తెల్లగా ఉండే ఆ పదార్థాలు విషంతో సమానమట..

తెల్లగా ఉండే ఆ పదార్థాలు విషంతో సమానమట..
x
Highlights

మీరు తెల్లటి పదార్థాలను తినడానికి ఇష్టపడుతున్నారా.. అయితే రోగాలపాలు కావడం తథ్యమని హెచ్చరిస్తున్నారు నిపుణులు. తెల్లటి ఆహార పదార్థాలను తినడానికి...

మీరు తెల్లటి పదార్థాలను తినడానికి ఇష్టపడుతున్నారా.. అయితే రోగాలపాలు కావడం తథ్యమని హెచ్చరిస్తున్నారు నిపుణులు. తెల్లటి ఆహార పదార్థాలను తినడానికి చాలమంది ఇష్టపడుతుంటారు. మనం రోజు తినే వాటిల్లో ఎక్కువగా తీసుకునేది కూడా తెల్లటి ఆహార పదార్థాలే. ఎక్కువ మంది తీసుకునే ఆహారం అన్నం. కొందరు అన్నం తెల్లగా ఉంటే తప్ప ముద్ద నోట్లోకి దిగదు. పాలు, పెరుగు, పిండి, చక్కెర, ఉప్పు వంటివి తెల్లగా ఉంటే వాటినే చాలమంది ఇష్టపడుతుంటారు. అయితే తెల్లగా ఉండే కొన్ని ఆహారపదార్థాలు విషంతో సమానమని చెబుతున్నారు పోషకాహార నిపుణులు. రిఫైన్డ్ పదార్థాల్లో పోషక విలువలు ఏమాత్రం ఉండవని, వీటిని ఎక్కువగా తింటే రోగాలబారిన పడే అవకాశం ఉందంటున్నారు.

తెల్లగా ఉండే చూయింగ్‌ గమ్‌లు, గుడ్డు, వెనిగర్‌తో తయారు చేసే క్రీములను నిత్యం తీసుకోవడం వల్ల కొలన్‌ క్యాన్సర్‌ (పేగులకు వచ్చే క్యాన్సర్‌) వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్లు పరిశోధనల్లో తేలింది. చూయింగ్‌ గమ్‌లో 'ఈ171' అనే పదార్థం ఉంటుంది. చూయింగ్‌ గమ్‌ తరచూ తినడం వల్ల వీటి నుంచి విడుదలయ్యే బ్యాక్టీరియా మన పేగుల్లోకి చేరుతుంది. దీనివల్ల క్రమంగా అది పేగులకు హాని చేస్తూ క్యాన్సర్‌గా మారుతుందని పరిశోధనలో తేలింది. ఆహారం పదార్థాలు తెలుపు రంగులో ఉండేందుకు 'ఈ171' పదార్థాన్ని వాడుతుంటారు. అందుకే 'ఈ171' వాడే పదార్థాలకు దూరంగా ఉండడమే మేలని నిపుణులు సూచిస్తున్నారు.


Show Full Article
Print Article
Next Story
More Stories