Top
logo

Live Updates:ఈరోజు (ఆగస్ట్-11) తెలంగాణా బ్రేకింగ్ న్యూస్!

Live Updates:ఈరోజు (ఆగస్ట్-11) తెలంగాణా బ్రేకింగ్ న్యూస్!
X
Highlights

ఈరోజు బ్రేకింగ్ న్యూస్, 11 ఆగస్ట్, 2020: హెచ్ఎంటీవీ లైవ్ బ్లాగ్ ద్వారా తాజా వార్తలు ఎప్పటికప్పుడు మీకోసం అందిస్తుంది. ఇక్కడ తెలంగాణా రాష్ట్రానికి సంబంధించిన వార్తా విశేషాలను, తాజా సమాచారాన్నిఎప్పటికప్పుడు మీకోసం బ్రేకింగ్ గా ఇస్తున్నాం.

ఈరోజు పంచాంగం

ఈరోజు మంగళవారం, 11 ఆగస్ట్, 2020 : శ్రీ శార్వరి నామ సంవత్సరం.. దక్షిణాయనం.. శ్రావణ మాసం, కృష్ణపక్షం సప్తమి(ఉ. 6-10 వరకు) తదుపరి అష్టమి; భరణి నక్షత్రం (రా. 11-05 వరకు) తదుపరి కృత్తిక నక్షత్రం, అమృత ఘడియలు (సా.5-47 నుంచి 7-33 వరకు), వర్జ్యం (ఉ. 7-11 నుంచి 8-57 వరకు) దుర్ముహూర్తం (ఉ. 8-17 నుంచి 9-07 వరకు తిరిగి రా.10-51 నుంచి 11-42 వరకు) రాహుకాలం (మ.3-00 నుంచి 4-30 వరకు) సూర్యోదయం ఉ.5-45 సూర్యాస్తమయం సా.6-26

ఈరోజు 'కృష్ణాష్టమి' సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు

ఈరోజు తాజా వార్తలు

Live Updates

 • లారీ బీభత్సం
  11 Aug 2020 5:16 PM GMT

  లారీ బీభత్సం

  రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్ మెట్ వద్ద మంగళవారం లారీ బీభత్సం సృష్టించింది.

  బైక్‌ను ఢీకొట్టిన లారీ, ఆ తర్వాత ట్రాన్స్ ఫార్మర్‌ను ఢీ కొట్టింది.

  ఈ ఘటనలో బైక్ పై ఉన్న వ్యక్తికి తీవ్ర గాయాలు అయ్యాయి.

  ట్రాన్స్ ఫార్మర్ ను ఢీకొట్టడంతో లారీ డ్రైవర్ క్యాబిన్ లో చిక్కుకున్నాడు.

  డ్రైవర్ ను బయటకు తీసేందుకు స్థానికులు శ్రమిస్తున్నారు.

 • 11 Aug 2020 9:58 AM GMT

  జాతీయం:

  - ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం కొత్తగా నిర్మించతలపెట్టిన రాయలసీమ ఎత్తిపోతల పథకంపై ఎన్జీటీలో ముగిసిన వాదనలు

  - తెలంగాణకు చెందిన గవినోళ్ల శ్రీనివాస్‌ వేసిన పిటిషన్‌పై ఎన్జీటీ చెన్నై ధర్మాసనం ఇవాళ విచారణ .

  - రాయలసీమ ఎత్తిపోతల పథకంలో కొత్త భాగాలను చేర్చారని ఈ సందర్భంగా పిటిషనర్‌ తరఫు న్యాయవాది వాదనలు .

  - ‘‘40వేల క్యూసెక్కుల సామర్థ్యాన్ని 80వేల క్యూసెక్కులకు మార్చారు. రోజుకు 8 టీఎంసీల నీరు తరలించేలా పథకాన్ని మార్చారు. ఏపీ ఇచ్చిన సమాచారంతో కమిటీ లోపభూయిష్టంగా నివేదిక ఇచ్చింది’’ అని పిటిషనర్‌ ఆరోపణ

  - దీనిపై ఏపీ ప్రభుత్వం తరఫు న్యాయవాది వెంకటరమణి స్పందిస్తూ... రాయలసీమ ఎత్తిపోతల పథకం పాతదేనని వివరణ.

  - తమకు రావాల్సిన నీళ్లనే తీసుకుంటున్నామని తెలిపారు.

  - కమిటీ నివేదిక కూడా ఏపీకి అనుకూలంగా ఉన్నందున కేసును ముగించాలని కోరారు.

  - రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని కౌంటర్‌ అఫిడవిట్‌ ద్వారా వ్యతిరేకించిన తెలంగాణ ప్రభుత్వం

  - తమ రాష్ట్ర ప్రయోజనాలకు విఘాతం కలుగుతుందని వివరణ.

  - రాయలసీమ ఎత్తిపోతల పథకంపై వైఖరేంటో వారం రోజల్లో తెలపాలని కేంద్ర పర్యావరణ శాఖను ఎన్జీటీ ఆదేశం.

  - తీర్పును రిజర్వు చేస్తున్నట్టు ఎన్జీటీ చెన్నై ధర్మాసనం వెల్లడి.

 • 11 Aug 2020 9:57 AM GMT

  భద్రాద్రి కొత్తగూడెం జిల్లా :

  - ములకలపల్లి మండలం తాళ్లపాయి గ్రామంలో కుక్క వివాదంలో పద్ధం జోగులు అనే వ్యక్తి మృతి,

  - పెంపుడు కుక్క వెళ్లడంతో ఇరువూరి మధ్య ఘర్షణ..

  - వీరాస్వామి అనే వ్యక్తి తలపై కర్రాతో దాడి చేయడంతో జోగులు అనే వ్యక్తి మృతి*

 • 11 Aug 2020 9:57 AM GMT

  జోగులంబ గద్వాల జిల్లా:

  - గద్వాల జిల్లా ఐజ మండల కేంద్రానికి చెందిన AR కానిస్టేబుల్ శ్రీనివాసులు 35 కరోన పాజిటివ్ గాంధీ హాస్పిటల్లో మృతి.

 • 11 Aug 2020 9:56 AM GMT

  జేపీ నడ్డా గారికి నమస్కారం.. పిసిసి వర్కింగ్ ప్రెసిడెంట్ పొన్నం ప్రభాక

  - జేపీ నడ్డా గారికి నమస్కారం,

  - తెలంగాణ ప్రభుత్వం పైన చాలాసార్లు మాట్లాడి వెళ్లారు కానీ ప్రయోజనం లేదు మీ మాటలు కార్యరూపం దాల్చలేదు.

  - ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం పై మాట్లాడుతున్నారు తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ తరఫున నేను మిమ్మల్ని ఒక్కటే డిమాండ్ చేస్తున్నాను.

  - మీరు ఏదైతే మాటలు మాట్లాడి ఉన్నారు కేంద్రంలో మీ ప్రభుత్వమే ఉంది కాబట్టి ఆ మాటలకు కట్టుబడి బిజెపి జాతీయ అధ్యక్షుడిగా వాటిపై ఎంక్వయిరీ చేయించగలరు. లేకపోతే బిజెపి మీ టిఆర్ఎస్ పార్టీ ల స్నేహం ఒప్పుకోండి.

  -  అవసరం ఉన్నప్పుడల్ల టిఆర్ఎస్ ప్రభుత్వం సహాయం తీసుకుంటున్నారు మరియు తెలంగాణ ప్రభుత్వం పై మాటలు అయితే మాట్లాడుతున్నారు గాని అవి కార్యరూపం దాల్చడం లేదు.

  - కాళేశ్వరం ప్రాజెక్టు పైన ఎంక్వయిరీ కి కేంద్ర ప్రభుత్వానికి ఒక ఉత్తరం రాయండి . డబుల్ ఇల్లు ఆయుష్మాన్ భారత్ వంటి వంటి వాటిపై మాట్లాడుతున్నారు

  - కరోనా నియంత్రణలో తెలంగాణ ప్రభుత్వం పూర్తిగా విఫలమైతే కేంద్ర ప్రభుత్వం మౌనం వహించి ఉంది .

  - కేంద్ర ప్రభుత్వ ఆరోగ్య శాఖ మంత్రి తెలంగాణ లొ ఒక పర్యటన కూడా చేయలేదు.

  - మీ మాటలలొ నిజం ఉంటే వాటిపై కేంద్ర ప్రభుత్వం తరఫున తెలంగాణ ప్రభుత్వం పై ఎంక్వయిరీ కి ఆదేశించండీ.

 • రాష్ట్రంలో న్యాయస్థానాల లాక్ డౌన్ సెప్టెంబర్ 5 వరకు పొడిగింపు
  11 Aug 2020 8:28 AM GMT

  రాష్ట్రంలో న్యాయస్థానాల లాక్ డౌన్ సెప్టెంబర్ 5 వరకు పొడిగింపు

  టీఎస్ హైకోర్టు: రాష్ట్రంలో న్యాయస్థానాలు లాక్ డౌన్ సెప్టెంబర్ 5 వరకు పొడిగింపు..

  కోర్టులు, ట్రైబ్యునళ్ల లాక్ డౌన్ సెప్టెంబర్ 5 వరకు పొడిగించిన హైకోర్టు

  అత్యవసర కేసుల విచారణ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కొనసాగించాలని హైకోర్టు ఉత్తర్వులు

  ఆన్ లైన్ తో పాటు నేరుగా కోర్టుల్లో పిటిషన్ల దాఖలుకు అవకాశం..

  ఉత్తర్వులు జారీ చేసిన హైకోర్టు ...

 • అదుపు తప్పి బోల్తా కొట్టిన కారు
  11 Aug 2020 6:14 AM GMT

  అదుపు తప్పి బోల్తా కొట్టిన కారు

  జగిత్యాల : జగిత్యాల బైపాస్ రోడ్ లో ఓవర్ స్పీడ్ తో దూసుకెళ్లిన కారు.

  దేవి శ్రీ గార్డెన్ వద్ద ఓవర్ స్పీడ్ తో అదుపు తప్పి డివైడర్ ని కొట్టి బోల్తా.

  డివైడర్ పై మూడు ఫల్టీలు కొట్టి బోల్తా పడ్డ కారు

  సీసీ కెమెరాలో రికార్డ్ ఐన కారు ప్రమాద దృశ్యాలు.

  అర్ధరాత్రి 2గంటల ప్రాంతంలో కారు ప్రమాదం. 

  జగిత్యాల నుంచి రాజీవ్ బై పాస్ మీదుగా గొల్లపల్లి రోడ్ వైపు వెళ్తుండగా ప్రమాదం.

  ప్రమాద సమయంలో కారులో ముగ్గురు ప్రయాణికులు. స్వల్ప గాయాలు.

  అతి వేగమే ప్రమాదానికి కారణం.

 • మహాత్మా గాంధీ కల్వకుర్తి ఎత్తిపోతల పథకం నుండి నిలిచిన నీటి ఎత్తిపోత
  11 Aug 2020 6:07 AM GMT

  మహాత్మా గాంధీ కల్వకుర్తి ఎత్తిపోతల పథకం నుండి నిలిచిన నీటి ఎత్తిపోత

  నాగర్ కర్నూలు జిల్లా : కొల్లాపూర్ మండలం ఎల్లూరు దగ్గర మహాత్మా గాంధీ కల్వకుర్తి ఎత్తిపోతల పథకం నుండి నిలిచిన నీటి ఎత్తిపోత

  నలుగురు టెక్నీషియన్స్ తో పాటు ఒక సూపర్ వైజర్ కు కరోనా పాజిటివ్ రావడంతో ఐసోలేషన్ లో సిబ్బంది ఉండటమే కారణం.

  మరింతగా కరోనా వ్యాప్తి చెందుతుందనే ఉద్దేశంతో ముందు జాగ్రత్తలు తీసుకున్న అధికారులు.

 • జ‌ల‌క‌ళ‌
  11 Aug 2020 6:05 AM GMT

  జ‌ల‌క‌ళ‌

  వనపర్తి : కొత్తకోట ఊకచెట్టు వాగు నీటి ఉధృతి పెరగటం తో కొత్తకోట మం' కనిమెట్ట నుండి పాత జంగమాయ పల్లి వెళ్లే మట్టిరోడ్డు కొట్టుకుపోవటంతో నిలిచిపోయిన రాకపోకలు

 • జ‌డ్చెర్ల‌లో రోడ్డు ప్ర‌మాదం
  11 Aug 2020 6:03 AM GMT

  జ‌డ్చెర్ల‌లో రోడ్డు ప్ర‌మాదం

  మహబూబ్ నగర్ జిల్లా : జడ్చర్ల పట్టణం బురెడ్డిపల్లి సమీపంలో జాతీయ రహదారిపై కారు బైకు ఢీ కొనడంతో ఇద్దరు వ్యక్తులు మృతి. మరొకరికి తీవ్ర గాయాలు ఆస్పత్రికి తరలింపు....

Next Story