భోజనం చేసిన వెంటనే పండ్లు తినోద్దు

భోజనం చేసిన వెంటనే పండ్లు తినోద్దు
x
Highlights

తాజా పండ్లు ఆరోగ్యానికి మేలు కలుగుతుంది. అలాగని క్రమ పద్ధతి లేకుండా పండ్లను ఆరగిస్తే ఇబ్బందులు తప్పవంటున్నారు నిపుణులు. ఆరోగ్యంగా ఉండడం కోసం పండ్లు...

తాజా పండ్లు ఆరోగ్యానికి మేలు కలుగుతుంది. అలాగని క్రమ పద్ధతి లేకుండా పండ్లను ఆరగిస్తే ఇబ్బందులు తప్పవంటున్నారు నిపుణులు. ఆరోగ్యంగా ఉండడం కోసం పండ్లు తీసుకోవడం మాత్రమే కాదు.. తినే సమయానికి కూడా ప్రాధాన్యం ఇవ్వాలని సూచిస్తున్నారు.

భోజనం చేసిన వెంటనే పండ్లు తినడం సరైన విధానం కాదని అంటున్నారు వైద్యులు. అలా తినడం వల్ల శరీరంలో షుగర్‌ లెవల్స్‌ అమాంతంగా పెరిగిపోతాయి. అలాగే జీర్ణ సంబంధిత సమస్యలు కూడా తలెత్తవచ్చని చెబుతున్నారు.

- పరగడుపున ఓ గ్లాసు నీళ్లు తాగిన తర్వాత ఫ్రూట్స్‌ తినడం మంచిదంటున్నారు నిపుణులు. ప్రతి రోజూ ఉదయం నాలుగు రకాల పండ్ల ముక్కలను తీసుకోవడం వల్ల రోజంతా ఉల్లాసంగా ఉంటుంది.

- భోజనం తర్వాత పండ్లు తినడానికి కనీసం అరగంట సమయం ఉండాలి. మధుమేహం, అసిడిటి వంటి జీర్ణ సంబంధమైన ఇబ్బందులు ఉన్నవారు భోజనానికి గంట ముందు, భోజనం తర్వాత రెండు గంటల వరకు పండ్లు తీసుకోకుండా ఉండడం బెటర్.

- జీర్ణక్రియ సాఫీగా ఉండానికి పండ్ల ముక్కలను పాలతో కలిపి తీసుకోవాలి. పైనాపిల్‌, వాటర్‌ మెలన్‌ వంటి పండ్ల ముక్కలను ఉప్పు మిక్స్‌ చేసి తినాలి. డైజేషన్‌ సమస్యలు ఉన్నవారు అలా చేయకపోవడమే మంచిది.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories