చూట్టూ నీళ్లు మధ్యలో ఊరు..

చూట్టూ నీళ్లు మధ్యలో ఊరు..
x
Highlights

చూట్టూ నీళ్లు మధ్యలో ఊరు. ఎంటీ వర్ష కాలం కదా.. ఊరు చూట్టు నీళ్లు వచ్చి.. ఆ వాటర్ మధ్యలో ఊరు చిక్కుకుందేమో అని అనుకుంటున్నారా..! కాదు.. నిజంగా ఆ ఊరు...

చూట్టూ నీళ్లు మధ్యలో ఊరు. ఎంటీ వర్ష కాలం కదా.. ఊరు చూట్టు నీళ్లు వచ్చి.. ఆ వాటర్ మధ్యలో ఊరు చిక్కుకుందేమో అని అనుకుంటున్నారా..! కాదు.. నిజంగా ఆ ఊరు నీళ్లలో ఉంటుంది. ఇంకా చెప్పాలంటే ఓ సరస్సు మధ్యలో ఉంటుంది. సరస్సులో ఎక్కడైనా నీళ్లుంటాయిగానీ ఊళ్లుంటాయా..? అని ఆశ్చర్య పడకండి.. నిజ్జంగానే నీళ్లలో ఊరుంది.

ఈ సరస్సు చైనాలో ఉంది. అక్కడి జెజియాంగ్‌ ప్రావిన్సులోని చునాన్‌ కౌంటీలో చింగ్‌డావ్‌ లేక్‌ ఉంది. దీనికి థౌజండ్‌ ఐలాండ్‌ లేక్‌ అనే పేరూ కూడా ఉంది. అంటే వెయ్యి దీవుల సరస్సన్నమాట. దీనిలో 1,078 పెద్ద దీవులున్నాయి. చిన్నవైతే ఇంకా చాలానే ఉన్నాయి. సుమారు 573 చదరపు కి.మీ. విస్తీర్ణంలో ఉందీ సరస్సు. అందుకే దినిలోని దీవులపై ఇళ్లుంటాయి. వాటిని కలుపుతూ మధ్య మధ్యలో వంతెనలూ ఉన్నాయి. ఇంకా ఒక ఇంటి నుంచి మరో ఇంటికి వెళ్లాలంటే పడవల్లో వెళ్లాల్సిందే.

ఈ సరస్సులో మనుషులకే కాదు జంతువులకూ కొన్ని దీవులు ఉండటం విశేషం. పక్షుల దీవి, కోతుల దీవి, పాముల దీవి.. ఇలాంటివి చాలానే దీవులు ఉన్నాయి. ఈ ప్రాంతంలో మామూలుగానే ఇళ్లుండేవి. 1959లో ఇక్కడ గ్జినాన్‌ నదిపై ఫవర్ ప్రాజెక్టును నిర్మించారు. ఆ తరువాత ఈ ప్రాంతమంతా దానికి రిజర్వాయర్‌గా చేశారు. అందులో భాగంగానే ఇక్కడ ఈ సరస్సు ఏర్పడింది. దీంతో ఇక్కడుండే ప్రజలంతా.. దీవులుగా మారిన ఎత్తయిన ప్రాంతాల్లోనే నివాసాలు ఏర్పరుచుకున్నారు. అలా ఇక్కడ సరస్సులో ఊరు ఏర్పడిపోయింది. ఈ ఊరునీ సరస్సు పేరుతోనే పిలవడం విశేషం.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories