నిద్రపట్టినట్టు అనిపించకపోతే ఇదో గ్లాసు తాగండి

నిద్రపట్టినట్టు అనిపించకపోతే ఇదో గ్లాసు తాగండి
x
Highlights

నిద్ర పట్టని వారికి ఎదురయే సమస్య చికాకు, కోపం, పరాకు, ఒత్తిడి. ఏపనిపైనా శ్రధ్ద ఉండదు. దీనికి కారణం శరీరంలో నీటి శాతం తగ్గుతుండటమే కారణమని అధ్యయనాలు...

నిద్ర పట్టని వారికి ఎదురయే సమస్య చికాకు, కోపం, పరాకు, ఒత్తిడి. ఏపనిపైనా శ్రధ్ద ఉండదు. దీనికి కారణం శరీరంలో నీటి శాతం తగ్గుతుండటమే కారణమని అధ్యయనాలు చెబుతున్నాయి. రోజులో కనీసం 6 గంటల కన్నా తక్కువసేపు నిద్రపోయే పెద్దవాళ్ళలో నీటి శాతం 59% తగ్గే అవకాశం ఉన్నట్లుగా పరిశోధనలు తెలియజేస్తున్నాయి.

ఒంట్లో ఉండే నీటి శాతాన్ని మెదడులోని పీయూష గ్రంథి వాసోప్రెసిన్‌ నియంత్రిస్తోంది. శరీరంలో నీటిని ఎంత పరిమాణంలో పట్టి ఉంచాలో మూత్రపిండాలకు సంకేతాలు అందిస్తుంది. ఒకవేళ నిద్ర తగ్గితే సరైన సమయానికి ఈ హర్మోన్.. మూత్రపిండాలకు చేరుకోదు. దీంతో కిడ్నీలు నియంత్రణను కోల్పోతాయి. నీరు బయటకు వెళ్ళిపోవడంతో డీహైడ్రేషన్‌ కలుగుతుంది. అందుకే రాత్రి పూట కంటి నిండా నిద్రపోవడం మంచిది. అరోజు సరిగా నిద్రపట్టినట్లు మీకు అనిపించకపోతే నిద్ర లేవగానే ఒక గ్లాసు నీళ్లు తాగటం ఉత్తమం. దీంతో నీటిశాతం వల్ల వచ్చే దుష్ప్రభావాల నుంచి తప్పించుకోవచ్చు.

సంపూర్ణ ఆరోగ్యానికి నిద్ర చాలా అవసరం. కంటి నిండా నిద్రపోవడం వల్ల శరీరం తిరిగి శక్తిని కూడగట్టుకుంటుంది. ఆ రోజంతా ఉత్సాహంతో పనిచేస్తారు. ముఖ్యంగా పెద్దవాళ్ళకు చాలా కీలకం. వారి శరీరం ఎక్కువగా విశ్రాంతిని కోరుకుంటుంది. సరైన సమయంలో నిద్ర, తిండి ఉండాలి. రోజూ ఎన్ని పనులున్నా ఒకే సమయానికి పడుకుని నిద్రపోవడం అలవాటు చేసుకోవాలి. పడుకునేటప్పుడు నిద్రపట్టకపోతే పుస్తకం చదవటం వంటివి చేయాలి. అప్పుడు ఆటోమేటిగ్గా మీ శరీరం విశ్రాంతిని కోరుకుంటుంది. నిద్ర ముంచుకువస్తుంది.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories