Hot Water or Cold Water: చలికాలంలో వేడి నీళ్లు మంచివా.. చలి నీళ్లు మంచివా? నిపుణుల సూచనలు ఇవే

Hot Water or Cold Water
x

Hot Water or Cold Water: చలికాలంలో వేడి నీళ్లు మంచివా.. చలి నీళ్లు మంచివా? నిపుణుల సూచనలు ఇవే

Highlights

Hot Water or Cold Water: చలికాలం వచ్చిందంటే చాలు చలి తీవ్రతతో ఉదయం నిద్ర లేవడం నుంచి స్నానం చేయడం వరకూ అన్నీ కష్టంగానే అనిపిస్తాయి.

Hot Water or Cold Water: చలికాలం వచ్చిందంటే చాలు చలి తీవ్రతతో ఉదయం నిద్ర లేవడం నుంచి స్నానం చేయడం వరకూ అన్నీ కష్టంగానే అనిపిస్తాయి. అందుకే చాలామంది ఈ సీజన్‌లో చన్నీళ్లకన్నా వేడి నీళ్లతోనే స్నానం చేయడానికి ఇష్టపడుతుంటారు. అయితే చలికాలంలో వేడి నీటితో స్నానం చేయడం అంత మంచిది కాదని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.

వేడి నీటితో స్నానం చేయడం వల్ల శరీరానికి తాత్కాలికంగా హాయిగా అనిపించినా, దీర్ఘకాలంలో చర్మానికి నష్టం కలిగే అవకాశముందని చెబుతున్నారు. వేడి నీరు చర్మంపై సహజంగా ఉండే తేమ పొరను తొలగించడంతో చర్మం పొడిబారిపోవడం, దురద రావడం, అలర్జీలు పెరగడం వంటి సమస్యలు తలెత్తుతాయని వైద్యులు పేర్కొంటున్నారు.

ముఖ్యంగా పాలిసిథెమియా వెరా వంటి వ్యాధులు ఉన్నవారు వేడి నీటితో స్నానం చేసేటప్పుడు మరింత జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు. ఈ వ్యాధిలో శరీరం అవసరానికి మించి ఎర్ర రక్త కణాలను ఉత్పత్తి చేయడం వల్ల చర్మం ఎర్రగా మారడం, మంటగా అనిపించడం జరుగుతుందని నిపుణులు వివరిస్తున్నారు. వేడి నీటితో స్నానం చేస్తే ఈ లక్షణాలు మరింత పెరిగే ప్రమాదం ఉందంటున్నారు.

అలాగే చన్నీళ్లతో స్నానం చేసినా శరీరానికి షాక్‌లా అనిపించి జలుబు, దగ్గు వంటి సమస్యలు రావచ్చని చెబుతున్నారు. అందుకే ఈ రెండింటి మధ్యలో ఉన్న గోరు వెచ్చని నీటితో స్నానం చేయడం ఉత్తమం అని వైద్యులు సూచిస్తున్నారు. ఇది శరీరానికి హాని చేయకుండా శుభ్రతను అందిస్తుందని అంటున్నారు.

ముఖ్య గమనిక: ఈ కథనంలోని సమాచారం ఇంటర్నెట్‌లో లభ్యమైన ఆరోగ్య సమాచారంపై ఆధారపడి ఉంది. ఇది కేవలం అవగాహన కోసం మాత్రమే. ఎలాంటి ఆరోగ్య సమస్యలైనా ఉన్నట్లయితే నేరుగా వైద్యులను సంప్రదించి వారి సూచనల మేరకు వ్యవహరించడం మంచిది.

Show Full Article
Print Article
Next Story
More Stories