Live Updates: ఈరోజు (05 అక్టోబర్, 2020 ) ఆంధ్రప్రదేశ్ బ్రేకింగ్ న్యూస్!
ఈరోజు బ్రేకింగ్ న్యూస్, 05 అక్టోబర్, 2020 : హెచ్ఎంటీవీ లైవ్ బ్లాగ్ ద్వారా తాజా వార్తలు ఎప్పటికప్పుడు మీకోసం అందిస్తుంది. ఇక్కడ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన వార్తా విశేషాలను, తాజా సమాచారాన్నిఎప్పటికప్పుడు మీకోసం బ్రేకింగ్ గా ఇస్తున్నాం.
ఈరోజు పంచాంగం
ఈరోజు సోమవారం | 05 అక్టోబర్, 2020 | శ్రీ శార్వరి నామ సంవత్సరం.. దక్షిణాయనం | అధిక ఆశ్వయుజ మాసం | కృష్ణపక్షం | తదియ ఉ.07-10 వరకు తదుపరి చవితి | భరణి నక్షత్రం మ.01-22 వరకు తదుపరి కృత్తిక | వర్జ్యం: రా.02-32 నుంచి 04-17 వరకు | అమృత ఘడియలు ఉ. 08-30 నుంచి 09-48 వరకు | దుర్ముహూర్తం: మ. 12-10 నుంచి 12-57 వరకు తిరిగి మ.02-30 నుంచి 03-17 వరకు | రాహుకాలం: ఉ.07-30 నుంచి 0900 వరకు | సూర్యోదయం: ఉ.5-54 | సూర్యాస్తమయం: సా.5-47
ఈరోజు తాజా వార్తలు
Live Updates
- 5 Oct 2020 12:28 PM IST
AMARAVATHI : రాజధానిపై దాఖలైన పిటీషన్ ల పై విచారణ.
అమరావతి: రాజధాని అంశంపై దాఖలైన పిటీషన్ ల పై విచారణ..
- ఆన్ లైన్ ద్వారా విచారణ చేపట్టిన ఏపీ హైకోర్టు..
- మొత్తం 226 పిటిషన్లు పెండింగులో ఉన్నాయన్న సీజే..
- 44 పిటిషన్లను మొదట వింటామని చెప్పిన ధర్మాసనం..
- 185 పిటిషన్లు పై తర్వాత విచారణ జరుపుతామని చెప్పిన ధర్మాసనం..
- 5 Oct 2020 12:24 PM IST
నూతన బ్రిడ్జిని వెంటనే నిర్మించాలి: చినరాజప్ప
తూర్పుగోదావరి : పెద్దాపురం మం. కాండ్రకోట - తూర్పుపాకల గ్రామాల మధ్య కుప్పకూలిన వంతెనను పరిశీలించిన పెద్దాపురం ఎమ్మెల్యే నిమ్మకాయల చినరాజప్ప..
- ఏలేరు వరదలు నీటిని దిగువకు విడుదల చేసే సమయంలో అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు..
- ఫలితంగా నీటి ప్రవాహానికి రోడ్లకు గండ్లు, వంతెన కుప్పకులాయి..
- ఏలేరు ఆధునికీకరణ పనులు చేపట్టడంలో ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోంది..
- వెంటనే ఫేజ్ - 1, ఫేజ్ - 2 పనులకు నిధులు మంజూరు చేసి ఏలేరు ఆధునికీకరణ పనులు చేపట్టాలి..
- రైతుల అవసరాలకు అనుగుణంగా కాండ్రకోట - తూర్పుపాకాల గ్రామాల మధ్య నూతన బ్రిడ్జిని వెంటనే నిర్మించాలి: చినరాజప్ప
- 5 Oct 2020 12:21 PM IST
CM JAGAN: గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్న సీఎం జగన్
కృష్ణాజిల్లా: తాడేపల్లి నుండి గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్న సీఎం జగన్
- మరికాసేపట్లో గన్నవరం విమానాశ్రయం నుండి కడప బయలుదేరనున్న సీఎం జగన్
-మామ గంగిరెడ్డి మూడవరోజు కార్యక్రమానికి హాజరు కానున్న సీఎం జగన్
- మధ్యాహ్నం 1గంటకు తిరిగి గన్నవరం చేరనున్న సీఎం జగన్
- 5 Oct 2020 12:18 PM IST
స్విమ్స్ పద్మావతి ఆసుపత్రి ఘటనపై పూర్తి విచారణకు ఆదేశించాం: జెసి వీరబ్రహ్మం,
తిరుపతి: స్విమ్స్ పద్మావతి కోవిడ్ ఆసుపత్రి వద్ద దుర్ఘటనలో మృతి చెందిన రాధిక కుటుంబానికి 5లక్షల రూపాయల ఎక్సగ్రేషియా
- గాయపడిన ఇద్దరికి చెరో 50వేల సాయంతో పాటు పూర్తి వైద్య ఖర్చులు
- ఘటనకు బాధ్యలపై చర్యలు తీసుకుంటాం
- ఘటనపై పూర్తి విచారణకు ఆదేశించాం...
- కేంద్ర ప్రభుత్వం ఫ్రంట్ లైన్ వారియర్స్ కు కేటాయించే 50లక్షల రూపాయల మంజూరుకు కూడా ప్రతిపాదనలు పంపుతాము
- మృతురాకి భర్తకు పర్మినెంట్ ఉద్యోగానికి కూడా హామీ ఇచ్చిన జెసి వీరబ్రహ్మం, స్విమ్స్ డైరెక్టర్ వెంగమ్మ






