రోజూ మాంసం తినవచ్చా..?

రోజూ మాంసం తినవచ్చా..?
x
Highlights

చాలా మాంసాహారాలకు ఓ సందేహం ఉంటుంది. మాంసాన్ని తతినవచ్చా..? తింటే ఏమవుతుంది..? అని దీనికి నిపుణులు ఎలాంటి సమాధానం చెబుతున్నారు..? ఇప్పుడు...

చాలా మాంసాహారాలకు ఓ సందేహం ఉంటుంది. మాంసాన్ని తతినవచ్చా..? తింటే ఏమవుతుంది..? అని దీనికి నిపుణులు ఎలాంటి సమాధానం చెబుతున్నారు..? ఇప్పుడు తెలుసుకుందాం..

మాంసాహారంలో ప్రోటీన్లు, కొవ్వు పదార్థాలు ఉంటాయని అందరికీ తెలిసిందే. ముఖ్యంగా మటన్‌లో కొవ్వు పదార్థాలు ఎక్కువగా ఉంటాయి. చికెన్, చేపలు, రొయ్య‌ల్లో ప్రోటీన్లు అధికంగా ఉంటాయి. కావున కొవ్వు పదార్థాలు ఎక్కువగా ఉండే మాంసాహారాలను అధికంగా తింటే శరీరంలో ఎల్‌డీఎల్ , ట్రై గ్లిజరైడ్లు చేరతాయి. దీంతో అధికంగా బరువు పెరుగుతారు. అలాగే గుండె నొప్పి వచ్చే ప్రమాదం కూడా ఉంటుంది..

అందుకని కొవ్వు పదార్థాలు ఎక్కువగా ఉండే మాంసాహారాలను తక్కువగా తినాలి. అలాగే ప్రతి రోజు మాంసాహారం తీనే వారు అందులో కొవ్వు తక్కువగా ఉండేలా చూసుకోవాలి. మన శరీరానికి నిత్యం కావల్సిన కొవ్వు పదార్థాల మోతాదు మించకుండా మాంసాహారాలను తిసుకోవాలి. ఇలా రోజూ మాంసాహారం తింటే ఎలాంటి దుష్పరిణామాలు ఉండవు. చికెన్, చేపలను రోజూ తినవచ్చు. కాకపోతే పరిమితిలో తీసుకుంటేనే ఆరోగ్యానికి మేలు జరుగుతుంది. శరీరానికి ప్రోటీన్లతో కణజాల నిర్మాణం జరుగుతుంది. కండరాలు దృఢంగా మారుతాయి. అయితే కిడ్నీ సమస్యలు, గుండె జబ్బులతో బాదేపడేవారు డాక్టర్ సూచన మేరకు మాంసాహారాలను తినాలి. సలహాలు పాటించకుండా మాంసాహారం తింటే సమస్యలు మరింత ఎక్కువయ్యేందుకు అవకాశం ఉంటుంది..!

Show Full Article
Print Article
More On
Next Story
More Stories