Live Updates: ఈరోజు (07 అక్టోబర్, 2020 ) ఆంధ్రప్రదేశ్ బ్రేకింగ్ న్యూస్!

ఈరోజు పంచాంగం

ఈరోజు బుధవారం | 07 అక్టోబర్, 2020 | శ్రీ శార్వరి నామ సంవత్సరం.. దక్షిణాయనం | అధిక ఆశ్వయుజ మాసం | కృష్ణపక్షం | పంచమి ఉ.10-35 వరకు తదుపరి షష్ఠి | రోహిణి నక్షత్రం సా.05-43 వరకు తదుపరి మృగశిర | వర్జ్యం: ఉ.09-03నుంచి 10-47 వరకు తిరిగి రా.11-43 నుంచి 01-25 వరకు | అమృత ఘడియలు మ.02-15 నుంచి 03-26 వరకు | దుర్ముహూర్తం: ఉ.11-23 నుంచి 12-10 వరకు | రాహుకాలం: మ.12-00 నుంచి 01-30 వరకు | సూర్యోదయం: ఉ.5-54 | సూర్యాస్తమయం: సా.5-47

ఈరోజు తాజా వార్తలు

Show Full Article

Live Updates

  • Tirumala updates: శ్రీవారిని దర్శించుకున్న తెలంగాణ ఎమ్మెల్యే రాజేంద్ర రెడ్డి..
    7 Oct 2020 5:10 AM GMT

    Tirumala updates: శ్రీవారిని దర్శించుకున్న తెలంగాణ ఎమ్మెల్యే రాజేంద్ర రెడ్డి..

    తిరుమల..

    -కృష్ణా ట్రిబ్యూనల్ నుండి రెండు తెలుగు రాష్ట్రాలు లాభం పొందాలి

    -కృష్ణా జలాలపై ఉన్న బిన్నాభిప్రాయాలు తొలగి రైతులకు మేలు జరగాలని శ్రీవారిని ప్రార్థించా

    -సీఎం కేసీఆర్ ను విమర్శించే స్థాయి రేవంత్ రెడ్డికి లేదు

    -రాజేంద్ర రెడ్డి, తెలంగాణ ఎమ్మెల్యే

  • Tirumala updates: శ్రీవారిని దర్శించుకున్న తెలంగాణ ఎన్నికల కమిషనర్ పార్థసారథి..
    7 Oct 2020 4:55 AM GMT

    Tirumala updates: శ్రీవారిని దర్శించుకున్న తెలంగాణ ఎన్నికల కమిషనర్ పార్థసారథి..

    తిరుమల..

    -త్వరలోనే జీహెచ్ఎంసీ ఎన్నికలు

    -నవంబర్, డిసెంబర్ నెలల్లో ఎన్నికలు ఉంటాయి

    -ఇంకా ఎన్నికల తేదీ ఖరారు చేయలేదు

    -త్వరలోనే నోటిఫికేషన్ ఇస్తాం

    -పార్థసారథి, తెలంగాణ ఎన్నికల కమిషనర్

  • Amaravati updates: ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ లేఖ...
    7 Oct 2020 4:22 AM GMT

    Amaravati updates: ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ లేఖ...

    అమరావతి..

    -వ్యవసాయిక రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్ లో సూక్ష్మ సేద్యం ఎంతో ఉపయోగకరం.

    -2018-19లో 5 లక్షల ఎకరాలకు డ్రిప్ ఇరిగేషన్ పరికరాలు అమర్చడం ద్వారా ఏపీ దేశంలో 2వ స్థానంలో నిలిచింది.

    -పి ఎం కె ఎస్ వై నిధులు రు.412 కోట్లు, నాబార్డు నిధులు రు.616 కోట్లు కలిపి మొత్తంగా రు.1028 కోట్లు అందుబాటులో ఉన్నా ఆయా నిధులను వినియోగించలేదు.

    -ఈ ఏడు మార్చిలో ప్రాజెక్టు మంజూరైన రైతులకు ఇప్పటికీ పరికరాలు ఇవ్వలేదు.

    -సూక్ష్మ సేద్యం కోసం అనంతపురం జిల్లా రైతులు ఎన్నో ఆశలతో ఎదురుచూస్తున్నారు.

    -రానున్న వేసవిని దృష్టిలో ఉంచుకుని ఇకనైనా డ్రిప్ ఇరిగేషన్ ప్రాజెక్టును పూర్తి చేయాలని కోరుతున్నాం.

  • Tirumala updates: నిన్న శ్రీవారిని దర్శించుకున్న భక్తులు...
    7 Oct 2020 2:46 AM GMT

    Tirumala updates: నిన్న శ్రీవారిని దర్శించుకున్న భక్తులు...

    తిరుమల సమాచారం...

    -నిన్న శ్రీవారిని దర్శించుకున్న 18,130 మంది భక్తులు

    -తలనీలాలు సమర్పించిన 6,957 మంది భక్తులు

    -నిన్న శ్రీవారి హుండీ ఆదాయం రూ.1.35 కోట్లు

  • Amaravati updates: నేడు విజయవాడకు కేంద్ర ఆర్ధికమంత్రి శ్రీమతి నిర్మలా సీతారామన్...
    7 Oct 2020 2:42 AM GMT

    Amaravati updates: నేడు విజయవాడకు కేంద్ర ఆర్ధికమంత్రి శ్రీమతి నిర్మలా సీతారామన్...

    అమరావతి..

    మధ్యాహ్నం 12.25 నిమిషాలకు చెన్నయ్ నుంచి హైదరాబాద్ అక్కడ నుండి గన్నవరం విమానాశ్రయం కు చేరుకుని జక్కుల నెక్కలం, గూడవల్లి సర్కిల్ దగ్గర ఉన్న వ్యవసాయ క్షేత్రంలో నేరుగా రైతులను కలసి మాట్లాడతారు

    3.00 గంటలకు కేంద్ర ప్రభుత్వ అధికార కార్యక్రమంలో పాల్గొంటారు.

    4 గంటలకు ది వెన్యూ కన్వెన్షన్ హాల్ కు చేరుకొని బీజేపీ ఏర్పాటు చేసిన కార్యక్రమం, చట్టం చేయబడిన వ్యవసాయ బిల్లు పై రైతులు, వ్యవసాయరంగ నిపుణులు తో చర్చా కార్యక్రమం" లో పాల్గొటారు.

  • Srisailam Dam updates: శ్రీశైలం జలాశయానికి కొనసాగుతున్న వరద...
    7 Oct 2020 2:07 AM GMT

    Srisailam Dam updates: శ్రీశైలం జలాశయానికి కొనసాగుతున్న వరద...

    కర్నూలు జిల్లా...

    -ఇన్ ఫ్లో : 37,671 క్యూసెక్కులు

    -ఔట్ ఫ్లో : 39,600 క్యూసెక్కులు

    -పూర్తి స్థాయి నీటి మట్టం: 885 అడుగులు

    -ప్రస్తుతం : 884.80 అడుగులు

    -పూర్తిస్దాయి నీటి నిల్వ : 215.8070 టిఎంసీలు

    -ప్రస్తుతం: 214.3637 టీఎంసీలు

    -కుడిగట్టు జలవిద్యుత్ కేంద్రంలో కొనసాగుతున్న విద్యుత్ ఉత్పత్తి

Print Article
Next Story
More Stories