'తెలుగు కథకు వందేళ్ల వందనాలు' వందనంగా అందించిన గొల్లపూడి!

తెలుగు కథకు వందేళ్ల వందనాలు వందనంగా అందించిన గొల్లపూడి!
x
Highlights

తెలుగు కథకు శాత వత్సరాల సంబరాన్ని తనదైన శైలి లో తెలుగు కథకు వందేళ్ల వందనాలు అంటూ HMTV తో కలసి అందించారు గొల్లపూడి మారుతీరావు!

అబ్బో ఆయనా బహుముఖ ప్రజ్ఞాశాలి అని చాలా మంది గురించి చెబుతుంటారు. నిజానికి ఆ పదానికి అర్థం కూడా తెలియదు ఆమాట అనేవారికి. ఎదో ఒక ఉపమానం చెప్పాలని అనేస్తారంతే. బహుముఖ ప్రజ్ఞాశాలి అనే పదానికి సరిగ్గా సరిపోయే మహానుభావులు చాలా కొద్ది మండే ఉంటారు. వారు గుర్తింపు కోసం పరిగెత్తరు.. కానీ, తమ వెనుక వున్న వారికి గుర్తింపు తేవడానికి కృషి చేస్తారు. తాను ఏ రంగం లో ఉన్నా ఆ రంగంలో ఉన్న గొప్ప వ్యక్తుల్ని ప్రజల ముందుకు తీసుకురావడం లోనే వారికి ఆనందం ఉంటుంది. అటువంటి వారిలో అగ్రగణ్యులు గొల్లపూడి మారుతీరావు.

గొల్లపూడి అనగానే అందరికీ నటుడిగానే గుర్తొస్తారు. కానీ, తెలుగు సాహతీ లోకానికి ఆయన చేసిన సేవ చాలా మందికి తెలీదు. కథలు రాయడంలో.. ప్రాపంచిక విషయాలపై విశ్లేషణ చేయడంలో.. వ్యంగ్యంగా రచనలు చేయడంలో.. ఇలా ఒక్కటేమిటి అన్నిరకాల సాహిత్య ప్రక్రియల్లోనూ గొల్లపూడి ముద్ర ప్రస్ఫూటంగా కనిపిస్తుంది. ఆయన సాహితీ ప్రయాణాన్ని విశ్లేషించడం.. వివరించడం చాలా కష్టమైన విషయం. కానీ, సాహితీ ఇష్టుడిగా ఆయన తెలుగు సాహితీ లోకానికి చేసిన సేవ అజరామరమైనదిగా నిలిచిపోతుంది.

ముఖ్యంగా తెలుగు కథకి అయన అందించిన అద్భుతమైన విశ్లేషణాత్మక కార్యక్రమం వందేళ్ల తెలుగు కథకు అర్పించిన 'వందేళ్ల కథకు వందనాలు' కార్యక్రమం. హెచ్ఎంటీవీ తెలుగు లెస్స కార్యక్రమంలో భాగంగా 2012 లో గొల్లపూడి మారుతీ రావు తెలుగు కథకు వందనాలు అంటూ ఓ ప్రత్యేకమైన కార్యక్రమాన్ని నిర్వహించారు. తెలుగు సాహితీ రంగంలో తెలుగు కథ మీద వచ్చిన అతి పెద్ద కానుక ఇదే అని చెప్పవచ్చు. ఇక్కర ఇద్దరా వందల మంది కథా రచయితల్లో అద్భుత ప్రావీణ్యాన్ని ప్రదర్శించిన 116 మంది రచయితలను ఎంపిక చేసుకుని.. వారు రాసిన కథల్లో అత్యంత అద్భుతమైన కథను తీసుకుని దానిని విశ్లేషిస్తూ.. ఆయా రచయితల మనోభావాల్ని తెలుసుకుంటూ గొల్లపూడి ఆ కార్యక్రమాన్ని నభూతో అన్నట్టు నడిపించారు.

ఒక కథ పుట్టాలంటే ఎంత కష్టం ఉంటుందో.. పుట్టిన కథ పదిమందికీ చేరి మెప్పు పొందితే ఆ రచయిత పొందే ఆనందం చెప్పలేనిది. కథ రచయితగా గొల్లపూడి ఆ ఆనందం ఎలా ఉంటుందో స్వానుభవమే. అదే కథకుడి కథకు పట్టం కడుతూ గొల్లపూడి లాంటి సాహితీ పిపాసి విశ్లేషణాత్మకంగా మాట్లాడితే.. ఆ కథకుడి జన్మ ధాన్యం అయిపోయినట్టే కదా. సొంతంగా కథలు రాయగలిగిన.. సహ రచయితల కంటే అద్భుతంగా కథ రాయగలిగిన దమ్మున్న ఓ రచయిత ఇతరుల కథల్లోని గొప్పదనాన్ని వెదికి పట్ట్టుకుని దానిని ఆ రచయిత ముందే చెబుతూ ఉంటే అసలు ఆ కార్యక్రమం గురించి ఊహిస్తేనే ఎంతో ఆనందం కలుగుతుంది. మరి గొల్లపూడి ఆధ్వర్యంలో వచ్చిన ఆ తెలుగు కథకు వందనాలు కార్యక్రమంలో వచ్చిన వరుస ఎపిసోడ్ లు చూస్తే తేనెపానకంలో ముంచిన మినపరొట్టెను తిన్నంత తీయగా.. కమ్మగా ఉంటుంది.

ఇటు కాళోజీ.. అటు కాళీపట్నం రామారావు, దేవులపల్లి కృష్ణశాస్త్రి ఒక పక్క..మునిపల్లె రాజు మరోపక్క, చాగంటి సోమయాజులు కథ.. మధురాంతకం రాజారామ్.. ఇలా చెప్పుకుంటూ పొతే తెలుగు సాహిత్య సరస్వతికి సువర్ణ కథా పుష్పార్చన చేసిన రచయితలను పరిచయం చేసి గొల్లపూడి తెలుగు సాహితీ లోకానికి చేసిన మేలు అనన్యసామాన్యం అయినది. వేలాది కథల్లో ఓ వంద నూట యాభై కథల్ని ఎంచుకోవడం ఎంత క్లిష్టమైన పనో కదా. అంత క్లిష్టమైన పనిని అత్యంత సులువుగా పూర్తి చేసిన సాహితీవేత్త గొల్లపూడి. అయన ఈ కార్యక్రమంలో తెలుగు కథ గురించి మాట్లాడుతూ ఒక రచయిత్రిని పరిచయం చేసిన విధానం ఎలా ఉందొ చూడండి..

కుప్పిలి పద్మ అనే రచయిత్రి రాసిన కథను పరిచయం చేసే సందర్భంలో తెలుగు కథకు కొత్త గొంతు అని సంబోధించారు. దానికి కారణాన్ని వివరిస్తూ వందేళ్ల తెలుగు కథలో.. పద్మ పదిహేనేళ్ల నుంచి కథలు రాస్తోన్నారు. వందేళ్ల కథలో పదిహేనేళ్ల ప్రయాణం కొత్తగానే చెప్పుకోవాలి కదా అంటారు. ఇది గొల్లపూడి మార్క్.

ఇటువంటి ఎన్నోచమక్కులతో ఆయన తన తెలుగు కథా సాహిత్యానికి వందేళ్ల వసంతోత్సవాన్ని నిర్వహించారు. గొల్లపూడి కథా పరిచయ విధానం గురించి ఎంత సెహెప్పుకున్నా తక్కువే. మనందరినీ శోక సముద్రంలో ముంచి దివికేగిన గొల్లపూడి ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటూ.. హెచ్ఎంటీవీ తో కలసి అయన అందించిన వందేళ్ల కథకు వందనాలు కార్యక్రమంలోని దేవుల పల్లి కృష్ణ శాస్త్రి ''అవ్వ తిరునాళ్లలో తప్పిపోయింది'' కథ పై గొల్లపూడి అందించిన విశ్లేషణాత్మక పరిచయం వీడియో మీకోసం..


HMTV లైవ్ నుంచి తాజా వార్తా విశేషాల కోసం TELEGRAM ను అనుసరించండి!



Show Full Article
Print Article
More On
Next Story
More Stories