Fatty Liver: గర్భిణీలు తప్పక తెలుసుకోవాల్సిన విషయం.. ఫ్యాటీ లివర్ లక్షణాలివే !

Fatty Liver
x

Fatty Liver: గర్భిణీలు తప్పక తెలుసుకోవాల్సిన విషయం.. ఫ్యాటీ లివర్ లక్షణాలివే !

Highlights

Fatty Liver: గర్భధారణ సమయంలో మహిళల శరీరంలో అనేక హార్మోన్ల మార్పులు చోటుచేసుకుంటాయి.

Fatty Liver: గర్భధారణ సమయంలో మహిళల శరీరంలో అనేక హార్మోన్ల మార్పులు చోటుచేసుకుంటాయి. ఈ సమయంలో మానసిక సమస్యలతో పాటు అనేక రకాల ఆరోగ్య సమస్యలు కూడా ఎదురవుతాయి. కొందరు మహిళలు గర్భధారణ సమయంలో ఫ్యాటీ లివర్ సమస్యతో కూడా బాధపడవచ్చు. ఇది తల్లికి, బిడ్డకు కూడా ప్రమాదకరమైన పరిస్థితి. కాబట్టి, గర్భధారణలో ఫ్యాటీ లివర్ లక్షణాలను ముందుగానే గుర్తించడం చాలా ముఖ్యం.ఆ లక్షణాలు ఏమిటో వివరంగా తెలుసుకుందాం.

గర్భధారణలో ఫ్యాటీ లివర్ ఒక అత్యంత తీవ్రమైన పరిస్థితి. ఇది తల్లి, బిడ్డ ఇద్దరికీ ప్రాణాంతకం కావచ్చు. గర్భధారణలో కాలేయం కొవ్వుగా మారడం వల్ల కాలేయ వైఫల్యం కూడా సంభవించవచ్చు. ఇది ప్రీమెచ్యూర్ డెలివరీకి కూడా కారణం కావచ్చు. సాధారణంగా ఫ్యాటీ లివర్ సమస్య జీవనశైలి, ఆహారపు అలవాట్లలో మార్పుల వల్ల వస్తుంది. సమయానికి చికిత్స తీసుకుంటే ఈ సమస్యను తగ్గించవచ్చు. గర్భధారణలో మహిళలకు ఫ్యాటీ లివర్ వచ్చే ప్రమాదం ఉంది.

ఇలా ఎందుకు జరుగుతుందో ఖచ్చితమైన కారణం ఇంకా తెలియలేదు. కానీ కొన్ని పరిశోధనల్లో జన్యుపరమైన లోపాల వల్ల జీవక్రియ సమస్యలు, పిండం-తల్లి పరస్పర చర్యలు పెరిగే అవకాశం ఉందని తేలింది. దీని వల్ల పిండానికి కూడా అనేక రకాల సమస్యలు రావచ్చు.

ఈ లక్షణాలు ఉండవచ్చు

గర్భధారణ సమయంలో ఫ్యాటీ లివర్ వచ్చినప్పుడు సాధారణ సమయంలో ఫ్యాటీ లివర్ సమస్య వచ్చినప్పుడు కనిపించే లక్షణాలే ఉంటాయి. గర్భధారణలో ఫ్యాటీ లివర్ ఉన్న మహిళలకు కడుపు నొప్పి, వాంతులు, అలసటగా అనిపిస్తుంది. అయితే, గర్భధారణ సమయంలో మహిళలు ఈ సమస్యలను కామనే అని భావించి నిర్లక్ష్యం చేస్తారు. దీని కారణంగా వ్యాధి పెరుగుతుంది. దీంతో పాటు మహిళలకు తలనొప్పి, కామెర్లు కూడా రావచ్చు. ప్రారంభంలోనే ఫ్యాటీ లివర్ లక్షణాలను గుర్తించి చికిత్స ప్రారంభిస్తే, దానిని చాలా వరకు నియంత్రించవచ్చు. గర్భధారణ సమయంలో ఫ్యాటీ లివర్ సమస్య పెరిగితే తల్లి, బిడ్డ ఇద్దరికీ తీవ్రమైన నష్టం వాటిల్లవచ్చు.

ఇలా నివారించవచ్చు

ఫ్యాటీ లివర్ రాకుండా ఉండాలంటే లైఫ్ స్టైల్లో మార్పులు చేసుకోవాలి. దీనితో పాటు సమతుల్య ఆహారం, వ్యాయామం కూడా అవసరం. మద్యానికి దూరంగా ఉండడంతో పాటు బరువును కంట్రోల్ లో ఉంచుకోవాలి. గర్భధారణలో ఫ్యాటీ లివర్ లక్షణాలు కనిపిస్తే వెంటనే డాక్టర్‌ను సంప్రదించాలి. గర్భధారణలో ఫ్యాటీ లివర్ భవిష్యత్తును అంచనా వేయలేం. ఒకవేళ వ్యాధి పెరిగితే చికిత్స కూడా కష్టమవుతుంది. కాబట్టి లక్షణాలు కనిపించినప్పుడు ఎలాంటి నిర్లక్ష్యం చేయకూడదు.

Show Full Article
Print Article
Next Story
More Stories