Health: ఎక్కువ ప్రోటీన్‌ తీసుకుంటే ఏమవుతుందో తెలుసా.?

Health: ఎక్కువ ప్రోటీన్‌ తీసుకుంటే ఏమవుతుందో తెలుసా.?
x

Health: ఎక్కువ ప్రోటీన్‌ తీసుకుంటే ఏమవుతుందో తెలుసా.?

Highlights

Protein: మన శరీరానికి ప్రోటీన్ అవసరం. అయితే దీనిని నియమితంగా, పరిమితిలో తీసుకోకపోతే ఆరోగ్య సమస్యలు తలెత్తే అవకాశం ఉంది. ముఖ్యంగా రెడ్ మీట్, ప్రాసెస్డ్ మీట్ లాంటివి ఎక్కువగా తీసుకుంటే కొన్ని రకాల క్యాన్సర్లు వచ్చే ప్రమాదం పెరుగుతుంది.

Protein: మన శరీరానికి ప్రోటీన్ అవసరం. అయితే దీనిని నియమితంగా, పరిమితిలో తీసుకోకపోతే ఆరోగ్య సమస్యలు తలెత్తే అవకాశం ఉంది. ముఖ్యంగా రెడ్ మీట్, ప్రాసెస్డ్ మీట్ లాంటివి ఎక్కువగా తీసుకుంటే కొన్ని రకాల క్యాన్సర్లు వచ్చే ప్రమాదం పెరుగుతుంది. ప్రోటీన్ ఎక్కువగా ఉన్న ఫుడ్‌ను తీసుకుంటే శరీరంలో జరిగే మార్పులు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..

అధిక ప్రోటీన్ మాంసాహారాల్లో ఉండే కీమికల్స్ వల్ల రొమ్ము క్యాన్సర్, ప్రోస్టేట్ క్యాన్సర్, కొలొరెక్టల్ క్యాన్సర్ వంటి వ్యాధుల ప్రమాదం ఉన్నట్టు పరిశోధనలు చెబుతున్నాయి. హాట్ డాగ్స్, హామ్, బేకన్, డెలీ మీట్స్ లాంటి ప్రాసెస్డ్ మీట్‌లను తరచూ తినడం వల్ల ఈ ప్రమాదం మరింత పెరుగుతుంది. బరువు తగ్గడానికి ప్రోటీన్ అవసరం అని తెలిసిందే. అయితే అది ఎక్కువగా తీసుకుంటే శరీరంలో కొవ్వుగా నిల్వ అయ్యే అవకాశం ఉంది. దీని ఫలితంగా బరువు పెరిగే అవకాశం ఉంటుంది.

ప్రోటీన్ ఎక్కువగా తీసుకుంటే జీర్ణ వ్యవస్థపై ప్రభావం పడుతుంది. ఇది మలబద్ధకం, ఉబ్బరం వంటి సమస్యలకు కారణమవుతుంది. అధిక ప్రోటీన్ వల్ల శరీరంలోని కాల్షియం స్థాయి తగ్గుతుంది. దీని వల్ల ఎముకలు బలహీనపడతాయి. దీర్ఘకాలంలో ఇది ఆస్టియోపోరోసిస్‌కు దారి తీసే ప్రమాదం ఉంది. అధిక ప్రోటీన్ తీసుకోవడం మూత్రపిండాలపై ఒత్తిడిని పెంచుతుంది. ఇది కిడ్నీ ఫంక్షన్‌కి భంగం కలిగించడంతో పాటు డీహైడ్రేషన్, విరేచనాలకు దారి తీసే అవకాశం ఉంటుంది.

ప్రోటీన్ శరీరానికి అవసరమే అయినా, అది పరిమితి మించి తీసుకుంటే ఆరోగ్య సమస్యలకు దారి తీసే అవకాశం ఉంటుంది. ఆహారాన్ని సమతుల్యతగా తీసుకోవడం ద్వారా దీన్ని నియంత్రించవచ్చని నిపుణులు చెబుతున్నారు.

గమనిక: పైన తెలిపిన విషయాలను ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా అందించడం జరిగింది. ఆరోగ్యానికి సంబంధించి వైద్యుల సూచనలు పాటించడమే ఉత్తమం.

Show Full Article
Print Article
Next Story
More Stories