Tea Side Effects : ఖాళీ కడుపుతో టీ తాగుతున్నారా? అయితే ఈ 7 ఆరోగ్య సమస్యలు వచ్చే ప్రమాదం ఉంది.. జాగ్రత్త

Tea Side Effects
x

Tea Side Effects : ఖాళీ కడుపుతో టీ తాగుతున్నారా? అయితే ఈ 7 ఆరోగ్య సమస్యలు వచ్చే ప్రమాదం ఉంది.. జాగ్రత్త 

Highlights

Tea Side Effects : చాలామందికి టీ అనేది కేవలం ఒక పానీయం మాత్రమే కాదు, అది వారి రోజువారీ దినచర్యలో ముఖ్యమైన భాగం.

Tea Side Effects : చాలామందికి టీ అనేది కేవలం ఒక పానీయం మాత్రమే కాదు, అది వారి రోజువారీ దినచర్యలో ముఖ్యమైన భాగం. ఉదయం నిద్ర లేవగానే టీ తాగడం చాలా మందికి అలవాటు. టీ తాగితేనే శక్తి వస్తుందని, అప్పుడే తమ పనులు మొదలవుతాయని భావిస్తారు. అయితే, ఉదయం ఖాళీ కడుపుతో టీ తాగడం మనస్సుకు తాత్కాలిక సంతోషాన్ని ఇవ్వచ్చు కానీ, ఆరోగ్య నిపుణుల ప్రకారం ఈ అలవాటు ఆరోగ్యానికి హానికరం.

ఈ 7 ఆరోగ్య సమస్యలు ఉన్నవారు టీ తాగకూడదు

టీ ఆకులలో కెఫిన్, టానిన్స్ ఉంటాయి. టీలో పాలు, చక్కెర కలపడం వల్ల తాత్కాలికంగా శక్తి లభిస్తుంది, కానీ వాస్తవానికి అవి శరీర జీవక్రియ పై ప్రతికూల ప్రభావాన్ని చూపుతాయి. ముఖ్యంగా ఈ కింద పేర్కొన్న 7 రకాల ఆరోగ్య సమస్యలు ఉన్నవారు ఉదయం ఖాళీ కడుపుతో టీ తాగడం పూర్తిగా మానుకోవాలి.

రక్తహీనత : టీలో ఉండే ఖనిజాలు శరీరంలో ఐరన్ (ఇనుము) శోషణకు అడ్డుపడతాయి.

అతిగా జుట్టు రాలడం: జుట్టు విపరీతంగా రాలిపోయే సమస్య ఉన్నవారు.

మధుమేహం : షుగర్ లెవల్స్‌పై టీ ప్రభావం చూపిస్తుంది.

PCOS (పాలీసిస్టిక్ ఓవరీ సిండ్రోమ్): హార్మోన్ల సమస్య ఉన్న మహిళలు.

ఆందోళన/ ఒత్తిడి: కెఫిన్ వల్ల ఆందోళన పెరిగే అవకాశం ఉంది.

అధిక రక్తపోటు : గుండె కొట్టుకునే వేగం పెరుగుతుంది.

హైపోథైరాయిడిజం: థైరాయిడ్ సమస్య ఉన్నవారు.

ఖాళీ కడుపుతో టీ తాగడం వల్ల వచ్చే సమస్యలు

జీర్ణ సమస్యలు: టీలోని కెఫిన్, టానిన్స్ జీర్ణరసాల ఉత్పత్తిని ప్రభావితం చేస్తాయి. దీని వల్ల ఆహారం సరిగా జీర్ణం కాదు. కాలక్రమేణా ఇది తీవ్రమైన జీర్ణ సమస్యలకు దారితీయవచ్చు.

గుండెల్లో మంట, అసిడిటీ: ఖాళీ కడుపుతో టీ తాగడం వల్ల పొట్టలో యాసిడ్ స్థాయిలు పెరిగిపోతాయి. ఇది గ్యాస్, అసిడిటీ, గుండెల్లో మంట వంటి సమస్యలను కలిగిస్తుంది. ఇప్పటికే అసిడిటీ సమస్య ఉన్నవారు చాలా జాగ్రత్తగా ఉండాలి.

ఒత్తిడి, చికాకు: ఖాళీ కడుపుతో కెఫిన్ త్వరగా శరీరంలోకి ఇంకిపోతుంది. ఇది గుండె కొట్టుకునే వేగాన్ని పెంచి, చికాకు, ఒత్తిడికి కారణమవుతుంది.

రక్తంలో చక్కెర స్థాయిలపై ప్రభావం: ఖాళీ కడుపుతో టీ తీసుకోవడం వల్ల రక్తంలో షుగర్ లెవల్స్ ఒక్కసారిగా పెరగడం లేదా తగ్గడం జరగవచ్చు. ఇది మధుమేహ వ్యాధిగ్రస్తులకు ప్రమాదకరం.

Show Full Article
Print Article
Next Story
More Stories