ఆశ్చర్యం.. మనం ప్లాస్టిక్‌ని తింటున్నామట!

ఆశ్చర్యం.. మనం ప్లాస్టిక్‌ని తింటున్నామట!
x
Highlights

మనం ఆహారంతోపాటు.. ప్లాస్టిక్ కూడా తింటున్నామట.. అవును ఆశ్చర్యంగా ఉన్న.. మీరు చదువుతున్నది నిజంగా నిజమే. వారానికి 5 గ్రాములు వరకు ప్లాస్టిక్ ని మనం...

మనం ఆహారంతోపాటు.. ప్లాస్టిక్ కూడా తింటున్నామట.. అవును ఆశ్చర్యంగా ఉన్న.. మీరు చదువుతున్నది నిజంగా నిజమే. వారానికి 5 గ్రాములు వరకు ప్లాస్టిక్ ని మనం లాగించేస్తున్నామని.. ఆస్ట్రేలియాకు చెందిన ఓ యూనివర్సిటీ అధ్యయనంలో స్పష్టమైంది. అతి సూక్ష్మమైన పరిమాణంలో ఉండే ప్లాస్టిక్‌ను వివిధ రూపాల్లో మనకు తెలీకుండానే తినేస్తున్నట్టు శాస్త్రవేత్తలు తెల్చారు. వాటర్ బాటిల్, ప్లాస్టిక్ కుళాయి ద్వారా వచ్చే నీరు, షెల్ ఫిష్, బీర్లు, ఉప్పు తదితర పదార్థాల ద్వారా ప్రమాదకరమైన ప్లాస్టిక్‌ మన కడుపులోకి చేరుతోందని ఆస్ట్రేలియా పరిశోధకులు తేల్చారు.

వామ్మో.. వారానికి 5 గ్రాముల ప్లాస్టిక్.. అంటే సంవత్సరానికి పావుకిలో మన కడుపులోకి వెళ్తుంది. ఇప్పుడు దీనివల్ల ముప్పు లేకపోయిన భవిష్యత్‌లో ఇది చాలా ప్రమాదకరంగా పరిణమించవచ్చని పరిశోధకులు హెచ్చరించారు. కేవలం ఆహార పదార్థాలు, పానీయాల ద్వారానే కాదు.. గాలి ద్వారా కూడా ప్లాస్టిక్‌ను పీలుస్తున్నామని అధ్యయనంలో తేలింది. కంటికి కనిపించని రేణువుల రూపంలో ప్లాస్టిక్‌ గాల్లో చేరిపోయిందని.. దాన్ని మనం పీలుస్తున్నామని చెబుతున్నారు. నోటి ద్వారా ఎంత ప్లాస్టిక్ తింటున్నామో.. అంతే పరిణామంలో ముక్కు ద్వారా కూడా శరీరంలోకి చేరుతోందని నిపుణులు హెచ్చరించారు. వీలైనంత వరకు ప్లాస్టిక్ వస్తువుల వినియోగాన్ని తగ్గించేయడం మంచిదని నిపుణులు సూచిస్తున్నారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories