వ్యాయమం తరువాత వాటర్ తాగుతున్నారా..!

వ్యాయమం తరువాత వాటర్ తాగుతున్నారా..!
x
Highlights

నేటి ఉరుకులు, పరుగుల జీవితంలో అంతా యాంత్రికమైంది. నెమ్మదిగా కూర్చుని నాలుగు మెతుకులు తినే సమయం కూడా లేకుండా పోతోంది. ఉదయం నుంచి రాత్రి వరకు కుర్చీలకు...

నేటి ఉరుకులు, పరుగుల జీవితంలో అంతా యాంత్రికమైంది. నెమ్మదిగా కూర్చుని నాలుగు మెతుకులు తినే సమయం కూడా లేకుండా పోతోంది. ఉదయం నుంచి రాత్రి వరకు కుర్చీలకు అతుక్కుపోయే ఉద్యోగాలతో, టెన్షన్లులు, అనేక సమస్యలతో చాలమంది నలిగిపోతున్నాడు. మానసిక ఒత్తిళ్లకు గురవుతూ అనారోగ్యంపాలవుతున్న వారు ఉన్నారు. ఇలాంటి వారికి యోగ మరియు వ్యాయామం ఎంతో ఉపయోగంగా ఉంటోంది. వ్యాయామం శరీరంగా మరియు మానసికంగా ఎంతో ఉపయోగపడుతుదంటున్నారు నిపుణులు.

చాల మంది శరీరం అలసిపోయేట్టు వ్యాయామం చేసిన తరువాత మంచినీళ్ళు తాగుతారు. ఇలా వాటర్ తాగటం వల్ల కండరాల నొప్పులు ఉండవని నమ్ముతారు. అయితే వ్యాయామం తరువాత మంచి నీరు తాగితే కండరాలు, కీళ్ళ నొప్పులు మరింత పెరుగుతాయని పరిశోధకులుంటున్నారు. అయితే వాటర్ బదులు ఎలక్ట్రాల్ వంటి డ్రింక్స్ తాగడం మంచిదంటున్నారు. వీటిలోని మినరల్స్ నొప్పుల నివారిణిగా పని చేస్తాయని చెబుతున్నారు.

వీరు పది మంది యువతీ యువకుల మీద పరిశోధన నిర్వహించారు. వీరిని ట్రెడ్మిల్ మీద నడిపించి వాళ్ళు చెమటలు కక్కేంతవరకు వ్యాయామం చేయించారు. వీరిలో కొంతమందికి నార్మల్ వాటర్‌ను, మరికొంతమందికి ఎలక్ట్రో లైట్స్‌తో కూడిన పానీయాలను ఇచ్చి చూసినప్పుడు తేడా స్పష్టంగా కనిపించింది. ఈ పానీయాల్లో సాల్ట్, పొటాషియం. బైకార్బొనేట్, క్లోరైడ్ వంటి మినరల్స్ కారణంగా.. వీటిని తాగినవారు ఎలాంటి నొప్పుల బారిన పడకుండా ఉన్నట్టు తేలింది. వ్యాయామం అనంతరం ఎలక్ట్రాల్ వంటి డ్రింకులు తాగడమే మంచిదంటున్నారు పరిశోధకులు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories