Rose Tea : మామూలు టీ వదిలేసి.. రోజ్ టీ తాగితే ఎన్ని లాభాలో తెలుసా?

Rose Tea : మామూలు టీ వదిలేసి.. రోజ్ టీ తాగితే ఎన్ని లాభాలో తెలుసా?
x

Rose Tea : మామూలు టీ వదిలేసి.. రోజ్ టీ తాగితే ఎన్ని లాభాలో తెలుసా?

Highlights

అందానికి, ప్రేమకు చిహ్నమైన గులాబీ పువ్వుకు ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. అందుకే గులాబీ రేకులను వివిధ వంటకాలు, స్వీట్లు, శీతల పానీయాలు, సౌందర్య ఉత్పత్తులలో ఉపయోగిస్తారు. అంతేకాకుండా, గులాబీ పువ్వులతో టీ కూడా తయారు చేసుకోవచ్చు.

Rose Tea : అందానికి, ప్రేమకు చిహ్నమైన గులాబీ పువ్వుకు ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. అందుకే గులాబీ రేకులను వివిధ వంటకాలు, స్వీట్లు, శీతల పానీయాలు, సౌందర్య ఉత్పత్తులలో ఉపయోగిస్తారు. అంతేకాకుండా, గులాబీ పువ్వులతో టీ కూడా తయారు చేసుకోవచ్చు. ఈ టీలో యాంటీఆక్సిడెంట్లు, ఐరన్, విటమిన్ ఏ, విటమిన్ సీ, విటమిన్ ఈ వంటి పోషకాలు పుష్కలంగా ఉంటాయి. మామూలు టీ బదులు రోజూ ఈ గులాబీ టీ తాగడం వల్ల బరువు తగ్గడం నుంచి గుండె ఆరోగ్యం వరకు అనేక లాభాలు పొందవచ్చు.

గులాబీ టీ వల్ల కలిగే ప్రయోజనాలు

బరువు తగ్గడానికి సహాయం: గులాబీ టీలో ఉండే యాంటీఆక్సిడెంట్లు, విటమిన్ సీ జీర్ణక్రియను మెరుగుపరుస్తాయి. జీవక్రియను వేగవంతం చేస్తాయి. ఇది శరీరంలో కొవ్వు పేరుకుపోకుండా నిరోధిస్తుంది. బరువు తగ్గడానికి సహాయపడుతుంది.

చర్మం మెరుపు పెంచడానికి: గులాబీలో ఉండే విటమిన్ సీ చర్మంలో కొల్లాజెన్ ఉత్పత్తికి సహాయపడుతుంది. ఇది చర్మాన్ని బిగుతుగా చేసి యవ్వనంగా కనిపించేలా చేస్తుంది. రోజ్ టీ తాగడం వల్ల ముఖం మీద ఉండే మచ్చలు తగ్గి ముఖం మెరుపు పెరుగుతుంది.

ఒత్తిడి తగ్గించడానికి: రోజ్ టీలో ఉండే యాంటీఆక్సిడెంట్లు ఒత్తిడిని తగ్గించడానికి సహాయపడతాయి. ఇది మానసిక స్థితిని మెరుగుపరుస్తుంది. నిద్ర నాణ్యతను కూడా పెంచుతుంది. మీరు ఒత్తిడి నుంచి బయటపడాలనుకుంటే, రోజూ గులాబీ టీ తాగండి.

రోగనిరోధక శక్తిని పెంచడానికి: గులాబీ టీలో అధిక మొత్తంలో యాంటీఆక్సిడెంట్లు, విటమిన్లు ఉంటాయి. ఇవి సహజంగానే రోగనిరోధక శక్తిని బలోపేతం చేస్తాయి. దీనిలోని పోషకాలు శరీరాన్ని బయటి ఇన్ఫెక్షన్ల నుంచి రక్షిస్తాయి. జలుబు, దగ్గు వంటి సమస్యల నుంచి ఉపశమనం కలిగిస్తాయి.

జీర్ణ వ్యవస్థను బలోపేతం చేయడానికి: రోజ్ టీ తాగడం వల్ల మన జీర్ణ వ్యవస్థ బలోపేతం అవుతుంది. దీనిలో ఉండే యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు జీర్ణక్రియను మెరుగుపరుస్తాయి. దీనిని తాగడం వల్ల గ్యాస్, అజీర్ణం, మలబద్ధకం మరియు అసిడిటీ వంటి సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది.

గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరచడానికి: గులాబీ టీలో ఉండే యాంటీఆక్సిడెంట్లు గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి. ఇది రక్తపోటును నియంత్రించి, కొలెస్ట్రాల్ స్థాయిలను అదుపులో ఉంచుతుంది.

గులాబీ టీ ఎలా తయారు చేయాలి?

ముందుగా ఒక కప్పు నీటిని మరిగించాలి. అందులో కొన్ని ఎండిన గులాబీ రేకులను వేసి 5-7 నిమిషాలు మరిగించాలి. ఆ తర్వాత వడపోసి వేడిగా తాగాలి. మీరు దీనిలో తేనె లేదా నిమ్మరసం కూడా కలుపుకోవచ్చు.

గమనించాల్సిన విషయాలు

గర్భిణీలు, పాలిచ్చే మహిళలు రోజ్ టీ తాగే ముందు వైద్యుడిని సంప్రదించాలి. కొంతమందికి గులాబీతో అలర్జీ ఉండవచ్చు. కాబట్టి ఉపయోగించే ముందు ప్యాచ్ టెస్ట్ చేసుకోవడం ముఖ్యం.

Show Full Article
Print Article
Next Story
More Stories