Asthma: ఈ తప్పుల వల్ల ఆస్తమా ఎఫెక్ట్‌ అవుతోంది.. అవేంటంటే..?

Youngsters are getting asthma because of their own mistakes learn how
x

Asthma: ఈ తప్పుల వల్ల ఆస్తమా ఎఫెక్ట్‌ అవుతోంది.. అవేంటంటే..?

Highlights

Asthma: ఈ తప్పుల వల్ల ఆస్తమా ఎఫెక్ట్‌ అవుతోంది.. అవేంటంటే..?

Asthma: ప్రజల జీవితాల్లో చాలా మార్పులు వచ్చాయి. మనుషులు ప్రకృతి నుంచి తమను తాము వేరు చేసుకుంటున్నారు. దీనివల్ల కొత్త కొత్త వ్యాధులు సంభవిస్తున్నాయి. కరోనా, మంకీఫాక్స్‌ వంటి రోగాలు వేగంగా విస్తరిస్తున్నాయి. అంతేకాదు వాతావరణం పూర్తిగా కలుషితమవుతోంది. ఈ కారణంగా నేడు భారతదేశంలో సుమారు 20 మిలియన్ల మంది ఆస్తమా రోగులు ఉన్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) ఈ విషయాన్ని వెల్లడించింది. జాగ్రత్తగా ఉండకపోతే ఈ ప్రాణాంతక వ్యాధి పెరుగుతూనే ఉంటుంది.

నేటి కాలంలో నగరాల నుంచి రోజుకు ఒక మిలియన్ టన్నుల చెత్త ఉత్పత్తి అవుతుంది. వీటిని చాలా చోట్ల ఆలోచించకుండా కాల్చుతున్నారు. దీని నుంచి వెలువడే కలుషిత పొగ ఊపిరితిత్తులని దెబ్బతీస్తుంది. దీనివల్ల శ్వాస తీసుకోవడం కష్టమవుతుంది. చాలామంది ఆస్తమా బారిన పడుతున్నారు. మీ ఊపిరితిత్తులు మీ హృదయాన్ని, మనస్సును బలంగా ఉంచడంలో సహాయపడతాయి. మీరు స్వచ్ఛమైన ఆక్సిజన్ తీసుకున్నప్పుడు మీ మెదడు చురుకుగా పనిచేస్తుంది. మీరు రోజంతా మంచి అనుభూతి చెందుతారు.

మరోవైపు సిగరెట్, బీడీ, హుక్కా వంటి పొగ స్వచ్ఛమైన ఆక్సిజన్‌ను కూడా విషపూరితం చేస్తుంది. దీని కారణంగా ఊపిరితిత్తులు అధ్వాన్నంగా మారుతున్నాయి. చాలామంది ఉబ్బసం బారిన పడుతున్నారు. రోజూ ఆఫీసుకు వెళ్లేవాళ్లు, స్కూలు, కాలేజీలకు వెళ్లే విద్యార్థులకు ఊపిరితిత్తుల సమస్యలతో బాధపడుతున్నారు. యువతలో చాలా మంది సిగరెట్ తాగుతూ ఉంటారు. దీనివల్ల చాలా నష్టం జరుగుతుంది. ముఖ్యంగా చాలామంది ఆస్తమా పేషెంట్లుగా మారుతున్నారు. వీరు ప్రతిరోజూ దాదాపు 500 మీటర్లు నడవాలి. పరుగెత్తాలి మీకు సమయం లేకపోతే మంచి శ్వాస కోసం ఇంట్లో యోగా చేయాలి. ఇది మీ ఊపిరితిత్తులను ఆరోగ్యంగా ఉంచుతుంది.

Show Full Article
Print Article
Next Story
More Stories