ఆ చెడ్డ అలవాటును మాన్పిస్తుంది..ఎంతకాలం బతుకుతారో చేప్పేస్తుంది

ఆ చెడ్డ అలవాటును మాన్పిస్తుంది..ఎంతకాలం బతుకుతారో చేప్పేస్తుంది
x
Highlights

ఇప్పుడు యువతను పట్టి పీడిస్తున్న వ్యసనం సిగరెట్. కొందరు ఒత్తిడి కారణంగా అలవాటు పడితే మరికొందరు స్నేహితుల ప్రోద్బలంతో దానికి అలవాటు పడిపోతున్నారు....

ఇప్పుడు యువతను పట్టి పీడిస్తున్న వ్యసనం సిగరెట్. కొందరు ఒత్తిడి కారణంగా అలవాటు పడితే మరికొందరు స్నేహితుల ప్రోద్బలంతో దానికి అలవాటు పడిపోతున్నారు. సరదాగా ప్రారంభమైన ఈ అలవాటు చివరకు వారిని చైన్ స్మోకర్లను చేస్తుంది. చివరకు క్యాన్సర్ వంటి ప్రమాదకర రోగాల బారినపడి ప్రాణాలు కోల్పోతున్నారు.

'ధూమపానం ప్రాణానికి హానికరం' అని ప్రభుత్వాలు ఎన్ని హెచ్చరికలు చేస్తున్నా పట్టించుకొనేవారు చాలా అరుదు. దీనికి అంతులేదా అంటే అది కూడా మిలియన్ డాలర్ల ప్రశ్నే? ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) లెక్కల ప్రకారం ప్రపంచ వ్యాప్తంగా 1.2 బిలియన్ మంది పొగాకు బానిసలైనట్లుగా వెల్లడించింది.

పొగాకు అలవాటు పడడము వారి చేతుల్లో ఉన్నప్పటికీ మానడం మాత్రం వారి చేతుల్లో లేకుండా పోయింది. అయితే ధూమపానం అలవాటును మానుకోవడానికి ఓ స్మార్ట్‌ యాప్‌ త్వరలో అందుబాటులోకి రానుంది. . 'హెల్త్‌స్పాన్‌'. పేరుతో ఈ యాప్‌ను గూగుల్ త్వరలో లాంచ్ చేయనుంది. పొగరాయుళ్ళకు కనువిప్పు కలిగించేందుకు

వారికి ఉన్న ఈ చెడ్డ అలవాటును దూరం చేసేందుకు యాప్ సిద్దమవుతోంది. ఈ యాప్‌తో రోజూ పొగ తాగే వారిలో క్రమేణ శరీరంలో ఎలాంటి మార్పులు చోటుచేసుకుంటున్నాయి అవి అవయవాలపై ఎంతటి ప్రభావాన్ని చూపుతున్నాయనే

విషయాన్ని గుర్తించి చెబుతుంది. ఇంకా ఎంతకాలం జీవిస్తారు అనే విషయం కూడా 'హెల్త్‌స్పాన్‌' చేప్పేస్తుంది. ఇలా ముందస్తు హెచ్చరికలను పొగరాయుళ్ళకు తెలియజేయడం ద్వారా వారిలో మార్పుకు అవకాశం ఉంది. ఇలా వారిలో ధూమపానం మాన్పించడంతో పాటు దాని వల్ల వచ్చే వృద్ధాప్య ఛాయలను పసిగడుతుంది. పొగ వల్ల వచ్చే రోజువారి మార్పులను బట్టి ఎలాంటి ఆహారం తీసుకుంటే ఆరోగ్యం మెరుగుపడుతుందో ఈ యాప్ గైడ్ చేస్తుంది. ఈ మొబైల్‌ యాప్‌ను అమెరికా శాస్త్రవేత్తలు రూపొందిస్తున్నారు

Show Full Article
Print Article
Next Story
More Stories