Live Updates: ఈరోజు (11 నవంబర్, 2020) తెలంగాణా బ్రేకింగ్ న్యూస్!

Live Updates: ఈరోజు (11 నవంబర్, 2020) తెలంగాణా బ్రేకింగ్ న్యూస్!
x
Highlights

ఈరోజు బ్రేకింగ్ న్యూస్, 11 నవంబర్, 2020: హెచ్ఎంటీవీ లైవ్ బ్లాగ్ ద్వారా తాజా వార్తలు ఎప్పటికప్పుడు మీకోసం అందిస్తుంది. ఇక్కడ తెలంగాణా రాష్ట్రానికి సంబంధించిన వార్తా విశేషాలను, తాజా సమాచారాన్నిఎప్పటికప్పుడు మీకోసం బ్రేకింగ్ గా ఇస్తున్నాం.

ఈరోజు పంచాంగం

ఈరోజు బుధవారం | 11 నవంబర్, 2020 | శ్రీ శార్వరి నామ సంవత్సరం.. దక్షిణాయనం | నిజ ఆశ్వయుజ మాసం | కృష్ణపక్షం | ఏకాదశి రా.8-33 తదుపరి ద్వాదశి | ఉత్తర నక్షత్రం రా.1-33 తదుపరి హస్త | వర్జ్యం ఉ.9-39 నుంచి 11-10 వరకు | అమృత ఘడియలు సా.6-44 నుంచి 8-15 వరకు | దుర్ముహూర్తంమ.12-06 నుంచి 12-51 వరకు తిరిగి మ.2-22 నుంచి 3-07 వరకు | రాహుకాలం ఉ.11-21 నుంచి 12-06 వరకు | సూర్యోదయం: ఉ.06-06 | సూర్యాస్తమయం: సా.05-22

ఈరోజు తాజా వార్తలు

Show Full Article

Live Updates

  • Mallu Bhatti Vikramarka Comments: నిర్బంధ వ్యవసాయం చేయాలంటూ టీఆర్ఎస్ సర్కార్ కి నిరసనగా ట్రాక్టర్ ర్యాలీ..
    11 Nov 2020 2:35 PM GMT

    Mallu Bhatti Vikramarka Comments: నిర్బంధ వ్యవసాయం చేయాలంటూ టీఆర్ఎస్ సర్కార్ కి నిరసనగా ట్రాక్టర్ ర్యాలీ..

    పోలికేక సభలో భట్టి కామెంట్స్.

    -నిర్బంధ వ్యవసాయం చేయాలంటూ రైతులను భయభ్రాంతులను గురి చేస్తున్న టీఆర్ఎస్ సర్కార్ కి నిరసనగా ట్రాక్టర్ ర్యాలీ

    -పోలీకేకతో భారత పార్లమెంటు వరకు విన్పించడానికే ఈ పోలీకేక ర్యాలీ, సభ.

    -దుబ్బాకలో కేసీఆర్ పని అయిపోయింది. అయ్యా,కొడుకు,అల్లుడు మద్యలో దుబ్బాక లో ఓడిపోయారు

    -మట్టి మాది, చెమట మాది పంట మాది మద్యలో నీవు ఎవ్వడివిరా కేసీఆర్

    -పంట నష్టం పరిహారం ఇచ్చిన ఘనత కాంగ్రెస్ పార్టీ ది

    -దౌర్బగ్య విఫల ముఖ్యమంత్రి ని ఎప్పుడూ చూడలేదు. మద్దతు ధర అనేది నీ అబ్బా సొత్తు కాదు కేసీఆర్

    -భారతదేశం ప్రవేశపెట్టిన మద్దతు ధరను మద్దతు ధర మన హక్కు. బోడి రైతుబంధు పథకం తో మోసం చేస్తున్న కేసీఆర్ కు బుద్ది చెప్తాం

    -ఆదాని అంబానీ లు మోదిని ప్రధానమంత్రి చేశారు. వారు అడిగిందే తడువుగా కార్పోరేట్ వ్యవసాయానికి ఒకే చేశారు.

    -నరేంద్రమోడికి బుద్ది చెప్పేందుకే ఈ ట్రాక్టర్ ర్యాలీ

    -టీఆర్ఎస్ (గులాబీ) పురుగు పత్తి కాయాలను తినేసింది. రైతన్నకు నష్టం పరిహారం ఇవ్వకపోతే కేసీఆర్ కి బుద్ది చెప్పాడం ఖాయం

  • 11 Nov 2020 2:26 PM GMT

    Telangana Updates: ఆసిఫాబాద్ జిల్లాలో జరిగిన పులి దాడి సంఘటనపై మ్యాన్ ఈటర్ టైగర్...

    తెలంగాణ.. 

    ఈరోజు మహారాష్ట్ర తెలంగాణ సరిహద్దుల్లో, ఆసిఫాబాద్ జిల్లాలో జరిగిన పులి దాడి సంఘటనపై మ్యాన్ ఈటర్ టైగర్ గా ప్రచారం చేస్తున్నారు.

    ఇది అవాస్తవం మహారాష్ట్ర అడవుల్లో ఆ పులిని ఇప్పటికే అక్కడ అటవీశాఖ కొద్ది రోజుల క్రితం బంధించి గోరె వాడ జూకి తరలించారు.

    తెలంగాణ అటవీ శాఖ

  • Hyderabad Updates: ఇందిరా పార్క్ లో గంధం చెట్లు నరికివేత...
    11 Nov 2020 2:24 PM GMT

    Hyderabad Updates: ఇందిరా పార్క్ లో గంధం చెట్లు నరికివేత...

    హైదరాబాద్

    -గంధం చెట్లు నరికివేసిన ఇందిరాపార్కు సిబ్బంది.

    -13 గంధం చెట్ల ని కట్టర్ తో కట్ చేసిన సిబ్బంది..

    -ఆదివారం చెట్లను నరికివేసిన సిబ్బంది..

    -ఇందిరా పార్క్ నుంచి మరుసటి రోజు నరికివేసిన చెట్లు మాయం...

    -చెట్ల మాయం వెనుక సిబ్బంది చేతివాటం..

    -గంధం చెట్ల దొంగతనం పై గాంధీనగర్ పోలీసులకు ఫిర్యాదు చేసిన ఇందిరా పార్క్ మేనేజ్మెంట్..

    -గతంలోనూ పలు మార్లు గంధం చెట్లు మాయం...

  • GHMC Updates: జిహెచ్ఎంసి ప్ర‌ధాన కార్యాల‌యంలో అధికారుల స‌మ‌న్వ‌య స‌మావేశం..
    11 Nov 2020 12:09 PM GMT

    GHMC Updates: జిహెచ్ఎంసి ప్ర‌ధాన కార్యాల‌యంలో అధికారుల స‌మ‌న్వ‌య స‌మావేశం..

      జిహెచ్ఎంసి

    - జిహెచ్ఎంసి ప్ర‌ధాన కార్యాల‌యంలో జిహెచ్ఎంసి ఎన్నిక‌ల ఏర్పాట్ల‌పై పోలీసు అధికారులు, జిహెచ్ఎంసి అధికారుల స‌మ‌న్వ‌య స‌మావేశం

    - ఈ స‌మావేశానిక హాజరైన జిహెచ్ఎంసి క‌మిష‌న‌ర్ డి.ఎస్‌.లోకేష్ కుమార్‌,

    - హైద‌రాబాద్ పోలీసు క‌మిష‌న‌ర్ అంజ‌నీకుమార్‌, రాచ‌కొండ పోలీస్ క‌మిష‌న‌ర్ మ‌హేష్ భ‌గ‌వ‌త్‌,

    - సైబ‌రాబాద్ క‌మిష‌న‌ర్ వి.సి.స‌జ్జ‌నార్‌, ఇత‌ర సీనియ‌ర్ పోలీసు అధికారులు జిహెచ్ఎంసి జోన‌ల్‌, డిప్యూటి క‌మిష‌న‌ర్లు

  • Khammam District Updates: దుబ్బాక ప్రజలు టిఆర్ఎస్ పార్టీని ఓడ కొట్టాలన్న కసి ప్రజలలో ఉంది..
    11 Nov 2020 12:04 PM GMT

    Khammam District Updates: దుబ్బాక ప్రజలు టిఆర్ఎస్ పార్టీని ఓడ కొట్టాలన్న కసి ప్రజలలో ఉంది..

     ఖమ్మం జిల్లా

     బోనకల్

    - మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ ప్రెస్ మీట్ లో కామెంట్స్.....

    - సావు తప్పి కన్ను లొట్ట పోయినట్లు ఏదో ఒక సీటు గెలవగానే బిజెపి పార్టీ అది బలుపు అనుకోవడం వాళ్ల కర్మ...

    - కాంగ్రెస్ అభ్యర్థి పై దుష్ప్రచారం చేయడం వల్లనే కొంత వెనకబడి పోయాము .

    - బిజెపి అభ్యర్థి రఘునందన్ రావు గతంలో రెండుసార్లు ఓడిపోవడం వల్ల సానుభూతి ఓట్లు పడ్డాయి పొన్నం ప్రభాకర్. 

  • Telangana High Court Updates: సాదా బైనామాల క్రమబద్ధీకరణపై హైకోర్టులో విచారణ..
    11 Nov 2020 11:49 AM GMT

    Telangana High Court Updates: సాదా బైనామాల క్రమబద్ధీకరణపై హైకోర్టులో విచారణ..

      టీఎస్ హైకోర్టు....

    -కొత్త రెవెన్యూ చట్టం అమల్లోకి వచ్చాక అందిన దరఖాస్తులు పరిశీలించ వద్దని హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు

    -కొత్త రెవెన్యూ చట్టం అమల్లోకి రాక ముందు అందిన దరఖాస్తులు పరిశీలించవచ్చునన్న హైకోర్టు

    -కొత్త రెవెన్యూ చట్టం అక్టోబరు 29 నుంచి అమల్లోకి వచ్చిందన్న ఏజీ ప్రసాద్

    -అక్టోబరు 10 నుంచి 29 వరకు 2,26,693 దరఖాస్తులు అందాయి

    -అక్టోబరు 29 నుంచి నిన్నటి వరకు 6,74,201 దరఖాస్తులు వచ్చాయి

    -రద్దయిన చట్టం ప్రకారం ఎలా క్రమబద్ధీకరణ చేస్తారని ప్రశ్నించిన హైకోర్టు

    -పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలుకు 2 వారాల గడువు కోరిన అడ్వకేట్ జనరల్ ప్రసాద్

    -తదుపరి ఉత్తర్వులు ఇచ్చే వరకు 6,74,201 దరఖాస్తులు పరిశీలించవద్దని హైకోర్టు ఆదేశం

    -2,26,693 దరఖాస్తులపై నిర్ణయం కూడా తుది తీర్పునకు లోబడి ఉండాలన్న హైకోర్టు

    -నిర్మల్ జిల్లాకు చెందిన రైతు షిండే పిల్ పై హైకోర్టు విచారణ

  • 11 Nov 2020 11:41 AM GMT

    Medak District Updates: మాసాయిపేట జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం..

      మెదక్ జిల్లా :

    - మాసాయిపేట జాతీయ రహదారిపై ప్రమాదవశాత్తు ద్విచక్ర వాహనం పై నుండి కింద పడి గాయాలైన యువకులను,

    - చూసి హైదరాబాద్ వెళ్తున్న కాన్వాయ్ నుండి కారు దిగి హాస్పిటల్ తరలించిన మంత్రి హరీష్ రావు, ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి ..

  • M.P. Aravind: దేశ సేవలో ప్రాణాలు కోల్పోయిన ర్యాడ మహేశ్ కి శ్రద్ధాంజలి..
    11 Nov 2020 11:08 AM GMT

    M.P. Aravind: దేశ సేవలో ప్రాణాలు కోల్పోయిన ర్యాడ మహేశ్ కి శ్రద్ధాంజలి..

      నిజామాబాద్ :

    - ఎంపీ అర్వింద్ ప్రెస్ మీట్

    - మహేష్ త్యాగం వృదా కాదు..

    - దుబ్బాకలో బిజేపీ విజయం సాధించినా టీఆర్ ఎస్ కళ్ళు తెరవలేదు..

    - టి.ఆర్.ఎస్. కు ప్రత్యామ్నాయం బీజేపీని

    - దుబ్బాక ఎన్నికల్లో రైతులంతా బిజెపికి ఓటేశారు

    - రైతులు పంట తగలబెట్టుకుంటుంటే ప్రభుత్వం కళ్ళు మూసుకుని కూర్చింది..

    - దుబ్బాక ఫలితాలతోనైనా టి.ఆర్.ఎస్. కళ్ళు తెరవాలి..

    - ఇకనైనా కేసీఆర్ సచివాలయానికి రావాలి

  • Telangana Updates: ఇండియా కొరియా బిజినెస్ ఫోరం సదస్సులో పాల్గొన్న కేటీఆర్...
    11 Nov 2020 11:04 AM GMT

    Telangana Updates: ఇండియా కొరియా బిజినెస్ ఫోరం సదస్సులో పాల్గొన్న కేటీఆర్...

    తెలంగాణ 

    - తెలంగాణ లో పెట్టుబడులు పెట్టాలని కొరియా కంపెనీ లను కోరిన కేటీఆర్...

    - సదస్సులో టీఏస్ ఐపిస్ గురించి వివరించిన కేటీఆర్...

    - రాష్ట్రంలో అనుసరిస్తున్న విధానాల వల్ల గత 6సంవంత్సరాల లో 30బిలియన్ డాలర్ల కు పైగా పెట్టుబడులు రాష్రానికి వచ్చాయి..కేటీఆర్

    - రాష్ట్రంలో కొరియా పారీశ్రామిక పార్కు ఏర్పాటు చేస్తామన్న కేటీఆర్..

  • Bandi Sanjay: పేదల వ్యతిరేకి,పాస్ పోర్ట్స్ బ్రోకర్ రాష్ట్ర ముఖ్యమంత్రి..
    11 Nov 2020 10:59 AM GMT

    Bandi Sanjay: పేదల వ్యతిరేకి,పాస్ పోర్ట్స్ బ్రోకర్ రాష్ట్ర ముఖ్యమంత్రి..

    - బండి సంజయ్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు

    - పేదల జోలికి వస్తే ఎట్లా ఉంటుందో దుబ్బాక ప్రజలు చూపించారు

    - కేసీఆర్ కు బీసీల మీద ప్రేమంటే టి ఆర్ ఎస్ అధ్యక్షుడిగా బీసీని నియమించాలి

    - నిజామాబాద్ లో కేసీఆర్ బిడ్డను,దుబ్బాకలో అల్లుడిని ఓడగొట్టాం

    - జీహెచ్ఎంసీ ఎన్నికల్లో కేసీఆర్ బాక్స్ బద్దలు చేస్తాం

    - రాష్ట్రంలోని మంత్రులంతా చెంచాగాళ్లు.. ఎందుకు ఆ బతుకు బతుకుతున్నారు

    - బీసీలను అనగదొక్కతూ... ముస్లింలకు రిజర్వేషన్లు కల్పిస్తున్నాడు

    - కుల వృత్తుల మీద జీవించే బీసీల పొట్ట మీద కొడుతున్నాడు

    - హిందువులను చీల్చే ప్రయత్నం చేస్తే తగిన గుణపాఠం చెబుతాం

    - దుబ్బాక ప్రజల స్పూర్తితో జీహెచ్ఎంసీ ఎన్నికల్లో బీజేపీను గెలిపించాలి

    - ముఖ్యమంత్రి పదవి కాపాడుకోవడానికి... కొడుకును ముఖ్యమంత్రిని చేసేందుకే యాగాలు చేశాడు

    - నేనే నిజమైన హిందువని చెప్పుకోవడం సిగ్గు చేటు

    - హిందుగాళ్ళు, బొందుగాళ్ళు అంటే తీసుకెళ్లి టి ఆర్ ఎస్ ను బొంద పెట్టార

Print Article
Next Story
More Stories