జాగ్రత్త..! వీరు టీ తాగకూడదు

జాగ్రత్త..! వీరు టీ తాగకూడదు
x

జాగ్రత్త..! వీరు టీ తాగకూడదు

Highlights

టీ అంటే ఇష్టపడని వారు చాలా అరుదు. ఉదయం లేచినా, సాయంత్రం పనుల మధ్యలోనైనా చాలామందికి టీ ఒక మూడ్ రిఫ్రెషర్‌ లా ఉంటుంది. కొందరు రోజుకు రెండు, మూడు సార్లు తాగుతారు. మరికొందరు మాత్రం రోజుకు ఒకసారైనా తాగకుండా ఉండలేరు.

టీ అంటే ఇష్టపడని వారు చాలా అరుదు. ఉదయం లేచినా, సాయంత్రం పనుల మధ్యలోనైనా చాలామందికి టీ ఒక మూడ్ రిఫ్రెషర్‌ లా ఉంటుంది. కొందరు రోజుకు రెండు, మూడు సార్లు తాగుతారు. మరికొందరు మాత్రం రోజుకు ఒకసారైనా తాగకుండా ఉండలేరు. కానీ ఆరోగ్య నిపుణుల మాట ప్రకారం కొంతమంది మాత్రం టీ తాగకూడదు. మరి వారు ఎవరో చూద్దాం.

1. గుండె సమస్యలతో బాధపడేవారు

ఈ మధ్య గుండె సంబంధిత వ్యాధులు ఎక్కువవుతున్నాయి. హార్ట్ ప్రాబ్లమ్స్ ఉన్నవారు టీ తాగితే పరిస్థితి మరింత దిగజారే ప్రమాదం ఉంటుంది. కాబట్టి గుండె సమస్యలున్న వారు టీని పూర్తిగా మానేయాలని వైద్యులు సూచిస్తున్నారు.

2. రక్తహీనత ఉన్నవారు

రక్తహీనత (అనీమియా) సమస్యతో బాధపడుతున్నవారికి టీ అస్సలు వద్దు. ఎందుకంటే టీ వల్ల శరీరంలో ఐరన్ శోషణ తగ్గిపోతుంది. దీనివల్ల అలసట, నీరసం మరింత పెరుగుతాయి. కాబట్టి రక్తహీనత ఉన్న వారు టీ తాగకూడదు.

3. నిద్రలేమి సమస్య ఉన్నవారు

నిద్రలేమి (ఇన్సోమ్నియా)తో బాధపడుతున్నవారు టీ తాగితే పరిస్థితి మరింత కష్టతరం అవుతుంది. కాఫీన్ కారణంగా నిద్రకు ఆటకం కలిగి, ఒత్తిడి పెరిగే అవకాశం ఉంటుంది. అలాగే గర్భిణీలు కూడా టీకి దూరంగా ఉండాలని వైద్యులు హెచ్చరిస్తున్నారు.

4. జీర్ణ సమస్యలతో ఉన్నవారు

మలబద్ధకం, గ్యాస్, ఎసిడిటీ, కడుపు ఉబ్బరం వంటి సమస్యలు తరచుగా ఎదుర్కొనే వారు టీ తాగితే సమస్యలు పెరుగుతాయి. కాబట్టి జీర్ణ సమస్యలున్నవారు టీని పరిమితం చేయాలి లేదా పూర్తిగా మానేయాలి.

మొత్తంగా చెప్పాలంటే, టీ ఇష్టంగా తాగేవారు చాలా మందే ఉన్నా, పై పేర్కొన్న ఆరోగ్య సమస్యలున్న వారు మాత్రం టీకి దూరంగా ఉండటం మంచిదని నిపుణులు సూచిస్తున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories