Top
logo

Live Updates:ఈరోజు (ఆగస్ట్-12) తెలంగాణా బ్రేకింగ్ న్యూస్!

Live Updates:ఈరోజు (ఆగస్ట్-12) తెలంగాణా బ్రేకింగ్ న్యూస్!
X
Highlights

ఈరోజు బ్రేకింగ్ న్యూస్, 12 ఆగస్ట్, 2020: హెచ్ఎంటీవీ లైవ్ బ్లాగ్ ద్వారా తాజా వార్తలు ఎప్పటికప్పుడు మీకోసం అందిస్తుంది. ఇక్కడ తెలంగాణా రాష్ట్రానికి సంబంధించిన వార్తా విశేషాలను, తాజా సమాచారాన్నిఎప్పటికప్పుడు మీకోసం బ్రేకింగ్ గా ఇస్తున్నాం.

ఈరోజు పంచాంగం

ఈరోజు బుధవారం, 12 ఆగస్ట్, 2020 : శ్రీ శార్వరి నామ సంవత్సరం.. దక్షిణాయనం.. శ్రావణ మాసం, కృష్ణపక్షం అష్టమి(ఉ.07-58 వరకు) తదుపరి నవమి; కృత్తిక నక్షత్రం (రా. 01-16 వరకు) తదుపరి రోహిణి నక్షత్రం, అమృత ఘడియలు (రా.10-39 నుంచి 12-23 వరకు), వర్జ్యం (మ. 12-10 నుంచి 1-55 వరకు) దుర్ముహూర్తం (ఉ. 11-39 నుంచి 12-30 వరకు) రాహుకాలం (మ.12-00 నుంచి 1-30 వరకు) సూర్యోదయం ఉ.5-45 సూర్యాస్తమయం సా.6-25

ఈరోజు తాజా వార్తలు

Live Updates

 • వరంగల్ లో భారీ వ‌ర్షం .. ప‌లు చోట్ల కూలిన చెట్లు
  12 Aug 2020 2:53 PM GMT

  వరంగల్ లో భారీ వ‌ర్షం .. ప‌లు చోట్ల కూలిన చెట్లు

  వరంగల్ రూరల్ జిల్లా:భారీ వర్షానికి పలు చోట్ల రోడ్లపై కూలిన చెట్లు..

  నర్సంపేట - వరంగల్ ప్రధాన రహదారి పై గీసుగొండ మండలం మరియాపురం క్రాస్ రోడ్డు వద్ద అడ్డంగా కూలిన చెట్లు .

  నిలిచిపోయిన వాహనాలు.

  ఇబ్బందులు పడుతున్న వాహన దారులు ప్రయాణికులు..  

 • శాంతి భ‌ద్ర‌త‌ల‌కు విఘాతం క‌లిగించే పోస్టులు పెట్టోదు: డీజీపీ మహేందర్ రెడ్డి
  12 Aug 2020 2:37 PM GMT

  శాంతి భ‌ద్ర‌త‌ల‌కు విఘాతం క‌లిగించే పోస్టులు పెట్టోదు: డీజీపీ మహేందర్ రెడ్డి

   పౌరులకు విజ్నప్తి: సోషల్ మీడియాలో విద్వేషకర తప్పుడు పోస్టులు బెంగళూరులో ఎంత విద్వేషానికి దారి తీసాయో, ప్రాణ, ఆస్తి నష్టానికి కారణమయ్యాయో మీకు తెలుసు.

  శాంతి భద్రతలను దెబ్బతీసే అలాంటి పోస్టులు పెట్టవద్దని ప్రజలను కోరుతున్నాం

  సోషల్ మీడియాలో అలాంటి విద్వేషకర పోస్టులు పెట్టే వారిని తెలంగాణ పోలీసులు నిరంతరం గమనిస్తారు

  అలాంటి పోస్టులు పెట్టిన వారిపై వెంటనే కేసులు పెట్టి, తగిన కఠిన చర్యలు తీసుకోవాలని ఇప్పటికే అన్ని స్టేషన్లకూ, సీనియర్ అధికారులకూ ఆదేశాలిచ్చాం

  ప్రజలు పోలీసులతో సహకరించి తెలంగాణ భద్రత, రక్షణలో అత్యున్నత స్థాయి పాటించేలా పోలీసులకు సహకరించాలని విజ్నప్తి

 • 12 Aug 2020 2:30 AM GMT

  నాగార్జునసాగర్ ప్రాజెక్టుకు కొనసాగుతున్న వరద.

  నల్గొండ :.

  - పూర్తిస్థాయి నీటిమట్టం : 590.00 అడుగులు.

  - ప్రస్తుత నీటిమట్టం : 562.10 అడుగులు.

  - ఇన్ ఫ్లో :40,259 క్యూసెక్కులు.

  - అవుట్ ఫ్లో : 6816 క్యూసెక్కులు.

  - పూర్తిస్థాయి నీటి నిల్వ : 312.0405 టీఎంసీలు.

  - ప్రస్తుత నీటి నిల్వ : 237.3032 టీఎంసీలు.

 • రాబోయే రెండు రోజుల్లో తెలంగాణాలో వర్షాలు!
  12 Aug 2020 2:04 AM GMT

  రాబోయే రెండు రోజుల్లో తెలంగాణాలో వర్షాలు!

  - తూర్పు-పశ్చిమ shear zone 18.0 deg. N. Lat. వెంబడి మధ్య భారతదేశం మీదుగా 5.8 km నుండి 7.6 km ఎత్తు మధ్య కొనసాగుతోంది. ఇది ఎత్తుకి వెళ్లే కొద్దీ దక్షిణ దిశ వైపుకి వంపు తిరిగి ఉన్నది.

  - వాయువ్య బంగాళాఖాతం మరియు దాని పరిసర ప్రాంతాలలో సుమారుగా ఆగస్టు 13 వ తేదీన అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉంది.

  - ఈరోజు తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు చాలా చోట్ల కురిసే అవకాశం ఉంది

  - ఈరోజు ఆదిలాబాద్, నిర్మల్, కోమురంభీం –ఆసిఫాబాద్, మంచిర్యాల, నిజామాబాద్, కామారెడ్డి, జగిత్యాల, రాజన్నసిరిసిల్ల, పెద్దపల్లి, కరీంనగర్, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, సిద్దిపేట, మెదక్ మరియు సంగారెడ్డి జిల్లాలలో ఒకటి రెండు చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది.

  - రేపు తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు చాలా చోట్ల కురిసే అవకాశం ఉంది.

Next Story