నీళ్లు ఎక్కువ తాగితే ప్రమాదమా..!

నీళ్లు ఎక్కువ తాగితే ప్రమాదమా..!
x
Highlights

అతి అనర్ధానికి చేటు.. అంటారు పెద్దలు. అవును అతిగా చేసిన పని వల్ల ప్రమాదాలు వచ్చే అవకాశం ఉందని అధ్యయనాలు చెబుతున్నాయి. అతిగా నీళ్లు తాగడం కూడా ఇలాంటిదే...

అతి అనర్ధానికి చేటు.. అంటారు పెద్దలు. అవును అతిగా చేసిన పని వల్ల ప్రమాదాలు వచ్చే అవకాశం ఉందని అధ్యయనాలు చెబుతున్నాయి. అతిగా నీళ్లు తాగడం కూడా ఇలాంటిదే అంటున్నాయి అధ్యయనాలు. నీళ్లు తాగడం శరీరానికి చాల మంచిది. అయిదే అతిగా నీరు తాగితే.. ప్రణాలనే ముప్పు వాటిల్లే అవకాశం ఉందని తాజా అధ్యయనంలో బయటపడింది.

ఆస్ట్రేలియాలోని మోనాష్ వర్శిటీ శాస్త్రవేత్తలు ఇటీవల నిర్వహించిన పరిశోధనలో సంచలన విషయాలు వెలుగులో వచ్చాయి. రోజుకు ఎనిమిది గ్లాసుల నీళ్లు తీసుకున్నా శరీరంపై ప్రతికూల ప్రభావమే చూపుతుందని వారి పరిశోధనలో తేలింది.

వీరి పరిశోధనలో భాగంగా కొంతమందిని తీసుకుని అందులో సగం మందికి దాహం వేసినప్పుడు మాత్రమే వాటర్ తాగామన్నారు. మిగతా సగం మందిని అధికంగా నీళ్లు తాగాలని సూచించారు. తరువాత వారి ఎంఆర్ఐ తీసి చూడగా.. అందులో నీళ్లు అధికంగా తాగిన వ్యక్తుల మెదడులోని ఫ్రీ ఫ్రంటల్ ప్రాంతాలు ఎంతో చురుగ్గా ఉన్నట్లు గుర్తించారు.

అయితే అటువంటి వారు ఏదైనా తినాలన్నా.. నమలడానికి చాలా కష్టపడాల్సి వస్తుందట. ఈ సమస్య ఏర్పడితే శరీరంలోని ఫ్లూయిడ్స్ పలచబడే అవకాశం ఉందట. దీని ఫలితంగా సోడియం ప్రమాణాలు పడిపోతాయట. దీనివల్ల కొన్నిసార్లు స్పృహతప్పి పడిపోతారు. పరిస్ధితి విషమిస్తే కోమాలోకి కూడా వెళ్లే పరిస్థితులు వస్తాయి అంటున్నారు శాస్త్రవేత్తలు. అందుకే మనిషి దాహం వేసినప్పుడు మాత్రమే వాటర్ తాగాలని వారు హెచ్చరిస్తున్నారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories