మనుషులపై దాడి చేసే షార్క్‌లు ఇవే..!

మనుషులపై దాడి చేసే షార్క్‌లు ఇవే..!
x
Highlights

మనుషులపై షార్క్‌ల దాడుల సంఖ్య ప్రపంచవ్యాప్తంగా పెరుగుతోంది. 20 ఏళ్ల క్రితం నాటితో పోల్చితే తూర్పు అమెరికా, దక్షిణ ఆస్ట్రేలియాలో షార్క్ దాడుల సంఖ్య ...

మనుషులపై షార్క్‌ల దాడుల సంఖ్య ప్రపంచవ్యాప్తంగా పెరుగుతోంది. 20 ఏళ్ల క్రితం నాటితో పోల్చితే తూర్పు అమెరికా, దక్షిణ ఆస్ట్రేలియాలో షార్క్ దాడుల సంఖ్య దాదాపు రెండింతలైనట్లు అధ్యయనాలు చెబుతున్నాయి. సముద్రంలోకి వెళ్లే జనాల సంఖ్య పెరగడం కూడా దాడులు పెరుగడానికి కారణం అవచ్చు అంటున్నాయి అధ్యయనాలు.

అయితే, షార్క్‌లు మనుషులను వేటాడుతున్నాయనడానికి పెద్దగా ఆధారాలు లేవని శాస్త్రవేత్తలు అంటున్నారు. మనుషులపై దాడులు చేసే షార్క్‌ జాతులు చాల ఉన్నాయి. అయితే, వీటిలో ప్రధానమైనవి గ్రేట్ వైట్, టైగర్, బుల్ షార్క్‌లు. గ్రేట్ వైట్‌లపై హాలీవుడ్‌లో మూవీలు కూడా వచ్చాయి. టైగర్, బుల్ షార్క్‌లు పోలిస్తే గ్రేట్ వైట్ పూర్తిగా భిన్నమైన జీవి.

బుల్ షార్క్‌లు చీకటిగా ఉండే లోతైన జలాల్లో వేటాడేందుకు ఇష్టపడతాయి. అవి తమ చూపుపై పెద్దగా ఆధారపడవు. వాసన, ఎలక్ట్రోసెప్షన్ సామర్థ్యాలను బాగా ఉపయోగించుకుంటాయి. వైట్ షార్క్‌లు మాత్రం స్పష్టంగా, బాగా కనిపించే జలాల్లో వేటాడతాయి. వాటి దృష్టి సామర్థ్యం మెరుగ్గా ఉంటుంది. అలాగే టైగర్, వైట్ షార్క్‌లు చాలా వేగంగా కదులుతుంటాయియట. గ్రేట్ వైట్స్ సాధారణంగా అడుగు నుంచి వచ్చి దాడి చేస్తాయి. కొన్నిసార్లు అవి దాడి చేసి వెనక్కి వెళ్లిపోతాయి. ఆ తర్వాత కొద్దిసేపటికి వేటాడిన జీవిని తినేందుకు వచ్చే అవకాశం ఉందని అధ్యయనాలు చెబుతున్నాయి. పౌర్ణమి రాత్రి సమయంలో గ్రేట్ వైట్ షార్క్‌లు కనిపించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని మరో అధ్యయనంలో తేలింది.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories