Live Updates: ఈరోజు (సెప్టెంబర్-10) ఆంధ్రప్రదేశ్ బ్రేకింగ్ న్యూస్!
ఈరోజు బ్రేకింగ్ న్యూస్, 10 సెప్టెంబర్, 2020: హెచ్ఎంటీవీ లైవ్ బ్లాగ్ ద్వారా తాజా వార్తలు ఎప్పటికప్పుడు మీకోసం అందిస్తుంది. ఇక్కడ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన వార్తా విశేషాలను, తాజా సమాచారాన్నిఎప్పటికప్పుడు మీకోసం బ్రేకింగ్ గా ఇస్తున్నాం.
ఈరోజు పంచాంగం
ఈరోజు గురువారం | 10 సెప్టెంబర్, 2020 |శ్రీ శార్వరి నామ సంవత్సరం.. దక్షిణాయనం | భాద్రపద మాసం | కృష్ణపక్షం | అష్టమి (రా.10-36 వరకు) తదుపరి నవమి | రోహిణి నక్షత్రం (ఉ. 10-28 వరకు) తదుపరి మృగశిర | అమృత ఘడియలు: ఉ.7-01 నుంచి 8-44 వరకు తిరిగి తె. 2-35 నుంచి 4-16 వరకు | వర్జ్యం: సా. 4-24 నుంచి 6-05 వరకు | దుర్ముహూర్తం: ఉ. 9-55 నుంచి 10-44 వరకు తిరిగి మ. 2-49 నుంచి 3-38 వరకు | రాహుకాలం: మ. 1-30 నుంచి 3-00 వరకు | సూర్యోదయం: ఉ.5-50 | సూర్యాస్తమయం: సా.6-05
ఈరోజు తాజా వార్తలు
Live Updates
- 10 Sept 2020 11:27 AM IST
Visakha updates: ఏపి సాధుపరిషత్ అధ్యక్షులు శ్రీనివాసానంద సరస్వతి స్వామి కామెంట్స్..
విశాఖ..
-ఏపిలో రాక్షస పాలన చూస్తున్నారు.
-దేవాలయ సంప్రదాయాలు మంటకలుపుతున్నారు.
-అంతర్వేదిలో దగ్దం అయ్యింది కేవలం స్వామి వారి రథంకాదు,
-5 కోట్ల ప్రజలమానోరథాలను దగ్దం చేశారు.
-హిందువులు ఆవేదన వ్యక్తం చేస్తున్నా ప్రభుత్వానికి పట్టడం లేదు.
-దేవాదాయశాఖ మంత్రి వెల్లంపల్లి వెంటనే పదవి నుంచి తప్పుకోవాలి.
-సింహాచలం దేవస్థానం గెస్ట్ హౌస్ లో అజ్ఞాత వ్యక్తి బస చేయడానికి కారణం ఏంటి?
-క్రైస్తవ సంస్ధలు కొన్ని కుట్రతో హిందూధర్మాన్ని తొక్కేందుకు ప్రయత్నిస్తున్నాయి.
-అంతర్వేది రథం దగ్దం ఉదంతం పై కేంద్రం దృష్టికి తీసుకు వెళతాం
- 10 Sept 2020 9:13 AM IST
Andhra Pradesh updates: నేటి నుంచి ఏపీలో ప్రవేశ పరీక్షలు ప్రారంభం..
-నేటి నుంచి రెండు రోజుల పాటు ఏపీ ఐసెట్ 2020
-ఏపీలో ఐసెట్ పరీక్ష రాయనున్న 64884 మంది విద్యార్థులు
-ఏపీలో 75 పరీక్షా కేంద్రాలు, హైదరాబాద్ లోనూ పరీక్షా కేంద్రాలు ఏర్పాటు
-ఉదయం 9 గంటల నుంచి 11:30 వరకు మొదటి సెషన్
-మధ్యాహ్నం 3 గంటల నుంచి 5:30 వరకు రెండో సెషన్
-అరగంట ముందే పరీక్ష కేంద్రాలకు చేరుకోవాలని సూచన
-కరోనా నేపథ్యంలో పరీక్షా కేంద్రాల్లో ప్రత్యేక ఏర్పాట్లు
-కరోనా లక్షణాలు ఉన్నవారికి ప్రత్యేక ఐసోలేషన్ లో పరీక్ష రాసే అవకాశం
-ప్రతి ఒక్క విద్యార్థి కోవిడ్-19 సెల్ఫ్ డిక్లరేషన్ ఇవ్వాలి.
- 10 Sept 2020 9:10 AM IST
East Godavari updates: పిఠాపురం-గొల్లప్రోలు లో విషాదఛాయలు.. స్వస్థలానికి చేరుకున్న బుల్లితెర నటి శ్రావణి మృతదేహం..
తూర్పుగోదావరి :
-శ్రావణి మృతదేహంతో స్వగ్రామానికి చేరుకున్న శ్రావణి తల్లిదండ్రులు, తమ్ముడు
-మృతదేహం వెంట వచ్చిన సాయి అనే యువకుడు..
-శోక సంద్రంలో మునిగిపోయిన కుటుంబసభ్యులు, బంధువులు..
-గొల్లప్రోలులో అంత్యక్రియలకు ఏర్పాట్లు చేస్తోన్న కుటుంబసభ్యులు..
-సాయి మా కుటుంబ సభ్యుడు మాకు ఆప్తుడు.. అతనే మాకు అండగా నిలిచాడు.. శ్రావణి కుటుంబసభ్యులు..
- 10 Sept 2020 7:38 AM IST
Andhra university: ఈ నెల 13 న జరగాల్సిన బీఏ, బీ.కామ్, కామన్ ఎంట్రన్స్ పరీక్షలు వాయిదా
విశాఖ..
- ఆంధ్రా యునివర్సిటీ దూరవిద్య కేంద్రం ఆధ్వర్యంలో ఈ నెల 13 న జరగాల్సిన బీఏ, బీ.కామ్, కామన్ ఎంట్రన్స్ పరీక్షలు వాయిదా...
- కోవిడ్ కారణంగా పరీక్షలు వాయిదా వేస్తున్నట్లు ప్రకటించిన ఏయూ
- 10 Sept 2020 6:16 AM IST
Visakhapatnam Updates: 16 వ జాతీయ రహదారిపై వరాహ నదిలో పడి పోయిన ప్రయివేట్ బస్సు
విశాఖ :
- ఎస్ రాయవరం మండలం పెనుగొల్లు వద్ద 16 వ జాతీయ రహదారిపై వరాహ నదిలో పడి పోయిన ప్రయివేట్ బస్సు .
- తమిళనాడుకి చెందిన ఈ బస్సు చెన్నై నుండి విశాఖ వెళ్తుండగా ప్రమాదవ శాత్తు 30 అడుగుల ఎత్తు నుండి నదిలో పడి పోయింది.
- బస్సులో కేవలం 3 గురు మాత్రమే ఉన్నారు. వీరిలో ఒకరికి తీవ్ర గాయాలు ,
- మరో ఇద్దరికి స్వల్ప గాయాలు. గాయపడ్డ వారిని నక్కపల్లి ఆసుపత్రికి తరలింపు. సహాయక చర్యలు చేపట్టిన పోలీసులు.
- 10 Sept 2020 6:11 AM IST
Nellore Updates: నేడు వెంకటగిరి గ్రామశక్తి పోలేరమ్మ జాతర
నెల్లూరు:
- ఆలయ చరిత్రలో తొలిసారిగా భక్తులు లేకుండా అమ్మవారి జాతర.
- కరోనా నేపథ్యంలో భక్తులపై కఠిన ఆంక్షలు.
- దర్శనాలు రద్దు. ఇతరులెవరూ వెంకటగిరి కి రావద్దు అంటూ పోలీసుల నిషేధాజ్ఞలు.





