Top
logo

Live Updates:ఈరోజు (ఆగస్ట్-08) తెలంగాణా బ్రేకింగ్ న్యూస్!

Live Updates:ఈరోజు (ఆగస్ట్-08) తెలంగాణా బ్రేకింగ్ న్యూస్!
X
Highlights

ఈరోజు బ్రేకింగ్ న్యూస్, 08 ఆగస్ట్, 2020: హెచ్ఎంటీవీ లైవ్ బ్లాగ్ ద్వారా తాజా వార్తలు ఎప్పటికప్పుడు మీకోసం అందిస్తుంది. ఇక్కడ తెలంగాణా రాష్ట్రానికి సంబంధించిన వార్తా విశేషాలను, తాజా సమాచారాన్నిఎప్పటికప్పుడు మీకోసం బ్రేకింగ్ గా ఇస్తున్నాం.

ఈరోజు పంచాంగం

ఈరోజు శనివారం, 08 ఆగస్ట్, 2020 : శ్రీ శార్వరి నామ సంవత్సరం.. దక్షిణాయనం.. శ్రావణ మాసం, కృష్ణపక్షం పంచమి (మ. 3-36 వరకు) తదుపరి షష్ఠి; ఉత్తరాభాద్ర నక్షత్రం (ఉ. 9-24 వరకు) తదుపరి రేవతి నక్షత్రం, అమృత ఘడియలు (ఉ.10-10 నుంచి 11-55 వరకు), వర్జ్యం (తె. 4-48 వరకు) దుర్ముహూర్తం ( ఉ. 5-44 నుంచి 7-25 వరకు) రాహుకాలం (ఉ. 9-00 నుంచి 10-30 వరకు) సూర్యోదయం ఉ.5-43 సూర్యాస్తమయం సా.6-29

ఈరోజు తాజా వార్తలు

Live Updates

  • రేపే తెలంగాణ కాంగ్రెస్ శాసన సభాపక్షం స‌మావేశం
    8 Aug 2020 4:11 PM GMT

    రేపే తెలంగాణ కాంగ్రెస్ శాసన సభాపక్షం స‌మావేశం

    భట్టివిక్రమార్క,సీఎల్పీ నేత

    రేపు మధ్యాహ్నం 02.00 గంటలకు, ZOOM App. ద్వారా, వీడియో కాన్ఫరెన్స్ ద్వారా తెలంగాణ కాంగ్రెస్ శాసన సభాపక్షం మీటింగ్.

    కాన్ఫెరెన్సులో ముఖ్యంగా రాష్ట్రంలో నెలకొన్న కరోనా మహమ్మారి ఉద్ధృతి,  కృష్ణా నది జలాలు మరియు ప్రజలు ఎదుర్కొంటున్న వివిధ సమస్యలు, ప్రభుత్వం తీసుకోవలసిన చర్యలలో పూర్తిగా వైఫల్యం గురించి చర్చ.

    సిఎల్ పి వీడియో కాన్ఫెరెన్సులో కాంగ్రెస్ శాసన సభ, మండలి మరియు పార్లిమెంట్ సభ్యులు పాల్గొంటారు.

  • బైక్ కొనివ్వలేదని యువకుడి  ఆత్మహత్య
    8 Aug 2020 4:08 PM GMT

    బైక్ కొనివ్వలేదని యువకుడి ఆత్మహత్య

    సిద్దిపేట జిల్లా కోహెడ మండలం రాంచంద్రపూర్ లో బైక్ కొనివ్వలేదని యువకుడు (ఉమ్మరవేని అజయ్) 18 ఆత్మహత్య


    డి 

  • తాండూర్ ఎమ్మెల్యేకు కరోనా పాజిటివ్..
    8 Aug 2020 4:05 PM GMT

    తాండూర్ ఎమ్మెల్యేకు కరోనా పాజిటివ్..

    - తాండూర్ ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి కి కరోనా పాజిటివ్..

    - జూబ్లీహిల్స్ అపోలో హాస్పిటల్ లో ట్రీట్మెంట్ తీసుకుంటున్న ఎమ్మెల్యే.. 

    - రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటికే కరోనా బారినపడిన పలువురు కాంగ్రెస్‌, టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు, మంత్రులు కోలుకున్నారు. 

  • కొమురం భీం జిల్లాలో  క‌రోనా క‌ల్లోలం
    8 Aug 2020 2:11 PM GMT

    కొమురం భీం జిల్లాలో క‌రోనా క‌ల్లోలం

    కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లాలో ఈ రోజు 6 పాజిటివ్ కేసులు నమోదయ్యాయని జిల్లా పాలనాధికారి సందీప్ కుమార్ ఝా తెలిపారు.

    కాగజ్నగర్ 1, ఆసిఫాబాద్ 4, గొలెటీలో 1 కేసులు నమోదు

  • అన్‌లైన్‌లో ఘ‌రానా మోసం
    8 Aug 2020 2:09 PM GMT

    అన్‌లైన్‌లో ఘ‌రానా మోసం

    హైదరాబాద్: మాయ మాటలు చెప్పి పోలీసుల నుంచి తప్పించుకొని తిరుగుతూ... పలువురిని వద్ద ఆన్ లైన్ లో డబ్బులు దండుకున్నా ఓ ఘరానా మోసగాడిని. అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించిన హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు.

    - ఈస్ట్ గోదావరి కి చెందిన దూల నాగేశ్వరరావు శంషాబాద్ విమానాశ్రయంలో బస్సులు, కార్గో, గూడ్స్ లారీలను లీజుకు ఇప్పిస్తానని లారీ వెనుక భాగంలో ఉన్న ఫోన్ నెంబర్లకు ఫోన్ చేసి నమ్మబలికి పలువురిని మోసం

    - ఇదే తరహాలో అఫ్జల్ గంజ్ కు చెందిన గోవింద రాజ్ కు ఫోన్ చేసి అగ్రిమెంట్, సెక్యురిటి పేరుతో ఆన్ లైన్ లో 92వేలు వేయించుకున్న నాగేశ్వరరావు.

    - లీజు కోసం వాహనాలు తీసుకొని ఎయిర్ పోర్టు రమ్మని గోవింద రాజ్ కు ఫోన్ చేసిన నాగేశ్వరరావు. తీరా అక్కడి రాగానే ఫోన్ స్విచ్చాఫ్.

    - మోస పోయినని తెలుసుకున్న బాధితుడు గోవిందా రాజ్ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు.

    - ఈ మోసగాడి పై హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసు స్టేషన్ తో పాటు సైబరాబాద్, రాచకొండలలో కేసులు.

  • అక్రమ మద్యం పట్టివేత
    8 Aug 2020 2:04 PM GMT

    అక్రమ మద్యం పట్టివేత

    - నల్గొండ జిల్లా: దామరచర్ల మండలం, వాడపల్లి సరిహద్దు చెక్ పోస్ట్ వద్ద అక్రమ మద్యం పట్టివేత.

    -సూర్యాపేట జిల్లా, గరిడేపల్లి మండలం నుండి ఆంధ్రకు అక్రమంగా తరలింపు.

    -సుమారు 4 లక్షల రూపాయల విలువచేసే 54 కాటన్ల మద్యం స్వాధీనం , లారీ స్వాధీనం..

    -ముగ్గురిని అదుపులోకి తీసుకున్న పోలీసులు

  • ఆదిలాబాద్ జిల్లాలో కరోనా  విభృంభ‌న‌
    8 Aug 2020 1:58 PM GMT

    ఆదిలాబాద్ జిల్లాలో కరోనా విభృంభ‌న‌

    ఆదిలాబాద్ జిల్లాలో విజ్రుంబిస్తున్నా కరోనా..

    ఒక్కరోజు లో ఇరవై ఏడు కేసులు నమోదు..

    బాదితులను చికిత్స కోసం అసుపత్రికి తరలింపు

    ఆదిలాబాద్ రిమ్స్ అసుపత్రిలో కరోనాతో కానిస్టేబుల్ మ్రుతి..

    నిర్మల్ జిల్లా ఖానాపూర్ కు చెందిన కానిస్టేబుల్..

    మూడు రోజుల క్రితం కరోనా వ్యాదితో అసుపత్రిలో చేరిన కానిస్టేబుల్

  • ప్రమాదవశాత్తు కుంటలో పడి బాలుడు మృతి
    8 Aug 2020 1:55 PM GMT

    ప్రమాదవశాత్తు కుంటలో పడి బాలుడు మృతి

    కామారెడ్డి: బీబీపేట్ మండల కేంద్రంలో ఆడుకుంటూ ప్రమాదవశాత్తు కుంటలో పడి రంజిత్ (10) అనే బాలుడు మృతి.

  • సోలిపేట రామ‌న్న‌కు సంతాపం తెలిపిన తెరాస నాయ‌కులు
    8 Aug 2020 1:53 PM GMT

    సోలిపేట రామ‌న్న‌కు సంతాపం తెలిపిన తెరాస నాయ‌కులు

    సిద్దిపేట : దుబ్బాకలో దివంగత నేత దుబ్బాక ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి గారు మృతి పట్ల ఆయనకు నివాళులర్పించి,సంతాప సభ నిర్వహించిన టీఆర్ఎస్ నాయకులు.

  • ఫ్యాన్స్‌కు సూపర్‌స్టార్ విజ్ఞప్తి
    8 Aug 2020 1:49 PM GMT

    ఫ్యాన్స్‌కు సూపర్‌స్టార్ విజ్ఞప్తి

    ప్లాస్మా గురించి మ‌హేష్ ట్వీట్‌

    ప్ర‌స్తుత ప‌రిస్థితుల్లో ఒక‌రికొక‌రు తోడుగా ఉండాలి

    ప్లాస్మా థెర‌పీ ప్రాణాల‌ను నెల‌బెట్ట‌డానికి ఉప‌యోగ‌ప‌డుతుంది

    సైబ‌రాబాద్ పోలీస్ క‌మిష‌న‌ర్ స‌జ్జ‌నార్ ప్లాస్మా డొనేష‌న్ ఇంపార్టెన్స్ చెప్ప‌డానికి ఎన్నో కార్య‌క్ర‌మాలు చేస్తున్నారు.

    సాటి మ‌నుషుల ప్రాణాల్ని కాపాడ‌టానికి ప్లాస్మా డొనేట్ చేయాలి 

    నా పుట్టిన‌రోజు సంద‌ర్భంగా ఫ్యాన్స్... ప్లాస్మా డొనేష‌న్ ఎవేర్నెస్ ప్రోగ్రామ్స్ చేయాలి


Next Story