వ్యాక్స్‌ వద్దు.. ముఖంపై అవాంఛిత రోమాల సమస్యకు జాగ్రత్తలు!

వ్యాక్స్‌ వద్దు.. ముఖంపై అవాంఛిత రోమాల సమస్యకు జాగ్రత్తలు!
x

వ్యాక్స్‌ వద్దు.. ముఖంపై అవాంఛిత రోమాల సమస్యకు జాగ్రత్తలు!

Highlights

ఇప్పటి కాలంలో చాలామంది ముఖంపై అవాంఛిత రోమాల సమస్యతో ఇబ్బందులు పడుతున్నారు. హార్మోన్ల లోపాలు, కొన్ని ఆరోగ్య సమస్యల కారణంగా ఈ సమస్య ఎక్కువగా కనిపిస్తోంది.

ఇప్పటి కాలంలో చాలామంది ముఖంపై అవాంఛిత రోమాల సమస్యతో ఇబ్బందులు పడుతున్నారు. హార్మోన్ల లోపాలు, కొన్ని ఆరోగ్య సమస్యల కారణంగా ఈ సమస్య ఎక్కువగా కనిపిస్తోంది. వీటిని తొలగించుకోవడానికి చాలామంది వ్యాక్సింగ్‌ను ఆశ్రయిస్తున్నారు. అయితే సౌందర్య నిపుణుల ప్రకారం వ్యాక్సింగ్ అన్నివేళలా మంచిది కాదు.

చర్మ తత్వాన్ని బట్టి వ్యాక్సింగ్ అవసరం

ముఖానికి వ్యాక్సింగ్ చేయించే ముందు మీ చర్మ తత్వాన్ని గుర్తించడం చాలా ముఖ్యం. ప్రస్తుతం మార్కెట్లో విభిన్న రకాల వ్యాక్స్ స్ట్రిప్స్ అందుబాటులో ఉన్నా, ఇవి సున్నితమైన చర్మం ఉన్నవారికి తీవ్రమైన ఇబ్బందులు కలిగించవచ్చు.

వ్యాక్సింగ్ దుష్ప్రభావాలు

చర్మంపై దద్దుర్లు రావడం

ఎర్రగా మారడం, మంట

చర్మం మరింత సున్నితంగా మారి ముడతలు పడటం

ఎండలోకి వెళ్లినప్పుడు ముఖం కందిపోవడం, ర్యాషెస్ రావడం

నిపుణుల సూచనలు

ఫేషియల్ వ్యాక్స్ లేదా ఇంట్లో తయారుచేసుకున్న ప్యాక్స్ వాడే ముందు చర్మ తత్వం అనుకూలమో కాదో పరిశీలించాలి.

ఎప్పుడైనా కొత్త ఉత్పత్తిని వాడే ముందు ప్యాచ్ టెస్ట్ చేయడం చాలా ముఖ్యం.

చర్మ సమస్యలు లేదా అలెర్జీలు ఉన్నవారు తప్పనిసరిగా నిపుణుల సలహా తీసుకోవాలి.

చర్మ సంరక్షణలో జాగ్రత్తలు తీసుకుంటే మాత్రమే అవాంఛిత రోమాల సమస్యకు సురక్షిత పరిష్కారం పొందవచ్చు.

Show Full Article
Print Article
Next Story
More Stories