Rice vs Chapathis: రాత్రిపూట అన్నం, చపాతీ రెండిటిలో ఏది బెస్ట్‌..!

Which Is best Between Night Rice And Chapati Know Expert Advice
x

Rice vs Chapathis: రాత్రిపూట అన్నం, చపాతీ రెండిటిలో ఏది బెస్ట్‌..!

Highlights

Rice vs Chapathis: రాత్రిపూట అన్నం తినాలా, చపాతీ తినాలా అనే విషయంలో చాలామందికి కన్‌ఫ్యూజన్‌ ఉంటుంది.

Rice vs Chapathis: రాత్రిపూట అన్నం తినాలా, చపాతీ తినాలా అనే విషయంలో చాలామందికి కన్‌ఫ్యూజన్‌ ఉంటుంది. ఎవరు తినాలి ఎవరు తినకూడదనే దానిలో అస్సలు క్లారిటీ ఉండదు. నిజానికి నేటి కాలంలో మనం తీసుకునే ఫుడ్‌కి మనం చేసే పనికి పొంతన ఉండడం లేదు. ఎందుకంటే ఎక్కువగా తిని తక్కువగా పనిచేస్తున్నాం. అసలు సమస్య అంతా ఇక్కడే వస్తుంది. నిత్యం శారీరక శ్రమ చేసేవారు మూడు పూటలా అన్నం తినవచ్చు. కానీ గంటల తరబడి కూర్చొని, ఏసీలో ఉండే వారికి ఇది వర్తించదు. వీరు ప్రత్యామ్నాయం వెతుక్కోవాల్సిందే.

ఈ మధ్య ఊబకాయం, ఒబేసిటీ సమస్యలు చాలా మందిని వేధిస్తున్నాయి. రెగ్యులర్ డైట్‌లో క్యాలరీలు ఎక్కువగా తీసుకోవడం, శారీరిక శ్రమ లేకపోవడం, టైంకి తినకపోవడం వల్ల ఈ ఆరోగ్య సమస్యలు తలెత్తుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో మధ్యాహ్నం అన్నం తిన్నా పర్వాలేదు కానీ రాత్రి చపాతీ తినమని వైద్యులు సలహా ఇస్తున్నారు. ఎందుకంటే చ‌పాతీల‌ను త‌యారు చేసే గోధుమ‌పిండిలో విట‌మిన్ బీ, ఇ, కాల్షియం, ఐర‌న్‌, జింక్‌, సోడియం, పోటాషియం, మెగ్నిషియం వంటివి పుష్కలంగా ఉంటాయి. ఇవి శరీరానికి కావాల్సినంత శక్తిని అందిస్తాయి.

పైగా వైట్ రైస్ కంటే చపాతీలు త్వరగా జీర్ణమవుతాయి. వీటిని కాల్చేటప్పుడు తక్కువ నూనె వాడుతారు కాబట్టి అన్నంతో పోలిస్తే క్యాలరీలు తక్కువ ఉంటాయి. రెండు లేదా మూడు చపాతీలు తింటే కడుపు నిండిన ఫీలింగ్ కలుగుతుంది. దీని వల్ల బరువు కంట్రోల్‌లో ఉంటుంది. కానీ అన్నం విషయంలో ఇలా జరగదు. కడుపు నిండే వరకు తింటూనే ఉంటారు. దీనివల్ల క్యాలరీలు పెరిగి బరువుతో పాటు షుగర్‌ లాంటి వ్యాధుల బారిన పడే అవకాశాలు ఉంటాయి.

Show Full Article
Print Article
Next Story
More Stories