పండ్లు ఇలా తీసుకుంటే ఆరోగ్యానికి మేలు

పండ్లు ఇలా తీసుకుంటే ఆరోగ్యానికి మేలు
x
Highlights

అరోగ్యంగా ఉండడానికి పండ్లు , కూరగాయలు తినడం మంచిదని అందరికి తెలిసిందే.. వాటితో అరోగ్యకరమైన ప్రయోజనాలు అనేకం. పండ్లు తింటున్నాం కానీ వాటి గురించి అసలు...

అరోగ్యంగా ఉండడానికి పండ్లు , కూరగాయలు తినడం మంచిదని అందరికి తెలిసిందే.. వాటితో అరోగ్యకరమైన ప్రయోజనాలు అనేకం. పండ్లు తింటున్నాం కానీ వాటి గురించి అసలు నిజాలు చాలా మందికి తేలియదు. ఆహారానికి ముందు తినాలా? తర్వాత తినాలా? ఏ రకమైన పండ్లను తినాలి? పండ్లను డైరక్ట్‌గా తినాలా? జూస్‌గా చేసుకొని తాగాలా? ఇది చాలా మందికి ఉండే అనుమానం. కొందరు పరగడుపున పండ్లు తింటే మంచిదని అంటుంటారు.. అయితే అన్నంతోపాటు తింటే టాక్సిక్‌ ఆసిడ్‌లు రిలీజై కడుపు పాడవుతుందని ఇటీవల కొందరు హెచ్చరిస్తున్నారు.

పండ్లు ఏలా తింటే మంచిది అసలు పళ్ళు నిజంగానే అర్యోగంగా ఉండానికి తోడ్పాడుతాయా? అనే అంశంపై స్పెయిన్‌లోని 'పాలిటెక్నిక్‌ యూనివర్శిటీ ఆఫ్‌ వాలెన్సియా అధ్యాపకులు పరిశోధనలు చేశారు. బయోటెక్నాలజీ డిపార్ట్‌మెంట్‌లో ప్రొఫెసర్‌గా పనిచేస్తున్న జోస్‌ మైగుల్‌ ములెట్‌ అధ్యయన వివరాలు తెలియజేశారు. కేవలం పండ్ల వలనే మాత్రమే మన శరీరానికి కావాల్సిన పోషకాలు అందవని, వంటకాలను కూడా తినాలని, వండుతున్న సమయంలో ఆ వేడికి కొన్ని పోషకాలు కూరగాయల నుంచి ఉత్పత్తి అవుతాయని ఆయన చెప్పారు. పండ్లు తినడం వల్ల కడుపు నిండిన స్వభావం కలుగదని అందువల్లే చింపాంజీ లాంటి జంతువులు శక్తి సరిపోక ఎప్పుడూ పళ్లను తింటూనే ఉంటాయని ఆయన చెప్పారు.

. పండ్లను ఏ సమయంలోనైనా తినవచ్చునని, అలాగే జ్యూస్ బదులు పండ్లను నేరుగా తినడమే మంచిదని ఆయన తెలిపారు. పండ్లు తీసుకుంటే మహా అంటే ఒకటి, రెండు తీసుకుంటామని, అదే జూస్‌ తాగితే నాలుగైదు పండ్ల రసం తాగుతామని, దీంతో శరీరంలోని రక్తంలో సుగర్‌ స్థాయి పెరుగుతుందని ఆయన అన్నారు. అదే పండును నమిలి తింటే ఫైబర్‌ కడుపులోకి వెళ్లి జీర్ణ వ్యవస్థకు బలపరుస్తుందని చెప్పారు. ఏ సీజన్లో వచ్చే పండ్లను ఆ సీజన్‌లో తీసుకుంటే మంచిదన్నారు. శరీర శ్రమకు తగ్గట్లుగా ఆహారాన్ని తీసుకోవడం మంచిదని సూచించారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories