Watermelon: వేడి తాపాన్ని తగ్గించే వాటర్ మెలోన్

Watermelon: Cool Fruit for Hot Days
x

ఇమేజ్ సోర్స్: ilcantone.com

Highlights

Watermelon: వాటర్ మెలోన్ 92శాతం వాటర్ కంటెంట్ ఉండటం వల్ల వేసవిలో ఎండ వేడి నుండి శరీరానికి మంచి ఉపశమనం కలిగిస్తుంది.

Watermelon: ఎండలు మండిపోతున్నాయ్.. వేడికి శరీరంలో నీటి శాతం తగ్గుతూ దాహం అవుతూ వుంటుంది. ఆ టైంలో శరీరానికి చల్లదానాన్ని ఆహార పదార్థాల కోసం వెతుకుతూ వుంటాం. ఆ టైం లో మనందరికి గుర్తుకు వచ్చేది పుచ్చకాయ. అందరికీ అందుబాటులో వుంటూ ఎక్కడైన దొరుకుంది. పుచ్చకాయను తీసుకుంటే శరీరానికి చల్లదనంతో పాటు దాహం కూడా తీరుతుంది. రెడ్ కలర్లో జ్యూసీగా పిలల్లను, పెద్దలను ఆకర్షించే ఫ్రూట్ పుచ్చకాయ. పుచ్చకాయ లో అనేక న్యూట్రీషియన్స్ తో పాటు, వాటర్ కంటెంట్ అధికంగా ఉంటుంది. వేసవిలో వేడి తాపం నుండి శరీరాన్ని రక్షించుకోవాలంటే పుచ్చకాయ లేదా వాటర్ మెలోన్ తప్పనిసరిగా తినాల్సిందే. మరి దానిలో వుండే విటమిన్స్, మినరల్స్ మనకు ఎలా దోహదపడుతాయో మన హెచ్ ఎం టివి "లైఫ్ స్టైల్" లో చూద్దాం

ఇందులో 92శాతం వాటర్ కంటెంట్ ఉండటం వల్ల వేసవిలో ఎండ వేడి నుండి శరీరానికి మంచి ఉపశమనం కలిగిస్తుంది. 92శాతం వాటర్ కంటెంట్ ఉంటే, మిగిలిన ఆ ఎనిమిది శాతంలో బీటా కెరోటీన్, విటమిన్ ఎ, బి1, బి6 మరియు సి, పొటాషియం, మెగ్నీషియం, బయోటిన్ మరియు కాపర్లు అధికంగా ఉన్నాయి.

రకరకాలుగా తీసుకోవచ్చు...

వాటర్ మెలోన్ జ్యూస్, స్నాక్, సలాడ్స్, టాపింగ్స్ ఇలా వివిధ రకాలుగా తీసుకోవచ్చు. ఇలా చేయడం వల్ల మీ పిల్లలకు కూడా ఎక్కువగా ఇష్టపడుతారు. వాటర్ మెలన్ డైలీ డైట్ లో చేర్చుకోవడం వల్ల శరీరంలో టాక్సిన్స్ ను నేచురల్ గా తగ్గిస్తుంది. వాటర్ మెలోన్ లో ఉండే బీటా కెరోటిన్, మరియు లైకోపిన్ వంటివి సన్ బర్న్ నివారించడంలో సహాయపడుతుంది. వాటర్ కంటెంట్ మరియు ఫైబర్ కంటెంట్ , జీర్ణ వ్యవస్త సక్రమంగా ఉండేలా చేస్తుంది.

వాటర్ మెలోన్ లో ఉండే విటమిన్ సి , జుట్టును అందంగా, స్ట్రాంగ్ గా మార్చడానికి అవసరమయ్యే కెరోటిన్ గా మార్చుతుంది. వాటర్ మెలోన్ రక్తనాళాల పనితీరును మెరుగుపరుస్తుంది. రక్త ప్రసరణ మెరుగుపరుస్తుంది. అందుకే బ్లడ్ ప్రెజర్ కంట్రోల్లో ఉంటేంది. వాటర్ మెలోన్ లో ఉండే విటమిన్ ఎ కళ్ళ రెటీనాలో పింగ్మెంట్ ను ఉత్పత్తి చేస్తుంది. కళ్ళు ఆరోగ్యంగా ఉంచుంది. అలాగే వేసవిలో కంటి ఇన్ఫెక్షన్స్ ను నివారిస్తుంది.

ముఖ్యంగా విటిమన్ బి6 మరియు హార్మోనులను బ్యాలెన్స్ చేసి గుణాలు అద్భుతంగా ఉన్నాయి. మరి ఇంకెందుకు ఆలస్యం మీ దినచర్యను వాటర్ మెలోన్ తో మొదలు పెట్టి, అమేజింగ్ హెల్త్ బెనిఫిట్స్ ను పొందండి..

Show Full Article
Print Article
Next Story
More Stories