Live Updates: ఈరోజు (09 అక్టోబర్, 2020 ) ఆంధ్రప్రదేశ్ బ్రేకింగ్ న్యూస్!

Live Updates: ఈరోజు (09 అక్టోబర్, 2020 ) ఆంధ్రప్రదేశ్ బ్రేకింగ్ న్యూస్!
x
Highlights

ఈరోజు బ్రేకింగ్ న్యూస్, 09 అక్టోబర్, 2020 : హెచ్ఎంటీవీ లైవ్ బ్లాగ్ ద్వారా తాజా వార్తలు ఎప్పటికప్పుడు మీకోసం అందిస్తుంది. ఇక్కడ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన వార్తా విశేషాలను, తాజా సమాచారాన్నిఎప్పటికప్పుడు మీకోసం బ్రేకింగ్ గా ఇస్తున్నాం.

ఈరోజు పంచాంగం

ఈరోజు శుక్రవారం | 09 అక్టోబర్, 2020 | శ్రీ శార్వరి నామ సంవత్సరం.. దక్షిణాయనం | అధిక ఆశ్వయుజ మాసం | కృష్ణపక్షం | సప్తమి ఉ.12-22 వరకు తదుపరి షష్టి | ఆర్ద్ర నక్షత్రం రా.08-24 వరకు తదుపరి పునర్వసు | వర్జ్యం: లేదు | అమృత ఘడియలు ఉ.09-56 నుంచి 10-53 వరకు | దుర్ముహూర్తం: ఉ.08-15 నుంచి 09-02 వరకు తిరిగి మ.12-09 నుంచి 12-56 వరకు | రాహుకాలం: ఉ.10-30 నుంచి 12-00 వరకు | సూర్యోదయం: ఉ.5-54 | సూర్యాస్తమయం: సా.5-40

ఈరోజు తాజా వార్తలు

Show Full Article

Live Updates

  • 9 Oct 2020 1:09 PM GMT

    హైదరాబాద్ లో భారీ వర్షం

    నగర వ్యాప్తంగా కుండపోత గా కురుస్తున్న వర్షంఉరుకులు, మెరుపులతో కూడిన వర్షం తో పలు చోట్ల విద్యుత్ అంతరాయం

  • Vijayawada updates: అమరావతి రాజధానిగా ఉంచాలని పోరాటం చేస్తున్నా.. ప్రభుత్వం స్పందించడం లేదు..
    9 Oct 2020 6:23 AM GMT

    Vijayawada updates: అమరావతి రాజధానిగా ఉంచాలని పోరాటం చేస్తున్నా.. ప్రభుత్వం స్పందించడం లేదు..

    విజయవాడ...

    -శివారెడ్డి అమరావతి jac సభ్యులు..

    -300రోజులకు ఉద్యమం చేరుతున్నా ప్రభుత్వం లో చలనం లేదు

    -ఆది, సోమవారాల్లో రాష్ట్ర వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు చేపడుతున్నాం

    -ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొని అమరావతి కి మద్దతు ఇవ్వాలని కోరుతున్నాం

    -ప్రభుత్వ పెద్దలు, మంత్రులు కొంతమంది కు సంస్కారంతో మాట్లాడుతున్నారు

    -ఆడవాళ్లు అని చూడకుండా దూషిస్తున్నారు

    -మీకు చేతనైతే.. జగన్ దగ్గరకు వెళ్లి మూడు రాజధానులు సరి కాదని చెప్పాలి

    -వాళ్లు ఒక మహిళకే పుట్టారనే ఇంగితం మరచి వ్యాఖ్యలు చేస్తున్నారు

    -ఇప్పటికైనా తీరు మార్చుకుని మహిళలను గౌరవించడం నేర్చుకోవాలి

  • Vijayawada updates: లింగాయపాలెం రైతుల్ని అడ్డుకున్న పోలీసులు...
    9 Oct 2020 6:19 AM GMT

    Vijayawada updates: లింగాయపాలెం రైతుల్ని అడ్డుకున్న పోలీసులు...

    విజయవాడ...

    -కనకదుర్గమ్మ ఆలయానికి పొంగళ్లు తో మొక్కు చెల్లించేందుకు బయలు దేరిన లింగాయపాలెం రైతుల్ని అడ్డుకున్న పోలీసులు.

    -ప్రకాశం బ్యారేజ్ వద్ద అడ్డుకున్న పోలీసులు.

    -రైతుల కండువా, రైతు జెండా తిస్తేనే దుర్గ గుడి కి అనుమతి ఇస్తాం అని అంటున్న పోలీసులు

    -ఉదయాన్నే కాలినడకన లింగాయపాలెం నుండి సీడ్ ఆక్సిస్ రోడ్ పైనుండి దుర్గ గుడికి బయలుదేరిన రైతులు.

  • Tirumala updates: శ్రీవారిని దర్శించుకున్న తెలంగాణా ఎమ్మెల్యే భానుశంకర్ నాయక్...
    9 Oct 2020 6:15 AM GMT

    Tirumala updates: శ్రీవారిని దర్శించుకున్న తెలంగాణా ఎమ్మెల్యే భానుశంకర్ నాయక్...

    తిరుమల..

    -భానుశంకర్ నాయక్, తెలంగాణా ఎమ్మెల్యే...

    -స్వామి వారిని దర్శించుకోవడం నా అదృష్టంగా భావిస్తున్నా.

    -కరోనా మహమ్మారి నుండి ప్రజలకు విముక్తి ప్రసాధించాలని స్వామి వారి ప్రార్ధించాను.

    -క్లిష్ట పరిస్థితిలో తెలంగాణా రాష్ట్రం కేసిఆర్ నాయకత్వంలో దినదినాభివృద్ధి చేందాలి.

    -తెలంగాణా రాష్ట్రంలో ఏ ప్రభుత్వం తీసుకురాని సంక్షేమ పథకాలు అమలు చేస్తుంది.

  • Rajahmundry updates: జక్కంపూడి రామ్మోహన్ రావు వర్థంతి వేడుకలు..
    9 Oct 2020 6:05 AM GMT

    Rajahmundry updates: జక్కంపూడి రామ్మోహన్ రావు వర్థంతి వేడుకలు..

    తూర్పుగోదావరి..

    రాజమండ్రి...

    -కంబాలచెరువు జంక్షన్ లో ఘనంగా మాజీమంత్రి జక్కంపూడి రామ్మోహన్ రావు వర్థంతి వేడుకలు

    -జక్కంపూడి విగ్రహానికి పూలమాలలు నివాళులర్పించిన రాజానగరం ఎమ్మెల్యే జక్కంపూడి రాజా, రాజమండ్రి- వైసీపీ ఇన్ఛార్జి శ్రీఘాకోళపు   శివరామసుబ్రహ్మణ్యం,

    -ఈ సఁదర్భంగా సుబ్రహ్మణ్య మైదానం లో జక్కంపూడి ఫౌండేషన్ ఆధ్వర్యంలో

    -అక్షయ సంజీవని, నిర్వణ పేటిక, కైవల్య రధం సేవాకార్యక్రమాలను ప్రారంభించిన ఎమ్మెల్యే జక్కంపూడి రాజా, శివరామసుబ్రహ్మణ్యం

  • Kurnool district updates: నంద్యాలలో దారుణం..
    9 Oct 2020 5:13 AM GMT

    Kurnool district updates: నంద్యాలలో దారుణం..

    కర్నూలు..

    -నంద్యాల పొన్నా పురం పాల కేంద్రం సమీపంలో దారుణ హత్య

    -వైసిపి నేత, న్యాయవాది పొన్నా పురం సుబ్బరాయుడు ని గుర్తుతెలియని వ్యక్తులు దారుణ హత్య

    -ఉదయం జాగింగ్ వచ్చిన సమయంలో కర్రలతో కొట్టి చంపినట్లుగా గుర్తించిన స్థానికులు

    -కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్న పోలీసులు

  • Tirumala updates: ఈరోజు ఉదయం 11 గంటలకు ప్రత్యేక ప్రవేశదర్శనం టికెట్లు విడుదల...
    9 Oct 2020 5:08 AM GMT

    Tirumala updates: ఈరోజు ఉదయం 11 గంటలకు ప్రత్యేక ప్రవేశదర్శనం టికెట్లు విడుదల...

    తిరుమల...

    -ఈ నెల 15 నుంచి 24 వరకు టికెట్లు విడుదల.

    -శ్రీవారి నెల 16 నుంచి 26 వరకు శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాలు.

    -టికెట్లు ఉన్న భక్తులను మాత్రమే తిరుమలకు అనుమతించనున్న టీటీడీ.

    -టికెట్లు ఉన్న యాత్రికులకు మాత్రమే మూలమూర్తి, వాహనసేవల దర్శనం.

  • Tirumala updates: నిన్న శ్రీవారిని దర్శించుకున్న భక్తులు..
    9 Oct 2020 2:31 AM GMT

    Tirumala updates: నిన్న శ్రీవారిని దర్శించుకున్న భక్తులు..

    తిరుమల సమాచారం..

    -నిన్న శ్రీవారిని దర్శించుకున్న 18,088 మంది భక్తులు

    -తలనీలాలు సమర్పించిన 6,318 మంది భక్తులు

    -నిన్న శ్రీవారి హుండీ ఆదాయం రూ.1.80 కోట్లు

  • East Godavari Weather updates: తుపాను హెచ్చరికల నేపధ్యంలో తూర్పుగోదావరిలో ముందు జాగ్రత్తలు!
    9 Oct 2020 2:08 AM GMT

    East Godavari Weather updates: తుపాను హెచ్చరికల నేపధ్యంలో తూర్పుగోదావరిలో ముందు జాగ్రత్తలు!

    తూర్పుగోదావరి :

    -తూర్పు మధ్య బంగాళాఖాతంలో ఏర్పడ్డ తుఫాను ప్రభావంపై జిల్లా అధికార యంత్రాంగాన్ని అప్రమత్తం చేసిన వాతావరణశాఖ..

    -తీరం వెంబడి 40 నుంచి 45 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని హెచ్చరించిన వాతావరణశాఖ..

    -మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని హెచ్చరికలు జారీ.. వేటకు వెళ్లిన మత్స్యకారులను వెనక్కి రప్పించాలని ఆదేశం..

    -వాతావరణశాఖ హెచ్చరికల నేపధ్యంలో 13 తీర ప్రాంత మండలాల అధికారులను అప్రమత్తం చేసిన జిల్లా మురళీధర్ రెడ్డి..

    -తీర ప్రాంత మండలాలకు అనుబంధంగా ఉన్న మరో 13 మండల ప్రజలను అప్రమత్తంగా ఉండాలని ఆదేశం..

    -తుఫాన్ షెల్టర్లు సిద్ధం చేసి.. తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో దండోరా వేయించి ప్రజలను అప్రమత్తం చేయాలని ఆదేశం..

    -మండల కేంద్రాల్లో కంట్రోల్ రూమ్ లు ఏర్పాటు చేసి అధికారులు, సిబ్బంది 24 గంటలు అందుబాటులో ఉండాలని సూచించిన జిల్లా కలెక్టర్ మురళీధర్ రెడ్డి..

Print Article
Next Story
More Stories