMT

  IIIT Basara Admissions: బాసర ట్రిపుల్‌ ఐటిలో ప్రవేశాలకు నోటిఫికేషన్

  నిర్మల్ జిల్లా బాసర. ట్రిపుల్ ఐటిలో ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల చేసిన. అదికారులు

  ఈ నెల16 నుండి దరఖాస్తుల స్వీకరణ

  ‌దరఖాస్తు చేయడానికి అక్టోబర్ 03 చివరి రోజు..

  ఎంపికైన. విద్యార్థుల మేరిట్ జాబితాను అక్టోబర్ 20న ప్రకటించనున్నా అదికారులు

 • hmtvతో సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్ రెడ్డి
  12 Sep 2020 8:07 AM GMT

  hmtvతో సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్ రెడ్డి

  hmtv తో సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్ రెడ్డి

  కొత్త రెవెన్యూ చట్టం లోని అంశాల పై సీఎం కేసీఆర్ ఆహ్వానం మేరకే శాసనసభ ఆవరణలో సీఎంను కలిశాను.

  కొత్త రెవెన్యూ చట్టం లోని అంశాలపై సుదీర్ఘంగా అక్కడున్న అధికారులతో పాటు మాతో చర్చించారు.

  దుబ్బాక ఉప ఎన్నికల పైన ఎలాంటి చర్చ జరగలేదు.

  దుబ్బాక ఉప ఎన్నికల్లో పోటీ చేయడం పై త్వరలోనే పార్టీ చర్చిస్తుంది.

  పట్టబద్రుల ఎన్నికల్లో మాపార్టీ నాయకులు పోటీ చేద్దామని అంటున్నారు....

  ఒంటరిగా పోటీ చేయాలా ,ఇతర పార్టీలతో కలిసి పోటీ చేయాలా అని ఇంకా నిర్ణయం తీసుకోవాల్సి ఉంది...

  రెవెన్యూ చట్టం పై తప్ప ఎలాంటి రాజకీయ అంశాలు చర్చకు రాలేదు.

  మరోసారి కలుద్దామని సీఎం చెప్పారు.

Next Story