Live Updates:ఈరోజు (ఆగస్ట్-09) తెలంగాణా బ్రేకింగ్ న్యూస్!

ఈరోజు పంచాంగం

ఈరోజు ఆదివారం, 09 ఆగస్ట్, 2020 : శ్రీ శార్వరి నామ సంవత్సరం.. దక్షిణాయనం.. శ్రావణ మాసం, కృష్ణపక్షం షష్టి(మ. 4-36 వరకు) తదుపరి సప్తమి; రేవతి నక్షత్రం (ఉ. 8-23 వరకు), అమృత ఘడియలు (ఉ.10-10 నుంచి 11-55 వరకు), వర్జ్యం (తె. 4-48 వరకు) దుర్ముహూర్తం ( ఉ. 5-44 నుంచి 7-25 వరకు) రాహుకాలం (ఉ. 9-00 నుంచి 10-30 వరకు) సూర్యోదయం ఉ.5-43 సూర్యాస్తమయం సా.6-29

ఈరోజు తాజా వార్తలు


Show Full Article

Live Updates

  • దారుణ హత్య
    9 Aug 2020 6:34 AM GMT

    దారుణ హత్య

    కుమురం భీం జిల్లా: పెంచికలపేట మండలం ఎల్లూరులో వ్యక్తి దారుణ హత్య...

    సెగ్గెం రాజన్న (45) అనే వ్యక్తి హత్య చేసిన గుర్తు తెలియని వ్యక్తులు...

    విచారణ చేపట్టిన పోలీసులు...

  • కాపాడాల్సినోళ్లే.. కబ్జా చేస్తుర్రు! 5 కోట్ల ప్రభుత్వ భూమికి ఎసరు..
    9 Aug 2020 6:31 AM GMT

    కాపాడాల్సినోళ్లే.. కబ్జా చేస్తుర్రు! 5 కోట్ల ప్రభుత్వ భూమికి ఎసరు..

    జయశంకర్ భూపాలపల్లి: 5 కోట్ల ప్రభుత్వ భూమి భార్య పేరిట పట్టా చేసిన రెవెన్యూ ఉద్యోగి..

    కాపాడాల్సినోళ్లే.. కబ్జా చేస్తుర్రు!.. 5 కోట్ల ప్రభుత్వ భూమికి ఎసరు..

    రెవెన్యూ ఉద్యోగి భార్య పేరిట లావణి పట్టా..

    తోటి ఉద్యోగుల కంప్లైంట్తో విచారణకు ఆదేశించిన భూపాలపల్లి కలెక్టర్ ..

    కాళేశ్వరంలో ఎక్కువగా ప్రభుత్వ భూములే... గ్రామంలోని 129 సర్వే నంబర్‌లో 380.28 ఎకరాల ప్రభుత్వ భూమి ఉంది.

    ఇందులో 60 ఎకరాలకు వరకు అటవీ శాఖ భూమి కూడా కలిసి ఉంది. ఈ భూమిలో కొంత భాగాన్ని ప్రభుత్వం గతంలో అసైన్‌ మెంట్‌‌చేసి పేదలకు పంచిపెట్టింది.

    మిగిలిన భూమిపై స్థానిక రెవెన్యూ అధికారి కన్ను పడింది.

  • 9 Aug 2020 2:47 AM GMT

    కామారెడ్డి : కలెక్టరేట్ లో 10 మొక్కలు నాటి.. గ్రీన్ ఛాలెంజ్ కు శ్రీకారం చుట్టిన జిల్లా కలెక్టర్ శరత్.

    తెలంగాణ లో 10 మంది కలెక్టర్లకు గ్రీన్ ఛాలెంజ్ విసిరిన కలెక్టర్ శరత్.

    104 క్లస్టర్ల పరిధిలో రైతు వేదికల ఆవరణలో మూడు చొప్పున మొక్కలు నాటాలని పిలుపు.

  • 9 Aug 2020 2:46 AM GMT

    ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో నేడు అదివాసీల దినోత్సవం..

    అదివాసీ దినోత్సవం కోసం బారీ ఏర్పాట్లు..

    ప్రతి గూడేంలో అదివాసీ దినోత్సవం నిర్వహించేలా ఏర్పాట్లు చేసిన. గిరిజనులు..

    సాంస్కృతిక సంప్రదాయాలతో అదివాసీ దినోత్సవాన్ని జరుపుకోనున్నా చేసుకోనున్నా అదివాసీలు

Print Article
Next Story
More Stories