Vitamin C Deficiency: శరీరంలో ఈ లక్షణాలు కనిపిస్తున్నాయా.? విటమిన్‌ సి లోపం ఉన్నట్లే

Vitamin C Deficiency
x

Vitamin C Deficiency: శరీరంలో ఈ లక్షణాలు కనిపిస్తున్నాయా.? విటమిన్‌ సి లోపం ఉన్నట్లే

Highlights

Vitamin C Deficiency: విటమిన్ C లోపం కారణంగా శరీర రోగనిరోధక వ్యవస్థ బలహీనంగా మారుతుంది. గాయాలు త్వరగా మానవు. రక్తనాళాలు దృఢత్వాన్ని కోల్పోవడం వల్ల శరీర శక్తి తగ్గిపోతాయి.

Vitamin C Deficiency: మన శరీరానికి అవసరమైన అనేక రకాల విటమిన్లలో విటమిన్ C ఒకటి. ఇది శరీరంలో అనేక జీవక్రియలను నియంత్రించడంలో సహాయపడుతుంది. విటమిన్ C నీటిలో కరిగే లక్షణం కలిగి ఉంటుంది. అందుకే శరీరం దీన్ని నిల్వ చేసుకోలేకపోతుంది. అందుకే శరీరానికి అవసరమైన పరిమాణాన్ని ప్రతిరోజూ ఆహారంతో తీసుకోవాలి. శరీరంలో అధికంగా ఉండే విటమిన్ C మూత్రం ద్వారా బయటకు వెళుతుంది. అందువల్ల దీని లభ్యతను నిరంతరం పరిరక్షించుకోవడం అవసరం. శరీరంలో విటమిన్‌ సి లోపిస్తే ఎన్నో రకాల సమస్యలకు దారి తీస్తుంది. ఇంతకీ శరీరంలో ఈ విటమిన్‌ తగ్గిందన్న విషయాన్ని ఎలా తెలుసుకోవాలి.? శరీరంలో జరిగే మార్పులు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..

విటమిన్ C లోపం కారణంగా శరీర రోగనిరోధక వ్యవస్థ బలహీనంగా మారుతుంది. గాయాలు త్వరగా మానవు. రక్తనాళాలు దృఢత్వాన్ని కోల్పోవడం వల్ల శరీర శక్తి తగ్గిపోతాయి. ఎముకల ఆరోగ్యం దెబ్బతింటుంది. దాంతో ఆస్టియోపోరోసిస్ వచ్చే అవకాశాలు ఉంటాయి. విటమిన్ C లేకపోతే కొల్లాజెన్ ఉత్పత్తి తగ్గిపోతుంది, ఇది చర్మం ముడతలు పడటానికి కారణమవుతుంది. చిన్న వయస్సులోనే వృద్ధాప్య ఛాయలు కనబడతాయి. అలసట, నీరసం తరచుగా అనిపించవచ్చు.

విటమిన్ C లోపం కారణంగా మనం తీసుకునే ఆహారంలోని ఐరన్ శరీరం సరిగ్గా వినియోగించుకోదు. దీని వల్ల రక్తంలో హీమోగ్లోబిన్ తగ్గుతాయి, దీర్ఘకాలంలో రక్తహీనతకు దారితీస్తుంది. అలాగే రక్తనాళాల గోడలు సులభంగా దెబ్బతింటాయి. చర్మం త్వరగా కందిపోతుంది. తరచూ చర్మంపై దురద, దద్దుర్లు, గజ్జి, తామర వంటి సమస్యలు వస్తాయి. జుట్టు బలహీనంగా మారి చిట్లిపోతుంది. గోళ్లు సులభంగా విరిగిపోతాయి. చర్మం, జుట్టు పొడిగా మారుతుంది.

విటమిన్ C లోపం వల్ల రక్తనాళాల గోడలు బలహీనపడి వాపులకు గురవుతాయి. ముఖ్యంగా చిగుళ్ల రక్తనాళాలు పగిలిపోవడం వల్ల రక్తస్రావం ఏర్పడుతుంది. నోటిలో బ్యాక్టీరియా పెరిగి దుర్వాసన వస్తుంది. రోగనిరోధక శక్తి తగ్గడం వల్ల తరచూ ఇన్‌ఫెక్షన్లు వస్తాయి. దీర్ఘకాలంలో ఇది న్యుమోనియాకు దారితీసే అవకాశం ఉంటుంది. విటమిన్ C లోపం కంటి ఆరోగ్యాన్ని కూడా ప్రభావితం చేస్తుంది. కళ్లలో శుక్లాలు ఏర్పడి చూపు మందగించవచ్చు.

ఏం చేయాలి.?

శరీరంలో విటమిన్‌ సి లోపిస్తే.. ఉల్లిపాయలు, టమాటాలు, నిమ్మకాయ, కరివేపాకు, ఉసిరికాయ, కివి, బొప్పాయి, మామిడి వంటి విటమిన్‌ సి పుష్కలంగా ఉండే ఆహారాన్ని తీసుకోవాలి. అయితే పైన తెలిపిన లక్షణాల తీవ్రత మరీ ఎక్కువగా ఉంటే కచ్చితంగా వైద్యులను సంప్రదించి సంబంధిత పరీక్షలు చేయించుకోవాలి. అదే విధంగా తీసుకునే ఆహారంలో విటమిన్‌ సి ఉండేలా చూసుకోవాలి.

Show Full Article
Print Article
Next Story
More Stories