బాత్‌రూంలోకి ఫోన్ తీసికెళ్ళి...

బాత్‌రూంలోకి ఫోన్ తీసికెళ్ళి...
x
Highlights

స్మార్ట్‌ఫోన్ ఇది ఇప్పుడు మనిషి అత్యవసర కృతిమ అవయవం. ఒంటికి బట్టలు ఉన్నాయో చూసుకోము కానీ చేతిలో సేల్‌ఫోన్ మాత్రం మార్చిపోము. చివరకు ఫోన్ లేకపోతే మనం...

స్మార్ట్‌ఫోన్ ఇది ఇప్పుడు మనిషి అత్యవసర కృతిమ అవయవం. ఒంటికి బట్టలు ఉన్నాయో చూసుకోము కానీ చేతిలో సేల్‌ఫోన్ మాత్రం మార్చిపోము. చివరకు ఫోన్ లేకపోతే మనం బతకలేం అనే స్ధాయికి వచ్చేశాము. అయితే వాటితో ఎంతటి ఉపయోగం ఉందో అంతే అనర్ధాలు ఉన్నాయి. ఫోన్ వాడితే రెడియోషన్‌ ప్రమాదమే ఒక్కటే కాదు. ఇతర ప్రమాదాలు కూడా పొంచి ఉన్నాయి. చివరకు మన ఫోన్ కంపు కొట్టే టాయిలెట్ కంటే అద్వానంగా తయారైంది అంటే నమ్ముతారా!. అవును మన ఫోన్ పబ్లిక్ టాయిలేట్ల కంటే ప్రమాదకరంగా మారిందంటూ వైద్యులు వెల్లడిస్తున్నారు.

మనం రోజుకు ఫోన్‌ను ఎన్ని సార్లు స్వైవ్ చేస్తామో తెలుసా? దాదాపు 2,617 సార్లు ఫోన్‌ను మన వేళ్ళతో టచ్ చేస్తామని అమెరికాలోని ఓ పరిశోధన సంస్ధ జరిపిన ఓ సర్వేలో వెల్లడైంది. అయితే ఇది కేవలం ఫోన్ తక్కవగా ఉపయోగించేవారి లెక్క. ఇక ఫోన్ అడిక్టర్స్ సంఖ్యను పరిగణలోకి తీసుకుంటే ఈ సగటు 5400కి చేరుతుంది. తినేటప్పుుడు,పడుకునేటప్పుడు, బాత్రూంకి వెళ్లే సమయంలో కూడా ఫోన్ వాడేస్తున్నారు. ఈ సమయంలో ఫోన్‌పైకి ఎంత బ్యాక్టిరియా చేరుతుందో తెలుసా. పబ్లిక్ టాయిలేట్ కంటే మన ఫోన్ మీదే ఎక్కువ బ్యాక్టీరియా ఉంటుందని పరిశోధకులు చెబుతున్నారు. ప్రతీ చోట మన చేతిలో ఫోన్ టచ్‌ అడాల్సిందే. చివరకు బాత్‌రూంలోకి వెళ్ళటప్పుడు కూడా దాన్ని వదలకుండా వెంట తీసికెళ్ళి వాటి ద్వారా కోట్ల బ్యాక్టీరియా తీసుకొస్తున్నాం.

ఒక్క బాత్ రూంలోనే కాదు బహిరంగా ప్రదేశాలైన చాలా చోట్ల ఫోన్‌లోకి బ్యాక్టీరియా చేరుతుంది. అలాగే ఫోన్ ఒక్కటే కాదు ఇతర గ్రాడ్జెట్ విషయాలలో కూడా ఇదే పరిస్థితి. ఏటిఎమ్‌లో నుంచి డబ్బు మాత్రం డ్రా చేసుకుని పట్టుకెళ్తున్నాము అనుకుంటే పొరపాటే, ఆ డబ్బుతో పాటు బోలెడంత బ్యాక్టిరియా కూడా తీసుకెళ్తున్నాము. బ్రిటన్ శాస్త్రవెత్తలు జరిపిన పరిశోధనల్లో ఈ విషయం తేలింది. ఏటీఎంల కీ ప్యాడ్‌లపై ఉన్న దుమ్మును సేకరించి వాటిని పరిశీలించగా పబ్లిక్ టాయిలేట్‌ నమునాలలో ఉండే బ్యాక్టీరియాతో సమానంగా వాటి నమునాలు ఉన్నట్లు తేలింది.కేవలం ఫోన్, ఏటీఎం మాత్రమే కాదు. డెస్క్‌టాప్స్, ట్యాబ్లెట్స్ డోర్స్, లాప్‌టాప్స్ కరెన్సీ ఇలా దైనందిన జీవతంలో ఉపయోగించి ప్రతి వస్తువుల్లొ బ్యాక్టీరియా చేరి ఉంటుంది.

Show Full Article
Print Article
Next Story
More Stories