వర్షకాలంలో ప్రకృతిని చూసి ఆస్వాదించలనుకుంటున్నారా..!

వర్షకాలంలో ప్రకృతిని చూసి ఆస్వాదించలనుకుంటున్నారా..!
x
Highlights

చినుకులు పడితే .. ఆ జల్లులో తడిసిన ప్రకృతిని చూస్తే నిజంగా మనసు పులకించిపోతుంది.. చినుకు తడికి చిగురు తొడుగు పువ్వమ్మా.. అంటూ ఓ సినీ గేయ రచయిత...

చినుకులు పడితే .. ఆ జల్లులో తడిసిన ప్రకృతిని చూస్తే నిజంగా మనసు పులకించిపోతుంది.. చినుకు తడికి చిగురు తొడుగు పువ్వమ్మా.. అంటూ ఓ సినీ గేయ రచయిత చెప్పినట్లు.. చినుకుల జడిలో తడిసిన ప్రకృతి చూస్తే మధురానుభూతి కల్గుతుంది. అయితే అలాంటి ప్రకృతిని చూడటానికి కొంత మంది దూరప్రాంతాలకు వెళుతూ ఉంటారు.

అలా వెళ్లేవారు కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే మరిచిపోలేని జ్ఞాపకాలని మీ సొంతం చేసుకునే అవకాశం ఉంది.

* హుడీక్యాప్‌తో ఉన్న రెయిన్‌ జాకెట్‌ని తీసుకెళ్లటం ఉత్తమం. ఇది వర్షం నుంచే కాదు చలిగాలుల నుంచీ రక్షణగా ఉంటుంది.

* జీన్స్‌ మరియు కాటన్‌ లాంటి డ్రస్స్ లను తీసుకెళ్లకపోవటం మంచిది. ఎందుకంటే అవి త్వరగా ఆరవు. దీనికి తోడు తడిచిన డ్రస్స్‌లు బ్యాగ్‌ లో పెడితే.. ఆ బ్యాగ్ బరువు పెరిగిపోతుంది.

* పాలిస్టర్‌ గానీ, తేలిగ్గా ఉండి త్వరగా ఆరిపోయే డ్రస్స్‌లను తీసుకెళ్లటం మంచిది. వాటర్‌ప్రూఫ్‌ టవల్స్‌ కూడా తీసుకెళ్లటం ఉత్తమం.

* వాటర్ లో నడవటానికి వీళుగా ఉండే వాటర్‌ప్రూఫ్‌ బూట్లని తీసుకెళ్లండి.

* మీ సూట్‌కేసులో కొన్ని జిప్‌లాక్‌ బ్యాగులు, ప్లాస్టిక్‌ సంచులూ సర్దుకోండి. ఫోన్‌లు, కెమెరాలు, లాప్‌ట్యాప్‌లు వంటివి తడవకుండా వాటిల్లో పెట్టుకోవచ్చు. తడిచిన షూ వంటి వాటిని బాగ్ లో సర్దుకునేటప్పుడు ప్లాస్టిక్‌ కవర్లో ఉంచవచ్చు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories