స్త్రీ నడకను బట్టి ఆమె శృంగార ఆసక్తి చెప్పవచ్చు

స్త్రీ నడకను బట్టి ఆమె శృంగార ఆసక్తి చెప్పవచ్చు
x
Highlights

నవరసాలలో ఒక రసం శృంగారం. మనిషి అంతర్గత సమ్మేళనం శృంగారం. మనిషి జీవన ప్రమాణంలో అధిక ప్రాధాన్యం కలిగినది శృంగారం. అయితే ప్రస్తుత సమాజంలో ప్రతి స్త్రీ,...

నవరసాలలో ఒక రసం శృంగారం. మనిషి అంతర్గత సమ్మేళనం శృంగారం. మనిషి జీవన ప్రమాణంలో అధిక ప్రాధాన్యం కలిగినది శృంగారం. అయితే ప్రస్తుత సమాజంలో ప్రతి స్త్రీ, పురుషుడు తీవ్రమైన ఒత్తిడిని ఎదుర్కొంటున్నారు. దీంతో శృంగారం పట్ల వారికి ఆసక్తి క్రమంగా తగ్గిపోతోంది. లైంగిక సంతృప్తి విషయంలో ఒక్కో మనిషికి ఒక్కో రకమైన ప్రవర్తన ఉంటుంది. ముఖ్యంగా మహిళలలో శృంగార ఆసక్తి ఒక్కోలా వుంటుందంటున్నారు శాస్త్రవేత్తలు. ఇటివలే అమెరికా పరిశోధకులు స్త్రీ లైంగిక సంతృఫ్తిపై అధ్యయనం జరిపారు.

మహిళల నడకను బట్టే వారిలో ఉన్న శృంగార తృష్ణ, దక్షతను చెప్పవచ్చని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. స్కాట్‌ల్యాండ్‌ విశ్వవిద్యాలయంలోని పరిశోధక బృందం ఈ విషయాన్ని తేల్చింది. బహిరంగ ప్రదేశాలలో మహిళలు నడకను చిత్రీకరించారు. అలాగే ప్రత్యేకంగా రూపొందించిన ప్రశ్నావళితో వారి అభిప్రాయాలను రాబట్టారు. వాటిలో శృంగార ప్రవర్తనకు సంబంధించిన ప్రశ్నలు అందులో ఉన్నాయి.

పరిశోధనల్లోని అంశాల ప్రకారం పెద్ద పెద్ద అంగలతో, నడుము తిప్పుతూ నడిచే వారు శృంగారంపై అమిత ఆసక్తి కలిగి ఉంటారని తేలింది. సరిగ్గా సైకాలజిస్టులు కూడా ఇదే విషయాన్ని స్పష్టం చేశారు. మహిళ శరీర సౌష్టవం వారిలో లైంగిక అవయవాల పటిష్టత, దక్షతకు సూచికగా నిలుస్తుందని పరిశోధనలో వెల్లడైంది. మొద్దుబారిపోయిన కండరాలకు లైంగిక వాంఛలకు దగ్గర సంబంధాలు ఉన్నట్లు తెలిపారు. ఇలాంటి కండరాలు ఉన్న వారిలో సెక్స్ వాంఛ తగ్గే అవకాశం ఉందన్నారు. లైంగిక అవయవాలు పటిష్టంగా ఉన్న స్త్రీలలో శృంగార వాంఛ అధికమని , అది వారి నడకపై ఆధారపడి ఉంటుందని తెలిపారు. అదే స్థాయిలో తన జీవిత భాగస్వామిలో లైంగిక కోరికలు ఉన్నప్పుడే అది బయటపడుతుందని సెలవిచ్చారు. చాలా మంది స్రీలు శృంగారం ఆసక్తిని వారి శరీర సిగ్నల్స్ ద్వారానే తెలియజేస్తారట.

చాలా మంది స్త్రీలలో శృంగరంపై ఆసక్తి లేకపోవడానికి కారణం

మరోవైపు చాలా మంది మహిళలు శృంగార ఆసక్తిని బహిరంగంగా మాట్లాడడానికి వారు సంకోచిస్తారని పరిశోధనల్లో తేలింది. సెక్స్ విషయంలో వారు అలాంటి ధోరణిని కలిగి ఉండడానికి గల కారణాలను కూడా పరిశోధకులు వెల్లడించారు. అమ్మాయిలు చిన్నప్పటి నుంచే శృంగారం అనే పదంపై వ్యతిరేక భావాన్ని కలిగి ఉంటారు. దీంతో శృంగారంపై చర్చించడానికి కొంత ఏహ్యభావాన్ని చూపుతుంటారు. శృంగారం అనేది తప్పు అనే భావన వారిలో ఉంటుంది. కొందరు అమ్మాయిలు చిన్నతనంలో ఎదుర్కొన్న లైంగిక వేధింపులు కారణంగా శృంగార చర్యపై కొంత వ్యతిరేక భావనను కలిగి ఉంటారు. దీంతో వివాహం అనంతరంభర్తతో కలిసి ఎకాంతంగా గడపడానికి ఆసక్తి చూపించరు.

స్త్రీలలో శృంగార అసంతృప్తికి కారణం

కొందరు మహిళలు శృంగార సమయంలో కలిగే లోలోన భయం కారణంగా శృంగారంలో పాల్గొన్నామన్న ఆనందం వారిలో కనిపించదు. లైంగిక పరిజ్ఞానం లేకపోవడం తదితర కారణాలు ఇందుకు ప్రధాన కారణాలుగా చెప్పవచ్చు. అసౌకర్యంగా ఉండటం, చికాకు వల్ల కూడా శృంగార అసంతృప్తికి కారణమవుతుంది. లైంగిక చర్యలో స్రావాలు విడుదల కానప్పుడు కూడా శృంగారంలో పాల్గొన్నామన్న ఆనందం వారిలో కనిపించదు. అనారోగ్య కారణాలతో కూడా వారిలో లైంగికతృప్తి ఉండదు. ఇలాంటి సమస్యల నుంచి బయటపడేందుకు వైద్యులతో కౌన్సెలింగ్‌ తీసుకోవడం మంచిది.

Show Full Article
Print Article
Next Story
More Stories