ఆందోళన వద్దు.. సంపాదించేది శాశ్వతం కాదు

ఆందోళన వద్దు.. సంపాదించేది శాశ్వతం కాదు
x
Highlights

నేటి ఉరుకుల పరుగుల జీవితంలో నిశ్చింతగా, ప్రశాంతంగా, ఆనందంగా చిరునవ్వులు చిందిస్తూ జీవితాన్ని ఆస్వాదించేవారు చాలా తక్కువగా ఉన్నారు. అందరి మనసులో ఏదో...

నేటి ఉరుకుల పరుగుల జీవితంలో నిశ్చింతగా, ప్రశాంతంగా, ఆనందంగా చిరునవ్వులు చిందిస్తూ జీవితాన్ని ఆస్వాదించేవారు చాలా తక్కువగా ఉన్నారు. అందరి మనసులో ఏదో అసంతృప్తి, ఆందోళన, భయం, భవిష్యత్తు గురించి భయపడుతూ కూర్చోవడం సాధారణమైపోతోంది. దీనికి ప్రధాన కారణం మన ఆలోచనా విధానమే అంటున్నారు.నిపుణులు. ఊహ కంటే వాస్తవికతను నమ్ముకుంటే ఆ చింతలేవీ ఉండవు. ఆ నిర్భయత్వాన్ని సాధించడానికి ఉత్తమమైన మార్గం అదే.

ఈ ప్రపంచంలో ఏదీ శాశ్వతం కాదు. అన్నీ కదిలిపోయే మేఘాలవంటివే. వస్తువులు, సంపదలు, సిరిసంపదలు అన్నవి సంపూర్ణ సత్యాలు కాదు.వాస్తవం అని భ్రమిస్తున్న, ప్రేమిస్తున్న, అహర్నిశలూ మనవారికోసం శ్రమిస్తున్న ఈ జీవితం నుంచి కొంతకాలానికి తప్పుకోక తప్పదు. జగత్తు ఒక నాటకరంగం అందులో మనందరం విభిన్న పాత్రధారులం మాత్రమే ఈ నాటకంలో మన పాత్ర ముగిశాక తెరవెనక్కి చేరాల్సిందే. ఈ జీవితం నాటకంలో ఒక వేషం మాత్రమే.పాత్రదారైనా మనం సూత్రధారిగా భావించి తానే అన్నీ అనుకోవడం వల్ల కలిగే అనర్థాలే మన బాధలకు, అనిశ్చితికి, భీతికి కారణం.

ఎంత కోటిశ్వరుడైన అనుక్షణం భీతితో, ఆందోళనతో, అనిశ్చితితో భయంభయంగా చస్తూ బతుకుతున్నాడు. రోజూ రాత్రిపూట నిద్ర పట్టక..సతమతమవుతున్నాడు. సంపదించిన దాని కోసం కష్టపడుతూ దాన్ని కాపాడుకోవడం కోసం అడ్డదారులు తోక్కుతూ బతికేస్తున్నాడు. మనం ఎలా ఉండకూడదో, ఎలా ఆలోచించాలో, ఏం నేర్చుకోవాలో ధృతరాష్ట్రుని జీవితాన్ని చూసి తెలుసుకోవాలి. అన్నింటి కన్నా వైరాగ్యం ఉత్కృష్టమైనదని అర్థం చేసుకోవాలి. జీవితం శ్వాశతం కాదనే సత్యాన్ని గ్రహించాలి.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories