Live Updates: ఈరోజు (02 నవంబర్, 2020 ) ఆంధ్రప్రదేశ్ బ్రేకింగ్ న్యూస్!
ఈరోజు బ్రేకింగ్ న్యూస్, 02 నవంబర్, 2020 : హెచ్ఎంటీవీ లైవ్ బ్లాగ్ ద్వారా తాజా వార్తలు ఎప్పటికప్పుడు మీకోసం అందిస్తుంది. ఇక్కడ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన వార్తా విశేషాలను, తాజా సమాచారాన్నిఎప్పటికప్పుడు మీకోసం బ్రేకింగ్ గా ఇస్తున్నాం.
ఈరోజు పంచాంగం
ఈరోజు సోమవారం | 02 నవంబర్, 2020 | శ్రీ శార్వరి నామ సంవత్సరం.. దక్షిణాయనం | నిజ ఆశ్వయుజ మాసం | కృష్ణపక్షం | విదియ రా.11-01 తదుపరి తదియ | కృత్తిక నక్షత్రం రా.10-50 తదుపరి రోహిణి | వర్జ్యం ఉ.9-38 నుంచి 11-24 వరకు | అమృత ఘడియలు రా.8-11 నుంచి 9-56 వరకు | దుర్ముహూర్తం మ.12-06 నుంచి 12-52 వరకు తిరిగి మ.2-23 నుంచి 3-09 వరకు | రాహుకాలం ఉ.7-30 నుంచి 9-00 వరకు | సూర్యోదయం: ఉ.06-02 | సూర్యాస్తమయం: సా.05-26
ఈరోజు తాజా వార్తలు
Live Updates
- 2 Nov 2020 12:47 PM GMT
Krishna District Updates: వత్సవాయి మండలం కంభంపాడు లో విషాదం..
కృష్ణాజిల్లా
- ఆపరేషన్ ముస్కాన్ లో దారుణం
- తన కూతురు మానస(10) ను వత్సవాయి పోలీసులు తీసుకెళ్లారని ఆగిన తల్లి గుండె
- తల్లి కోమరగిరి వెంకటేశ్వరమ్మ (35) గుండె పోటుతో మృతి
- 2 Nov 2020 12:44 PM GMT
Vijayawada Updates: హైదరాబాదుకు ప్రారంభమైన ఏపీ బస్ సర్వీసులు...
విజయవాడ
* కోవిడ్ నేపథ్యంలో ఆగిపోయిన హైదరాబాదు బస్సులు
* నేటి నుంచీ హైదరాబాదు మరియు తెలంగాణలోని పలు ప్రాంతాలకు తిరగనున్న ఆర్టీసీ బస్సులు
* ఇరు రాష్ట్రాల ఆర్టీసీల మధ్య ఒప్పందం కుదరడంతో మొదలైన బస్సులు
* ప్రైవేటు కార్లు, బస్సుల రేట్ల బాదుడు నుంచీ ఈరోజుతో విముక్తి
- 2 Nov 2020 12:42 PM GMT
High Court Of Andhra Pradesh Updates: రాజధాని అంశంపై దాఖలైన పిటిషన్లను విచారించిన ఏపీ హైకోర్టు..
అమరావతి
// వాదనలను వినిపించిన పిటిషనర్ల తరపు న్యాయవాది
// రేపు కూడా వాదనలు వినిపించనున్న పిటిషనర్ తరవు న్యాయవాది
// రాజధాని కేంద్రం పరిధిలో అంశమని, రాష్ట్రానికి మార్చే అధికారం లేదన్న పిటిషనర్
// రాజధానికి సంబంధించి చట్టం చేసిన తర్వాత భూములు ఇచ్చిన వారికి హక్కులు వస్తాయన్న పిటిషనర్
// ఒక చట్టం రద్దు చేసి మరో చట్టం ఎలా చేస్తారని, అది కుదరదని కోర్టుకి తెలిపిన పిటిషనర్
// తదుపరి విచారణను రేపటికి వాయిదా వేసిన హైకోర్టు
- 2 Nov 2020 12:38 PM GMT
Amaravati Updates: వైఎస్ వివేకానంద కేసు విచారణపై హైకోర్టుకి సీబీఐ...
అమరావతి
_ వివేకా హత్య కేసుకు సంబంధించిన రికార్డులన్నీ ఇవ్వాలని పులివెందుల మేజిస్ట్రేట్ ను కోరిన సీబీఐ
_ తమకు ఆదేశాలు లేవని నిరాకరించిన మేజిస్ట్రేట్
_ రికార్డులు తమకు ఇచ్చేలా కింది కోర్టుకు ఆదేశాలు ఇవ్వాలని హైకోర్టులో పిటిషన్ వేసిన సీబీఐ
_ విచారణ వాయిదా వేసిన హైకోర్టు
- 2 Nov 2020 12:33 PM GMT
Tirumala Updates: జలపాత విహార యాత్రకు వెళ్ళిన వారు క్షేమం...
తిరుపతి..
* చిత్తూరు జిల్లా సదాశివకోన జలపాత విహార యాత్రకు వెళ్ళిన వారు క్షేమం
* నెల్లూరు, చిత్తూరు జిల్లాకు చెందిన మొత్తం 24 మంది విహార యాత్రకు వెళ్ళారు.
* సెల్ ఫోన్ సిగ్నల్ అందకపోవడం కుటుంబ సభ్యులు ఆందోళన చెందారు
* అందురు క్షేమంగా వుండడంతో పోలీసుల, కుటుంబ సభ్యులు ఊపిరి పీల్చుకున్నారు.
* ట్రాక్టర్ లో తిరుపతికి తీసుకోస్తున్నారు...
- 2 Nov 2020 11:33 AM GMT
Amaravati Updates: సుల్తాన్ ముసావీ కుటుంబంలో విషాదం పట్ల నారా చంద్రబాబు నాయుడు ఆవేదన వ్యక్తం చేశారు..
అమరావతి..
-విజయవాడలో సీనియర్ అడ్వకేట్ సుల్తాన్ ముసావీ కుటుంబంలో విషాదం పట్ల మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు.
-20రోజుల వ్యవధిలో కుటుంబంలో నలుగురు మృతి చెందడం బాధాకరం.
-ముసావీతో పాటు తల్లి, భార్య, కొడుకు ప్రాణాలు కోల్పోవడం విషాదకరం.
-కరోనా ఏవిధంగా ప్రజల ప్రాణాలను బలిగొంటుందో, కుటుంబాలను అస్తవ్యస్థం చేసిందో, ఈ విషాదమే తార్కాణం.
-సుల్తాన్ ముసావీ కుమార్తెకు, తన ప్రగాఢ సంతాపం వ్యక్తం చేశారు, ధైర్యంగా ఉండాలని విజ్ఞప్తి చేశారు.
- 2 Nov 2020 11:29 AM GMT
Guntur Updates: కృష్టాయపాలెం రైతుల బెయిల్ పిటిషన్..
గుంటూరు ః....
-మంగళగిరి మండలం కృష్టాయపాలెం రైతుల బెయిల్ పిటిషన్.
-ఇరు వర్గాల వాదనలు విన్న జిల్లా న్యాయస్దానం
-తీర్పు 5 తేది కి వాయిదా...
- 2 Nov 2020 11:26 AM GMT
East Godavari Updates: కొత్తపల్లి ఆస్పత్రి అభివృధ్ది పనులకు శంఖుస్థాపన చేసిన ఎమ్మెల్యే సతీష్..
తూర్పుగోదావరి :
- ముమ్మిడివరం మం. టి కొత్తపల్లి ఆస్పత్రి అభివృధ్ది పనులకు శంఖుస్థాపన చేసిన శాసనసభ్యుడు పొన్నాడ సతీష్..
- నాడు - నేడు అభివృధ్ధి నిధులు రూ. 7.40 కోట్లతో ఆస్పత్రి ఆధునీకరణ కు శంఖుస్థాపన చేసిన ఎమ్మెల్యే సతీష్..
- 2 Nov 2020 11:22 AM GMT
West Godavari Updates: విద్యుత్ సంస్థల ప్రైవేటీకరణ బిల్లును వ్యతిరేఖిస్తూ ఉద్యోగుల ఆందోళన..
పశ్చిమగోదావరి జిల్లా
- నరసాపురం లో కేంద్రం ప్రవేశపెట్టిన విద్యుత్ సంస్థల ప్రైవేటీకరణ బిల్లును వ్యతిరేఖిస్తూ కార్యాలయం ముందు ఉద్యోగులు ఆందోళన
- తమ డిమాండ్ల ను ప్రభుత్వం స్పందించకపోతే ప్రత్యక్ష ఉద్యమం చేపడతామని హెచ్చయించిన ఐక్య కార్యాచరణ సమితి.
- 2 Nov 2020 11:02 AM GMT
Prakasham Updates: చీరాల నియోజకవర్గంలో నిపందిళ్ల పల్లి లో జరిగిన ఇరువర్గాల ఘర్షణ...
ప్రకాశం జిల్లా...
- చీరాల నియోజకవర్గంలో నిపందిళ్ల పల్లి లో జరిగిన ఇరువర్గాల ఘర్షణ లో
- గాయపడి మంగళగిరి మణిపాల్ హాస్పిటల్ లో చికిత్స పోందుతున్న చెరుకూరి ఏసును పరామర్శించిన YCP నాయకులు కరణం వెంకటేష్
About
HMTV team aims to keep you abreast with whatever is making headlines across the world including politics, business, sports, lifestyle and entertainment.
Our Links
Subscribe
Get the best positive stories straight into your inbox!
SubscribeWe're social, connect with us:
© Copyrights 2024. All rights reserved.
Powered By Hocalwire