Lifestyle: మీరు కూడా బాత్‌రూమ్‌లో బ్రష్‌ పెడుతున్నారా.? ఏమవుతుందో తెలుసా..?

Why You Should Never Keep Your Toothbrush in the Bathroom Expert Warning
x

Lifestyle: మీరు కూడా బాత్‌రూమ్‌లో బ్రష్‌ పెడుతున్నారా.? ఏమవుతుందో తెలుసా..?

Highlights

Lifestyle: మనం తెలిసో తెలియకో చేసే కొన్ని తప్పులు అనారోగ్యానికి కారణమవుతాయని నిపుణులు చెబుతుంటారు.

Lifestyle: మనం తెలిసో తెలియకో చేసే కొన్ని తప్పులు అనారోగ్యానికి కారణమవుతాయని నిపుణులు చెబుతుంటారు. ఇలాంటి వాటిలో మనం ఉపయోగించే బ్రష్‌ ఒకటి. మనలో చాలా మంది బ్రష్‌లను బాత్‌రూమ్‌లో పెడుతుంటారు. అయితే దీనివల్ల ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం పడుతుందని మీకు తెలుసా.? ఇంతకీ బ్రష్‌లను బాత్‌రూమ్‌లో పెడితే ఎలాంటి సమస్యలు వస్తాయో ఇప్పుడు తెలుసుకుందాం.

టాయిలెట్‌కి దగ్గరా బ్రష్‌లను ఉంచితే వాటిపై అనేక రకాల క్రిములు చేరే ప్రమాదం ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. టాయిలెట్‌ ఫ్లష్‌ చేసినప్పుడు, సూక్ష్మ కణాలు గాలిలోకి ఎగిరిపోతాయి. ఇవి టూత్‌ బ్రష్‌ వంటి వస్తువులపై పడుతాయి. దీంతో టూత్ బ్రష్‌పై ఈ కోలీ, స్ట్రెప్టోకోకస్ వంటి బ్యాక్టీరియా చేరుతాయి. ఇలాంటి బ్రష్‌లను ఉపయోగిస్తే ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం పడుతుంది.

యాంటీ బాక్టీరియల్ మౌత్ వాష్ లేదా హైడ్రోజన్ పెరాక్సైడ్‌లో 10 నిమిషాల పాటు బ్రష్‌ను నానబెట్టండి. ఇది బ్యాక్టీరియాను తొలగించడంలో సహాయపడుతుంది. మనలో చాలా మంది నెలలు తరబడి ఒకటే బ్రష్‌ను ఉపయోగిస్తుంటారు. అయితే కచ్చితంగా కనీసం 3 నెలలకొకసారి బ్రష్‌ మార్చాలని సూచిస్తున్నారు. బ్రష్‌ను టాయిలెట్‌కు 6 అడుగుల దూరంలో ఉంచాలి. బ్రష్‌లను కవర్‌ చేసే క్యాప్‌లు అందుబాటులో ఉంటాయి. వాటిని ఉపయోగించాలి.

అయితే పూర్తిగా కవర్‌ అయ్యేవి కాకుండా వెంటిలేషన్ ఉండే సిలికాన్ క్యాప్‌ను వాడండి. ఇది బ్రష్‌ తేమగా ఉండకుండా చేయడంలో ఉపయోగపడతాయి. ఈ సింపుల్‌ చిట్కాలను పాటించడంతో పాటు రెగ్యులర్‌గా బ్రష్‌ మారిస్తే ఎలాంటి సమస్యలు రావని నిపుణులు సూచిస్తున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories