'బట్టల రామస్వామి బయోపిక్కు' ఓటీటీలో ఎప్పుడంటే?

Battala Ramaswamy Biopic On OTT
x

Battala Ramaswamy Biopic File Photo

Highlights

Battala Ramaswamy Biopic: అల్తాఫ్ హసన్, శాంతి రావ్, సాత్విక, లావణ్యరెడ్డి ప్రధాన పాత్రల్లో నటించారు.

Battala Ramaswamy Biopic: క‌రోనా సెకండ్ వేవ్ ప్ర‌భావం అన్ని రంగాల‌పై ప‌డింది. సినీ ఇండ‌స్ట్రీపై క‌రోనా ప్ర‌భావం తీవ్రంగానే ఉంద‌ని చెప్పాలి. 2020లో క‌రోనా కార‌ణంగా అనేక సినిమాలు విడుద‌ల‌కు నోచుకోలేదు. ఈ ఏడాది మొద‌ట్లో క‌రోనా ప్ర‌భావం త‌గ్గి ప‌రిస్థితులు కుదుట‌ప‌డ‌డంతో సినిమాలు రిలీజులు ఊపందుకున్నాయి. క‌రోనా సెకండ్ వేవ్ పుణ్య‌మా అని మ‌ళ్లీ గ‌డ్డుప‌రిస్థితులు వ‌చ్చాయి. క‌రోనా కార‌ణంగా థియేట‌ర్లు మూత‌ప‌డే స‌రికి కొన్ని సినిమాల‌కు ఓటీటీ ప్ర‌త్యామ్న‌యం గా క‌నిపించింది. దీంతో సినిమాలు అన్ని ఓటీటీ వేదిక‌గా రిలీజ్ కావ‌డం మొద‌లు పెట్టాయి.

డైరెక్ట్-టు-డిజిటల్ రిలీజ్ సినిమాలు, ఒరిజినల్ వెబ్ సిరీస్‌లు, సరికొత్త సినిమాల విడుదలతో ఒటీటీలు వీక్ష‌కుల‌కు అర‌చేతిలోనే అన్ని చూపిస్తున్నాయి. గ‌త ఏడాది అమృతరామమ్ అనే సినిమా ఓటీటీలో విడుద‌లై చిన్న సినిమాల‌కు దారి చూపించింది. దీంతో నాని వి, కీర్తిసూరేశ్ పెంగ్విన్, అనుష్క నిశ‌బ్ధం ఇలా చాలా వ‌ర‌కు సినిమాలు ఓటీటీలో రిలీజ్ అయ్యాయి. ఇక తాజాగా మ‌రోసారి బట్టల రామస్వామి బయోపిక్కు' సినిమా డైరెక్ట్‌గా ఓటీటీలో రిలీజ్ కాబోతోంది. ఓటీటీ వేదిక జీ 5లో ఈ చిత్రాన్ని ప్రేక్షకులకు అందివ్వనుంది.

జీ 5 '47 డేస్', 'మేక సూరి' సినిమాలను డైరెక్టుగా డిజిటల్ రిలీజ్ చేసింది. ఓటీటీల పోటీలో కాస్త వెన‌క‌ప‌డిన‌ప్ప‌టికీ ఈ ఏడాది 'బట్టల రామస్వామి బయోపిక్' సినిమాతో డైరెక్ట్-టు-డిజిటల్ రిలీజ్‌లకు శ్రీకారం చుడుతోంది. ఈ సినిమా తర్వాత 'రూమ్ నంబర్ 54' వెబ్ సిరీస్‌ను విడుదల చేయనుంది. ఈ రెండు ప్రాజెక్టులతో ఈ ఏడాది ఒరిజినల్ కంటెంట్ రిలీజ్‌లను జీ5 స్టార్ట్ చేసింది.

'బట్టల రామస్వామి బయోపిక్' సినిమా విష‌యానికి వ‌స్తే.. అల్తాఫ్ హసన్, శాంతి రావ్, సాత్విక, లావణ్యరెడ్డి ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ సినిమాకు రామ్ నారాయణ్ దర్శకత్వం వ‌హించాడు. ఈ చిత్రానికి నిర్మాతలుగా 'సెవెన్ హిల్స్' సతీష్ కుమార్ ఐ, మ్యాంగో మీడియా రామకృష్ణ వీరపనేని వ్య‌వ‌హ‌రిస్తున్నారు. ఆర్పీ పట్నాయక్ సంగీతం అందించారు.

రామస్వామికి జీవితంలో రెండంటే రెండే లక్ష్యాలు ఉంటాయి. ఒకటి... శ్రీరాముడిలా ఒక్కరిని మాత్రమే పెళ్లి చేసుకోవాలి. రెండు.. చీరల వ్యాపారం చక్కగా చేసుకోవాలి. కోరుకున్నట్టుగా.. వీధుల్లో నగలు అమ్మే జయప్రదను ప్రేమించి పెళ్లి చేసుకుంటాడు. అయితే, అనుకోని పరిస్థితుల్లో మరో ఇద్దరి మెడలో మూడు ముడులు వేస్తాడు. ఈ సినిమా కామెడీ ఎంట‌ర్ టైన‌ర్ గా తెర‌కెక్కిన ఈ చిత్రం అందర్నీ నవ్విస్తుందని జీ5 ప్రతినిధులు తెలిపారు.

Show Full Article
Print Article
Next Story
More Stories